తెలుగువన్ ఎప్పుడో చెప్పింది... జాతీయ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది!
Publish Date:Aug 31, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో త్వరలో కొత్త కూటమి ఏర్పడనుందని ఇప్పుడు జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయాన్ని తెలుగువన్ ఎప్పుడో చెప్పింది. . తెలుగుదేశం నాలుగేళ్ల తరువాత, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) లోకి తిరిగి రాబోతున్నట్లు జాతీయ మీడియా ఇప్పుడు చెబుతోంది. కానీ ఏపీలో కొత్తటమి కొలువుదీరనున్నదని తెలుగువన్ గతంలోనే చెప్పేసింది. ఏపీ తెలంగాణలలో పరస్పర ప్రయోజనాల పరిరక్షణకు తెలుగుదేశం, బీజేపీలు దగ్గర కాబోతున్నాయని వెల్లడించిన తెలుగువన్ ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అన్న కథనంలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరౌతున్న విషయాన్నికళ్లకు కట్టినట్లు వివరించింది. ఇప్పుడు జాతీయ మీడియా కూడా అదే కోణంలో కథనాలు ప్రసారం చేస్తున్నది. నాలుగేళ్ల కిందట తెగతెంపులు చేసుకుని వెళ్లిన తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్‌డీఏలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుయనీ, ఆంధ్ర, తెలంగాణల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తున్నదనీ రిపబ్లిక్ టీవీ చానల్ ఓ కథనం ప్రసారం చేసింది. ఈ చానల్ బీజేపీకి అనుకూలమన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని.. అందుచేత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని చానల్ వెల్లడించింది. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి.. ఐదు నిమిషాలు ముచ్చటించిన విషయాన్ని ప్రస్తావించింది. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చిందని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు.. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది. ‘2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ తెగతెంపులు చేసుకున్నాయి. హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ టీడీపీ మోదీ కేబినెట్ నుంచి వైదొలగింది. ఇటు బీజేపీ కూడా ఆంధ్రలో చంద్రబాబు మంత్రివర్గానికి గుడ్‌బై చెప్పింది.ఆసందర్భంలో రెండు పార్టీలూ కూడా పరస్పరం ఆరోపణలు గుప్పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ ఇప్పటికీ తెలుగురాష్ట్రాలలో పరిస్థితులలో గణనీయ మార్పు వచ్చిందని పేర్కొన్న ఆ మీడియా టీడీపీ ఎన్‌డీఏలో చేరే అవకాశముందని వివరించింది.
http://www.teluguone.com/news/content/teluguone-said-long-back-now-national-media-saying-the-same-25-142997.html





