LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏసీ గదుల లో కూర్చిని పాలన సాగించే పద్ధతికి చరమగీతం పాడారు. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కార దినంగా ప్రకటించడం ద్వారా అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు.  అమరావతిలో జరిగిన  కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ..  పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.   సింగపూర్ నమూనా నుండి స్ఫూర్తి పొందిన చంద్రబాబునాయుడు, సమస్యలను స్థానికంగా మండల స్థాయిలో పరిష్కరించాలని నొక్కి చెప్పారు.   అధికారులు  క్షేత్రస్థాయిలో గడిపే సమయాన్ని గరిష్ఠంగా పెంచడానికి..  అన్ని అధికారిక వీడియో కాన్ఫరెన్సులు,  అంతర్గత సమావేశాలు ఇప్పుడు వారానికి ఒక రోజుకు పరిమితం చేశారు. కలెక్టర్లు ఇప్పుడు ప్రతి  నియోజకవర్గాన్ని నెలలో కనీసం నాలుగు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.   అలాగే.. డిసెంబర్ 2027 నాటికి 10 లక్షల ఇళ్లను నిర్మించాలనే భారీ లక్ష్యాన్ని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు.  క్షేత్రస్థాయి ఉనికిని, హై-స్పీడ్ డిజిటల్ ట్రాకింగ్‌ను కలపడం ద్వారా.. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని చేయడం ఒక మేండటరీగా మార్చేశారు. 
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో నేడు ఒక కీలక అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ కాలం పాటు వామపక్షాలు, ఆపై తృణమూల్ కాంగ్రెస్ పాలించిన ఈ రాష్ట్రంలో, ఇప్పుడు కమల దళం అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించింది.  సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల జయజయధ్వానాల మధ్య, రాష్ట్ర గవర్నర్ సువేందు అధికారితో పదవీ ప్రమాణం చేయించారు.   సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే..  కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు.  సువేందు అధికారి  మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో  చేరి ఆ పార్టీలో  కీలక నేతగా ఎదిగారు. ముఖ్యంగా నందిగ్రామ్ రైతాంగ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో అత్యంత కీలకం. అయితే, తృణమూల్ కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గుతోందని భావించిన సువేందు..  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ ను వీడి బీజేపీలో చేరారు.  అప్పట్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఢీకొని విజయం సాధించారు. దీంతో సువేందు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ విజయం ఆయనను బీజేపీలో తిరుగులేని నాయకుడిగా మార్చడమే కాకుండా.. నేడు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేలా చేసింది. ఈ విజయోత్సాహం మధ్యే సువేందు అధికారిపై ప్రతిపక్షాల విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో సువేందు తృణమూల్‌లో ఉన్నప్పుడు ఆయనపై ప్రధాని మోదీ స్వయంగా అవినీతి ఆరోపణలు చేశారనీ.. ఇప్పుడు వాటన్నిటినీ మరిచిపోయి సువేందును ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా, ఆయన ప్రమాణస్వీకారినికి కూడా హాజరవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజనులు  ప్రధాని మోడీ ద్వంద్వ ప్రమాణాలను నిలదీస్తున్నారు.  
కరీంనగర్ జిల్లాలో   రాజకీయ హీట్ పీక్స్ కు చేరింది. గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో  బీఆర్ఎస్  శనివారం ( మే9) కరీంనగర్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో ముందస్తు చర్యగా పోలీసులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ  సందర్భంగా అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసలు వివాదం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా మొదలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటం తీవ్ర చర్చనీ యాంశమైంది.  ఈ ఘటన వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోద్బలం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. అది తమపై చేస్తున్న కుట్ర అని బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.  కాగా బంద్ నేపథ్యంలో కరీంనగర్ లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పాక్షికంగా మూతపడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.   ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతుండగా..  మరోవైపు బీజేపీ నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు.   కరీంనగర్‌లో బంద్ పాటించాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజలు, వ్యాపారులు యధావిధిగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వాణిజ్య సంస్థలు యధావిధిగా తెరిచి ఉంచాలని కోరుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరీంనగర్ జిల్లా రాజకీయం ప్రస్తుతం అట్టుడుకుతోంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో   తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అనూహ్య పతనాన్ని చవిచూసింది. బెంగాల్ ప్రజల చేత దీదీగా పిలిపించుకున్న మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో  పార్టీ పరాజయమే కాదు.. స్వయంగా తన ఓటమినీ చవి చూశారు.  అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పార్టీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేతలను దూరం చేసుకోవడం.. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలే తృణమూల్‌ను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు. సీనియర్లను గౌరవించకుండా.. అభిషేక్ బెనర్జీ   తన వర్గానికే పెద్దపీట వేయడం వల్ల పార్టీ లోపల అసమ్మతి జ్వాలలు చెలరేగి, చివరకు అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు.  నందిగ్రామ్ పోరాటం ద్వారా మమతను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి, అభిషేక్ తీరుతో విసిగిపోయి బీజేపీలో చేరారు. గతంలో నందిగ్రామ్‌లో మమతపై గెలిచిన ఆయన, తాజా ఎన్నికల్లో మమతకు కంచుకోట అయిన భవానీపూర్ స్థానంలోనే ఆమెను ఓడించి చరిత్ర సృష్టించారు. కష్టపడి పనిచేసే నాయకులను పక్కన పెట్టడం వల్ల కలిగే నష్టానికి మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లయింది. అభిషేక్ బెనర్జీ అనుసరించిన  డైమండ్ హార్బర్ మోడల్' పాలనలో అక్రమాలు జరిగాయనీ..  దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై నెపం నెట్టడం..  ఎన్నికల కమిషన్‌తో ఘర్షణ వంటి చర్యలు ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. టీఎంసీలోని పాత తరం నేతలు కూడా అభిషేక్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నారనేది బహిరంగ రహస్యం. మమత   మేనల్లుడికి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం టీఎంసీ పతనానికి దారితీయగా, సువేందు అధికారి పట్టుదల బీజేపీకి బెంగాల్ గడ్డపై మొదటిసారి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ పరిణామాలతో బెంగాల్ రాజకీయాల్లో మమత-అభిషేక్ శకం ముగిసిందని, సువేందు నాయకత్వంలో కొత్త అధ్యాయం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని, కమీషన్ల కోసం ప్రాజెక్టును బలిపెట్టాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు.  రంగారెడ్డి జిల్లా జిల్లేడ్-చౌదరిగూడలో శుక్రవారం నిర్వహించిన 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ'లో  మాట్లాడిన కవిత.. ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.   ప్రాజెక్టు కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినా..  కనీసం 33 ఎకరాలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీరు అందించలేకపోయిందన్న ఆమె.. ఓ గుంటనక్క కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు డిజైన్ మార్చిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ పాయింట్ మార్చడం క్షమించరాని నేరమనీ,  ఈ మార్పు వల్లనే ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు తలెత్తుతున్నాయని కవిత అన్నారు.  అలాగే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఆమె  విమర్శలు గుప్పించారు.  నల్లమల పులి బిడ్డ నని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు.  ప్రాజెక్టు పేరుతో రూ.6 వేల కోట్ల బిల్లులు చెల్లించి రేవంత్ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.  దసరాలోపు పనులు ప్రారంభించకపోతే పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను ఎండగడతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. నీటి పారుదలపై వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)భామ సరయుకి కోపం వచ్చేసింది. అదేనండి మన బద్రి సరయు ఉరఫ్ అమీషా పటేల్(Ameesha Patel)కి. ఇది మాములు కోపం కాదు, ఒక రకంగా సంచలనానికి వేదికగా నిలిచే కోపం. మరి అమీషా కోపం మనతో ఏం చెప్తుందో చూద్దాం  రీసెంట్ గా అమీషా ఎక్స్ వేదికగా స్పందిస్తు  తమ కెరీర్‌లో ఒక్క సినిమా కూడా 200 కోట్లు సాధించని హీరోయిన్లు, తమ పీఆర్ టీమ్స్‌కి  డబ్బులిచ్చి తమని  తాము 'నెంబర్ 1', 'నెంబర్ 2' అని పిలిపించుకుంటున్నారు. అది కేవలం పీఆర్ స్టంట్స్. వాళ్ళకి తెలుసో లేదో తెలియదు. ఇది 2000వ సంవత్సరం కాదు. 2026.. ఇప్పుడు 100 కోట్లు అంటే ఏమీ లేనట్టే. కేవలం సంవత్సరానికి రెండు యావరేజ్ సినిమాలు చేస్తూ, షూటింగ్ సెట్స్‌లో ఉంటేనే స్టార్ అయిపోరు.నేను చేసిన  కహో నా ప్యార్ హై' 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'  గత తేడాది విడుదలైన 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి.కేవలం ప్రచారంతో కాకుండా, థియేటర్లకి వచ్చే జనాన్ని బట్టి ఒక నటి స్థాయిని నిర్ణయించాలని అమీషా తన ట్వీట్ లో తెలిపింది. Also read: Razor: రేజర్ తొలిరోజు కలెక్షన్స్ ఇవేనా!.. ఇక రికార్డులే తరువాయి అమీషా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లోని ప్రస్తుత కాంపిటీషన్, హీరోయిన్ల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ని తెలియచేస్తుంది. ఆమె నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, 'పీఆర్ గేమ్స్' ఆడుతున్నది ఎవరనే దానిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా, 100 కోట్ల క్లబ్ విలువ తగ్గిపోయిందన్న ఆమె మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. 2000 వ సంవత్సరంలో కహా నా ప్యార్ హైతో కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా ఇప్పటి వరకు ముప్పై   సినిమాల వరకు చేసింది. బద్రి ఆమె సెకండ్ మూవీ. ఇంకా పెళ్లి చేసుకోలేదు. వయసు యాభై. స్వస్థలం ముంబై   
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రణబాలి' (Ranabaali). రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ రోజు (మే 9) హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విశెస్ చెబుతూ 'రణబాలి' మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారు. ఎలాంటి కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు అనేది ఈ బర్త్ డే గ్లింప్స్ లో చూపించారు. స్టాలియన్ అనే బ్రీడ్ కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం చాలా కష్టం. అయితే సినిమా కోసం ఎంతైనా కష్టపడే విజయ్.. చాలా ప్రయత్నాలు చేసి, గాయాలకు తట్టుకుని సక్సెస్ ఫుల్ గా హార్స్ రైడింగ్ చేయడం ఈ గ్లింప్స్ లో ఆకట్టుకుంటోంది.  "ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి. అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను." అని విజయ్ చెప్పడం ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషన్ ను తెలియజేస్తోంది. రణబాలి పాత్రలో విజయ్ చేసే హార్స్ రైడింగ్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో హైలైట్ కానున్నాయి. 'రణబాలి' సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.   https://x.com/MythriOfficial/status/2053025690770116893
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు ఆ అంచనాలు రెట్టింపు అయ్యే న్యూస్ వినిపిస్తోంది. ‘పెద్ది’ ప్రమోషన్స్ కోసం లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni) రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాల ప్రమోషన్లు హైదరాబాద్ లేదా చెన్నై వంటి నగరాల నుండి మొదలవుతాయి. కానీ, ‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ టీమ్ జార్ఖండ్ రాజధాని రాంచీని ఎంచుకున్నట్లు సమాచారం. అక్కడ ఒక భారీ ఈవెంట్‌ ను ప్లాన్ చేస్తున్నారట. ధోని సొంత ఊరు రాంచీ కావడంతో, అక్కడ జరిగే ఈ భారీ ఈవెంట్‌ కు ఆయనను చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ‘పెద్ది’ టీమ్ ఉందట. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గా కూడా కనిపించనున్నాడు. అందుకే ధోని గెస్ట్ గా వస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచనట. అన్నీ అనుకున్నట్టు కుదిరి ‘పెద్ది’ ఈవెంట్ కి ధోని హాజరైతే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కి ధోని విపరీతమైన ఫాలోయింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. రాంచీ ఈవెంట్‌తో మొదలయ్యే ఈ ప్రమోషన్లు ‘పెద్ది’ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్తాయో చూడాలి. త్వరలోనే ఈ ఈవెంట్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది.  
  విభిన్న చిత్రాల హీరోగా, దర్శకుడిగా రవిబాబు(Ravibabu)ప్రేక్షకుల మైండ్ సెట్ నుంచి అంత త్వరగా వెళ్ళిపోడు. ప్రేక్షకులు సినిమాకి ఇచ్చే గౌరవం అది. ఈ విషయం తెలిసే రవిబాబు కొంచం గ్యాప్ తీసుకొని నిన్న రేజర్(Razor)తో సెల్యులాయిడ్ పై టేక్ ఆఫ్ అయ్యాడు. మరి తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ సాధించిందో చూడాలి. తొలి రోజు 50 లక్షలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మూవీకి ప్రెజెంట్ పాజిటివ్ టాక్ రన్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మౌత్ టాక్ తో  రేజర్ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. పైగా రేజర్ తో పాటే రిలీజైన గోదారిగట్టుపైన ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రేజర్ కి థియేటర్స్ అదనంగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్ తో  కలిపి సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ అత్యున్న నిర్మాణ విలువలు, సినిమాటిక్ అనుభూతి కోసమే ఆ రేంజ్ లో ఖర్చు చేశారు. మరి ఈ లెక్కన రేజర్ లాభాల్లోకి రావాలంటే 9 కోట్ల రూపాయల షేర్, 17 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంటుందని  ట్రేడ్ వర్గాల టాక్. Also read: Kalki part 2: కల్కి పార్ట్ 2 రిలీజ్ టైం ఇదేనా!. ఇదే నిజమైతే అందరికి పండగే   ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై రవిబాబునే స్వయంగా నిర్మించగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెంటర్‌గా వ్యవహరించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రణవి మానుకొండ, ప్రదీప్ ఆంటోనీ, దావూది జివాల్, తనీష్, ఇనయా సుల్తానా కీ రోల్స్   పోషించారు. రవిబాబు ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం తన ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లతోనే  రవిబాబు రేజర్ పై హైప్ తీసుకొచ్చాడు   
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో సీనియర్ నిర్మాత తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ (85) శనివారం (మే 9, 2026) హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు.  కాకర్ల కృష్ణ ప్రముఖ నిర్మాణ సంస్థ 'జగపతిస ఆర్ట్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1974లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'ఇంటింటి కథ' చిత్రంతో ఆయన పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. సామాన్య స్థాయి నుండి స్వయంకృషితో నిర్మాతగా ఎదిగి, పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. కాకర్ల కృష్ణ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ పెద్దలు పేర్కొన్నారు.
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ఫ్యాన్స్ కి అతి పెద్ద గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇండియన్ మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్  కల్కి 2(Kalki Part 2)రిలీజ్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో ఒక్కడే ఒక్కడు మొనగాడు అనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి అదే కనుక నిజమైతే ఫ్యాన్స్, మూవీ లవర్స్, ఆడియెన్స్, సెల్యులాయిడ్ కి అతి పెద్ద పండుగ ముందే వచ్చినట్లవుతుందని చెప్పవచ్చు . ఆ డీటెయిల్స్ చూద్దాం  డిసెంబర్ 2027లో కల్కి పార్ట్ 2 ని  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి కల్కి ఉన్న ప్రోటాన్షియల్ దృష్ట్యా చాలా మంది 2028 లో కల్కి రిలీజ్ అవుతుందని భావిస్తు వస్తున్నారు. కానీ 2027 డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. మరి అదే నిజమైతే కల్కి ఫ్యాన్స్ కి పండుగ కొంచం ముందే వచ్చినట్లవుతుంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మధ్య కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించారు. ప్రభాస్ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్టులైన 'ఫౌజీ' 'స్పిరిట్' తో బిజీగా ఉండటం వల్ల,ఈ ఏడాది చివర్లో లేదా ఆగష్టు లేదా సెప్టెంబర్ లో కల్కి సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.   Also Read: Chiranjeevi: మెహర్ రమేష్ కూతురు ఎంగేజ్ మెంట్ వీడియో వైరల్.. గత నెల 26 న చిరు ఏం చేసాడో తెలుసా!  పార్ట్-1 కంటే రెట్టింపు స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ,యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin)ప్లాన్ చేస్తున్నాడు. మరి కర్ణ, అశ్వత్థామ కలిసి యాస్కిన్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.   
నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ (CARPENTER) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. కొరటాల శివ తన ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక అంశాన్ని అంతర్లీనంగా చూపిస్తూనే, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలివేషన్స్ ఇస్తుంటారు. బాలయ్య కోసం ఆయన ఈసారి ఒక విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 'కార్పెంటర్' అనే టైటిల్‌ను బట్టి చూస్తుంటే, ఒక సామాన్యుడు వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దాడు అనే కోణంలో కథ సాగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్. బాలకృష్ణ సినిమాకు అనిరుధ్ తొలిసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కొరటాల గత చిత్రం 'దేవర'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుధ్.. బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లో 112వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ను SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2027 సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  బాలకృష్ణ మార్క్ యాక్షన్, కొరటాల శివ మార్క్ రైటింగ్, అనిరుధ్ మ్యూజిక్.. ఈ మూడు కలిస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ‘కార్పెంటర్’గా బాలయ్య చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.   
  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి సోదరుడి వరుస అయ్యే  మెహర్ రమేష్(Meher Ramesh)దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తుడే. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశంతో కంత్రి దగ్గరనుంచి భోళా శంకర్ వరకు మొత్తం ఏడు సినిమాలు తెరకెక్కించాడు. రీసెంట్ గా మెహర్ రమేష్ తన కూతురు మోహన నిశ్చితార్థం వీడియోని  సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో సోషల్ మీడియా కొత్త న్యూస్ తో కళకళ లాడుతూ ఉంది. మరి ఆ వేడుక డీటెయిల్స్ చూద్దాం చిరంజీవి, సురేఖ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి దంపతుల చేతుల మీదుగానే కాబోయే వధూవరులు మోహన(Mohana),అనిరుధ్(Anirudh)ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం చిరంజీవి స్వయంగా దగ్గరుండి కొత్త జంటని  ఆశీర్వదిం చాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు అభిమానులని  ఆకట్టుకుంటున్నాయి. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, సునీల్, నమ్రతా శిరోద్కర్, సితార ఘట్టమనేని, దర్శకుడు వి.వి. వినాయక్ తదితరులు హాజరై కొత్త జంటకి  శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను దీవించారు.  Also read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రియాలిటీ మూవీ.. టార్గెట్ ఆ వ్యక్తులేనా!  ముఖ్యంగా మహేష్ బాబు గారాల పట్టి సితార ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహేష్ నుంచి వచ్చిన 'బాబీ' మూవీలో మెహర్ రమేష్ మహేష్ ఫ్రెండ్ గా చేసాడు. అప్పట్నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. మోహన ,అనిరుధ్  వివాహం ఈ ఏడాది చివరలోనే జరగనున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.గత నెల 26 న ఎంగేజ్ మెంట్ జరగగా అభిమానుల కోసమే మెహర్ సదరు వీడియోని రిలీజ్ చేసాడు.  
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ‘రౌడీ జనార్ధన’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘రౌడీ జనార్ధన’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన విజయ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ కూడా వేరే లెవెల్ లో ఉంది. "A man who fights the world.. but surrenders only to love... (ప్రపంచంతో పోరాడే మనిషి... కేవలం ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు) అంటూ మేకర్స్ ఈ పోస్టర్ విడుదల చేయడం విశేషం. మాస్ లుక్‌లో విజయ్ ఊచకోత! ‘రౌడీ జనార్ధన’ పోస్టర్ లో విజయ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. వర్షంలో తడుస్తూ, పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసం, చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న విజయ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా పోస్టర్‌లో ఒక మహిళ పాదం విజయ్ గుండెలపై ఉన్న తీరు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా అని పోస్టర్ డిజైన్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ‘రౌడీ జనార్ధన’ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ‘రౌడీ జనార్ధన’తో మళ్ళీ తన సత్తా చాటుతాడని రౌడీ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.   https://x.com/SVC_official/status/2052971307525087614
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్, తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో.. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను గవర్నర్ కార్యాలయానికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (Thalapathy Vijay) వివాదానికి కారణం? గవర్నర్‌తో జరిగిన కీలక సమావేశంలో విజయ్ వెంట ఇద్దరు వ్యక్తులు కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారు మరెవరో కాదు.. ఒకరు 'జననాయగన్' నిర్మాత వెంకట్ కె. నారాయణ (కర్ణాటక), మరొకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రానైట్, మైనింగ్ వ్యాపారవేత్త విష్ణు రెడ్డి. పార్టీలో ఎలాంటి అధికారిక పదవులు లేని, రాజకీయాలకు సంబంధం లేని ఈ ఇద్దరు వ్యక్తులు.. ప్రభుత్వ ఏర్పాటు వంటి అత్యంత కీలకమైన చర్చల సమయంలో లోక్ భవన్‌లో ఎందుకు ఉన్నారని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. "తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించే చర్చల్లో కర్ణాటకకు చెందిన సినీ నిర్మాతకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారికి ఏం పని?" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రేపు వీరే వెనుక నుండి ప్రభుత్వం నడుపుతారా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రైవేట్ వ్యక్తులను అధికారిక భేటీలకు గవర్నర్ కార్యాలయం ఎలా అనుమతించిందనే కోణంలోనూ వివరణ కోరుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే, తన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, అధికారిక భేటీలకు వ్యాపారవేత్తలను, నిర్మాతలను తీసుకెళ్లడం వల్ల రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వివాదంపై విజయ్ లేదా టీవీకే వర్గాలు ఎలాంటి వివరణ ఇస్తాయో వేచి చూడాలి. రాజకీయ ఉత్కంఠ ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగానే, మరోవైపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. VCK పార్టీ ఇంకా విజయ్‌కు మద్దతు లేఖ ఇవ్వలేదు. IUML పార్టీ డీఎంకే కూటమిలోనే ఉండాలని నిర్ణయించుకోవడం విజయ్ కూటమి లెక్కలను మారుస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 118 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం 116 ఉన్నారు. VCK పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ చర్చలు జరుపుతున్నారు.  
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మీ జుట్టు - మీ ఆత్మవిశ్వాసం జుట్టు రాలడం లేదా చిట్లిపోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనలో చాలా మంది జుట్టు పొడవుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, జుట్టు పెరుగుదల అనేది ప్రధానంగా మన జెనెటిక్స్ (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్న జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మనం జుట్టు పట్ల ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) సహజ సౌందర్యం: మీ జుట్టు కర్లీగా ఉన్నా లేదా స్ట్రెయిట్‌గా ఉన్నా, అది మీ ప్రత్యేకత. దాన్ని ప్రేమించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. శాశ్వత నష్టాన్ని నివారించడానికి: జుట్టు ఒకసారి తీవ్రంగా దెబ్బతింటే (పర్మనెంట్ డామేజ్), అది మళ్ళీ పూర్వస్థితికి రావడం కష్టం. ఆరోగ్యకరమైన పెరుగుదల: క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా (Split ends) చూడవచ్చు, దీనివల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇవి అస్సలు చేయకండి! (What Not To Do) అధిక వేడి (High Heat): హెయిర్ స్టైలింగ్ కోసం 180°C కంటే ఎక్కువ వేడిని ఎప్పుడూ వాడకండి. ఇది మీ జుట్టును శాశ్వతంగా దెబ్బతీస్తుంది. బిగుతైన కేశాలంకరణ (Tight Hairstyles): జుట్టును చాలా గట్టిగా వెనక్కి లాగి ముడి వేయడం లేదా పోనీటైల్ వేయడం వల్ల ట్రాక్షన్ అలోపేషియా (Traction Alopecia) అనే సమస్య వస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిన చోట మళ్ళీ మొలవదు. అతిగా కెమికల్ ట్రీట్‌మెంట్స్: కెరాటిన్, స్మూతనింగ్ లేదా పర్మింగ్ వంటివి తరచుగా చేయించుకోవడం వల్ల జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. నిరంతరం షాంపూలు మార్చడం: షాంపూ అనేది కేవలం జుట్టును శుభ్రం చేసే సోప్ వంటిది మాత్రమే. ఇది జుట్టు పెరుగుదలను ఆపలేదు లేదా పెంచదు. కేవలం అలర్జీలు ఉంటే తప్ప, పదే పదే షాంపూలు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జుట్టు సంరక్షణ కోసం చిట్కాలు (How To Take Care) సహజమైన మాస్క్‌లు: ఇంట్లోనే లభించే అవిసె గింజల జెల్ (Flaxseed gel), కలబంద (Aloe vera), మెంతులు మరియు మందార ఆకులను వాడండి. ఇవి జుట్టుకు మంచి స్మూతనింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. సరైన వేడి వద్ద స్టైలింగ్: మీరు తప్పనిసరిగా స్టైలింగ్ చేయాలనుకుంటే, వేడిని 140°C నుండి 160°C మధ్య మాత్రమే ఉంచండి. రెగ్యులర్ ట్రిమ్మింగ్: జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి ప్రతి 6 వారాలకు లేదా కనీసం రెండు నెలలకు ఒకసారి కొద్దిగా ట్రిమ్ చేయించుకోండి. లూజ్ హెయిర్ స్టైల్స్: జుట్టును వదులుగా ఉండేలా చూసుకోండి. స్లీక్ స్టైల్స్ (Sleek styles) కంటే సహజమైన జుట్టును ప్రదర్శించడం ఎంతో మంచిది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: చివర్లు కట్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా?  జ: లేదు. జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా ఉంటుంది కానీ, పెరుగుదల అనేది రూట్ (స్కాల్ప్) నుండి జరుగుతుంది. ప్ర: హెయిర్ బోటాక్స్ (Hair Botox) సురక్షితమేనా?  జ: ఇది ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. ఇది పర్మనెంట్ కాదు, కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది. దీనికంటే సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం. ప్ర: షాంపూ మార్చడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా?  జ: షాంపూ మార్చడం వల్ల నేరుగా హెయిర్ ఫాల్ అవ్వదు. కొన్నిసార్లు అందులోని కొత్త కాంపోనెంట్స్ పడకపోతే అలర్జీ రావచ్చు, కానీ హెయిర్ ఫాల్ అనేది ఇతర కారణాల వల్ల (జెనెటిక్స్ లేదా ఒత్తిడి) జరగవచ్చు. జుట్టు ఆరోగ్యం అనేది మీరు దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ జుట్టును మెరిసేలా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన అలవాట్లే మీ జుట్టుకు నిజమైన బలం. మరిన్ని హెల్త్ టిప్స్ మరియు హెయిర్ కేర్ రహస్యాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. పరిచయం: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి, కానీ అందరి జీవితాల్లోనూ ప్రేమించిన వారితోనే ప్రయాణం సాధ్యం కాకపోవచ్చు. ఇంటి సభ్యుల ఒత్తిడి వల్లో లేదా ఇతర పరిస్థితుల వల్లో ప్రేమించిన వ్యక్తిని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది మానసిక సంఘర్షణతో కూడుకున్న విషయం. ఇలాంటి సమయంలో కేవలం మీ బాధనే కాకుండా, మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి జీవితాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వెబ్‌సైట్ కంటెంట్ ద్వారా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించబోతున్నాం. మనం వాస్తవాన్ని ఎందుకు అంగీకరించాలి? (Why should we accept the reality?) జీవితంలో మార్పులు సహజం. మీరు ఒక బంధం నుండి బయటకు వచ్చి మరొక బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాస్తవాన్ని అంగీకరించడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ చూడండి: అవతలి వ్యక్తి జీవితం మీ బాధ్యత: మీ జీవితం అనుకున్నట్లు జరగలేదని, మీతో నూతన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి జీవితాన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. కొత్త ఆశలు మరియు కలలు: పెళ్లి చేసుకున్న కొత్తలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు, అందమైన ప్రపంచాన్ని చూడాలనే కలలు ఉంటాయి. మీ గత బాధతో వారి కలలను చిధ్రం చేయకూడదు. మానసిక ప్రశాంతత: గతాన్ని పట్టుకుని వేలాడటం వల్ల మీకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. నిజాన్ని అంగీకరించినప్పుడే మీరు వర్తమానంలో జీవించగలరు. ముఖ్యంగా చేయకూడని పనులు (What NOT to do?) కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి: నిరాసక్తత చూపడం: భాగస్వామితో మాట్లాడకుండా ఉండటం, కుటుంబ సభ్యులతో కలవకుండా ముభావంగా ఉండటం వల్ల అవతలి వారి జీవితం కూడా నాశనమవుతుంది. మూడ్ స్వింగ్స్‌ను ప్రదర్శించడం: మీ పాత జ్ఞాపకాల వల్ల వచ్చే కోపాన్ని లేదా బాధను మీ భాగస్వామిపై చూపించడం ఎథికల్ గా (నైతికంగా) సరైనది కాదు. అబద్ధాలు చెప్పడం: మీ గత బంధం చాలా బలమైనది అయితే, ఆ విషయాన్ని దాచిపెట్టి మోసం చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి? (How to handle the situation?) ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి కొన్ని సూచనలు: సమయం తీసుకోండి: పాత బంధం నుండి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే పెళ్లికి సిద్ధపడాలి. ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. నిజాయితీగా ఉండండి: ఒకవేళ మీ గతం చాలా లోతైనది అయితే, మీ కాబోయే భాగస్వామికి ఆ విషయం చెప్పి, వారిని ఒప్పించి లేదా వారి అభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కొత్త బంధానికి ప్రాధాన్యత ఇవ్వండి: పెళ్లయిన తర్వాత ఇది మీ జీవితం అని గుర్తించి, పాత కథలను పక్కన పెట్టి కొత్త జీవితం అనే సముద్రంలో ప్రయాణించడం ప్రారంభించాలి. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్రశ్న 1: ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పోతున్నాను, అప్పుడు పెళ్లి చేసుకోవడం సరైనదేనా?  సమాధానం: పాత బంధం నుండి మీరు పూర్తిగా బయటకు రాకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ముందుగా ఆ ఆలోచనల నుండి బయటపడటానికి సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్న 2: పెళ్లయిన తర్వాత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి?  సమాధానం: మీ భాగస్వామికి కొత్త కలలు ఉంటాయి. వారితో కలిసిమెలిసి ఉండటం, కుటుంబంతో మమేకం అవ్వడం ద్వారా మీ బాధను తగ్గించుకోవచ్చు. మీ లోపల బాధ ఉన్నా, దాన్ని భాగస్వామిపై చూపించకూడదు. ప్రశ్న 3: గత రిలేషన్ షిప్ గురించి భాగస్వామికి చెప్పాలా?  సమాధానం: అది చాలా బలమైన బంధం అయితే ఖచ్చితంగా చెప్పాలి. నిజం దాచి పెళ్లి చేసుకుంటే, రేపు ఏదైనా తెలిసినప్పుడు అది మోసంగా మారుతుంది మరియు బంధం దెబ్బతింటుంది.  జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే మీ వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ నాశనమవుతాయి. జరిగిన దాన్ని అంగీకరించి (Accept the reality), మీకు తోడుగా వచ్చిన వ్యక్తికి అన్యాయం జరగకుండా చూసుకోవడమే నిజమైన మానవత్వం. మీ జీవితాన్ని బాధ్యతాయుతంగా మలుచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా "Naveena Column" యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి..  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  ఖచ్చితంగా, లైపోసెక్షన్ మరియు టమ్మీ టక్ గురించి మీ వెబ్‌సైట్ కోసం పాఠకులను ఆకట్టుకునేలా మరియు భావోద్వేగాలను స్పృశించేలా రూపొందించిన సమాచారం ఇక్కడ ఉంది: మీ కలల రూపం మీ సొంతం: లైపోసెక్షన్ మరియు బాడీ కాంటౌరింగ్ గురించి పూర్తి అవగాహన మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పదిమందిలోకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన దుస్తులు వేసుకోలేక, బాడీ షేప్ సరిగ్గా లేదని ఇబ్బంది పడే పరిస్థితులు ఎందరికో ఎదురవుతుంటాయి. మీ ఈ ఆవేదనను అర్థం చేసుకుని, మీకు సరైన ఆకృతిని ఇచ్చే అద్భుతమైన ప్రక్రియే 'లైపోసెక్షన్'. మనం ఈ చికిత్స ఎందుకు చేయించుకోవాలి? (Why Should We?) లైపోసెక్షన్ అనేది కేవలం కొవ్వును తీసేయడం మాత్రమే కాదు, అది మీ శరీరానికి ఒక కొత్త రూపాన్ని, మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మొండి కొవ్వు నుండి విముక్తి: వ్యాయామంతో తగ్గని లవ్ హ్యాండిల్స్, డబల్ చిన్, మరియు చేతుల దగ్గరి కొవ్వును ఇది సులభంగా తొలగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుదల: ముఖ్యంగా యువతలో గైనకోమాస్టియా (పురుషులలో ఛాతి పెరగడం) వంటి సమస్యల వల్ల కలిగే మానసిక ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది. సరైన శారీరక ఆకృతి: హై డెఫినిషన్ లైపోసెక్షన్ ద్వారా జిమ్‌కు వెళ్లినప్పుడు వచ్చే సహజమైన బాడీ లైన్స్‌ను కూడా పొందవచ్చు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు: పొట్ట భాగం కిందకు సాగిపోవడం వల్ల వచ్చే అలర్జీలు, రాషెస్ మరియు అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. లైపోసెక్షన్ ఎలా చేస్తారు? (How it works?) ఇది చాలా సరళమైన మరియు సురక్షితమైన ప్రక్రియ. చిన్న గాటు: కేవలం 1.5 నుండి 2 mm వరకు ఉండే అతి చిన్న రంధ్రం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫ్యాట్ సక్షన్: ఒక చిన్న ట్యూబ్ సహాయంతో శరీరంలోని అదనపు కొవ్వును బయటకు సక్ (Suck) చేస్తారు. త్వరిత కోలుకోవడం: సర్జరీ జరిగిన రోజే లేదా మరుసటి రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండు రోజుల తర్వాత మీ సాధారణ పనులు కూడా చేసుకోవచ్చు. టమ్మీ టక్ (Tummy Tuck): పొట్ట భాగం మరీ ఎక్కువగా సాగిపోయిన వారికి ఆ అదనపు చర్మాన్ని తీసేసి, బొడ్డును కూడా సరిచేసి మంచి షేప్ ఇస్తారు. ఏం చేయకూడదు? (What Not to Do?) లైపోసెక్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్రింది విషయాలలో జాగ్రత్తగా ఉండాలి: బరువు తగ్గడానికి కాదు: లైపోసెక్షన్ అనేది బరువు తగ్గడానికి చేసే చికిత్స అని నమ్మవద్దు; ఇది కేవలం శరీర ఆకృతిని (Body Shaping) మార్చడానికి మాత్రమే. ధూమపానం వద్దు: సర్జరీకి 2-3 వారాల ముందు మరియు తర్వాత ఖచ్చితంగా స్మోకింగ్ మానేయాలి. అన్-సర్టిఫైడ్ డాక్టర్లు వద్దు: అనుభవం లేని వారితో కాకుండా, కేవలం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ ద్వారానే ఈ చికిత్స చేయించుకోవాలి. నియమాలను అతిక్రమించవద్దు: డాక్టర్ సూచించిన లిమిట్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీయమని ఒత్తిడి చేయకూడదు, అది ప్రమాదకరం కావచ్చు. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: లైపోసెక్షన్ సురక్షితమేనా?  జ: అవును, అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్ ద్వారా నియమిత పరిమితుల్లో చేయించుకుంటే ఇది 100% సురక్షితం. ప్ర: సర్జరీ తర్వాత మచ్చలు కనిపిస్తాయా?  జ: లైపోసెక్షన్ రంధ్రాలు చాలా చిన్నవి కాబట్టి మచ్చలు తెలియవు. టమ్మీ టక్ చేసినా ఆ గీత మీ ఇన్నర్ వేర్ లైన్ లోపలికే ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. ప్ర: సర్జరీ తర్వాత మళ్ళీ కొవ్వు చేరుతుందా?  జ: సర్జరీ తర్వాత హెల్దీ డైట్ పాటించడం మరియు డాక్టర్ సూచించిన విధంగా 4-6 వారాల పాటు కంప్రెషన్ గార్మెంట్స్ ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందంగా కనిపించాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం అందించిన ఈ అద్భుత చికిత్సలతో మీ కలల రూపాన్ని పొందడం ఇప్పుడు సులభం. భయపడాల్సిన అవసరం లేదు, సరైన నిపుణులను సంప్రదించి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సి. జ్యోతి (Dr. C. Jyothi) గారు ఈ VIDEO లో స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యాంశాలు: PCOD అంటే ఏమిటి?: అండాశయాల్లో నీటి బుడగలు ఎందుకు ఏర్పడతాయి? గుర్తించడం ఎలా?: నెలసరి క్రమం తప్పడం, ముఖంపై మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాల విశ్లేషణ. ముఖ్య కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి పాత్ర. శాశ్వత పరిష్కారం: ఆహార నియమాలు మరియు వ్యాయామం ద్వారా PCOD ని ఎలా జయించవచ్చు? మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి TeluguOne లోని ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి (సబ్‌స్క్రైబ్ చేయండి!)
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)