బెజవాడ మేయర్ ఎన్నిక: తెరపైకి కాపు, కమ్మ కోణం.. విజయసాయి వ్యూహం ఏంటి.?
Publish Date:Oct 19, 2026
Advertisement
విజయవాడ మేయర్ ఎన్నికలో కమ్మ, కాపు సామాజికవర్గ కోణం తెరపైకి వచ్చింది. ఈ కోణాలన్ని తెరపైకి తీసుకు వచ్చింది రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకునే ఆయనీ కోణాన్ని తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి తాజా వ్యాఖ్యలు.. బెజవాడ మేయర్ బరిలో నిలిచిన వంగవీటి రాధ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావులపై కేంద్రీకృతమై ఉన్నాయి. కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏబీవీకి విభేదాలు ఉన్నాయని రిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఇలాంటి విభేదాలు ఇప్పటికే బహిరంగంగా చర్చనీయాంశంగా ఉన్నప్పుడు, మేయర్ బరిలో చంద్రబాబు ఆయనకు ఎలా మద్దతు ఇస్తారన్న ఆరోపణలు, వ్యాఖ్యలు అభూతకల్పనలని వారు విజయసాయి వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నారు. అదలా ఉంటే.. నిన్నమొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధ.. ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరి బెజవాడ మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు నేల విడిచి సాము చందంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి ఇటీవలి కాలంలో తన పొలిటికల్ కామెంట్సన్నీ కుల, మత, ప్రాంతీయ సమీకరణల చుట్టూనే తిరుగుతున్న విషయాన్ని కూడా వారు ఎత్తి చూపుతున్నారు. బెజవాడ మేయర్ మేయర్ ఎన్నికల బరిలో జనసేన తరఫున రాధ, వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్. భాగ్యలక్ష్మి, వామపక్ష పార్టీల మద్దతుతో ఏబీ వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ ఉన్న సంగతి తెలిసిందే.
[Vijayasai Reddy, Vijayawada ఛayoral ఆlections, Vangaveeti Radha, AB Venkateswara Rao, Andhra Pradesh politics, Caste, Comments, Telugu One]
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-25-234760.html




