నీరు చల్లగా ఉండాలంటే.. మట్టికుండ కొనేముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!

Publish Date:Apr 2, 2026

Advertisement



వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు. అయితే ఆరోగ్యంగా చల్లని నీరు తాగాలంటే.. మట్టి కుండలు మంచి ఆప్షన్..  ఇది చల్లదనాన్నే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మార్కెట్లో మట్టి కుండ కొనడం అంత సులభం కాదు. సరైన దానిని ఎంచుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే నీరు అస్సలు చల్లగా ఉండదు. మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు మంచిది  ఎన్నుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.  

మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు..

రంగు వేసిన కుండలు..

 రంగులు వేసిన కుండను ఎప్పుడూ కొనకూడదు. వాటిలో రసాయన రంగులను ఉపయోగిస్తారు, అవి చూడటానికి అందంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరం.

కుండలో రంధ్రాలు..

కుండకు లీకులు లేదా రంధ్రాలు ఉన్నాయేమో తనిఖీ చేయాలి.  కుండ కొనేటప్పుడే కుండలో నీళ్లు నింపి వెంటనే తనిఖీ చేయండి.

కుండ ఆకారం..

కుండ ఆకారాన్ని పరిగణనలోకి తీసుకోడం  చాలా ముఖ్యం. కుండ మరీ పలుచగా లేదా మరీ మందంగా ఉండకూడదు, లేకపోతే నీరు చల్లబడదు. సరైన మందం ఉన్న కుండను ఎంచుకోవాలి.

వెడల్పాటి మూతి..

మార్కెట్లో కుండ కొనేటప్పుడు, వెడల్పాటి మూతి ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానివల్ల కుండను నింపడం, నీటిని తీసివేయడం, శుభ్రపరచడం చాలా సులభం అవుతుంది. దానిలోని నీరు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

                               *రూపశ్రీ.

By
en-us Political News

  
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.