తిరగబడిన తెలుగు బిడ్డ!

Publish Date:Aug 5, 2023

Advertisement

పుంగనూరులో వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య దాడులు ఏపీలో   అరాచక పాలనకు తాజా నిదర్శనం.  గత ఐదు రోజులుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులెన్ని, ప్రాజెక్టుల నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏంత?  ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టమెంత అన్నది ప్రజలకు వివరించడమే ఈ పర్యటన ఉద్దేశం. గత నాలుగు రోజులుగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకోలేక దిక్కులు చూస్తున్న వైసీపీ శ్రేణులు.. ముందుగా టాపిక్ డైవర్షన్ తతంగం మొదలు పెట్టారు. అయితే, చంద్రబాబు దాన్ని కూడా తిప్పికొట్టడంతో.. ఇక తమ పప్పులు ఉండకవని భావించిన వైసీపీ  దాడులతో ఉద్రిక్తతలకు తెర తీసింది.

అందులో భాగమే చంద్రబాబు పుంగనూరు పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వందల సంఖ్యలో కార్యకర్తలను పురమాయించడం. అన్నమయ్య జిల్లా మీదగా చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్తున్న చంద్రబాబును అడ్డుకొనేందుకు అంగళ్ల నుండే వైసీపీ తన అరాచకత్వాన్ని తార స్థాయిలో ప్రదర్శించింది. పక్కా ప్రణాళికతో  వైసీపీ నేతలు, కార్యకరత్తుల టీడీపీ శ్రేణులపై దాడులకు దిగారు. దీనికి పోలీసుల అండదండలు తోడవడంతో పుంగనూరు శివారు బైపాస్ రోడ్డు రణరంగంగా మారింది. చంద్రబాబును పుంగనూరులో అడుగపెట్టనివ్వబోమని వైసీపీ శ్రేణులు సవాల్ విసరడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఎలా అడ్డుకుంటారో చూస్తామని తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ శ్రేణులు వందల సంఖ్యలో చేరినా.. పోలీసులు అడుగుగడుగునా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నా.. టీడీపీ కార్యకర్తలు దీటుగా సమాధానం చెప్పారు.

పుంగనూరు ఘర్షణలను చూస్తే టీడీపీ తెగింపు స్పష్టంగా కనిపిస్తున్నది. గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు అరాచకాలను భరించి భరించి ఉన్న టీడీపీ శ్రేణులు ఇక సమరమే అన్నట్లుగా తిరగబడ్డారు. టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా రాజకీయాలలో ఒక  ప్రత్యేక గుర్తింపు ఉంది.  కానీ  ప్రత్యర్థి కదలికలు తనను కబళిస్తుంటే చూస్తూ ఉండే చేతగానితనం ఇసుమంతైనా  ఉండకూడదని టీడీపీ నిర్ధారించుకున్నట్లు   పుంగనూరు ఘటన తేటతెల్లం చేస్తున్నది. చావో రేవో ఇక ఈ అరాచకానికి చరమగీతం తప్పదనేలా పసుపు సైన్యం సమరశంఖం పూరించినట్లే కనిపిస్తుంది. తన ఉనికినే ప్రశ్నించే శత్రువుకు యుద్ధ నీతితోనే జవాబు ఇవ్వాలనే సూత్రాన్ని టీడీపీ పుణికిపుచ్చుకున్నట్లు ఈ సంఘటన కళ్ళకు కడుతున్నది.

ఇక ఎప్పుడూ శాంతం శాంతం అనే చంద్రబాబు కూడా ఒకదశలో ఇక తప్పదు సమరమే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారంటే ఇక్కడ వైసీపీ శ్రేణుల అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు.  కట్టుబాట్లు మీరకుండా తన క్యాడర్ ను నడిపించాలని భావించే చంద్రబాబు.. పుంగనూరు గూండాలపై తిరగబడాల్సిందే తమ్ముళ్లూ అంటూ అవుట్ అయిపోయారంటే ప్రభుత్వంలో పెనవేసుకుపోయిన రౌడీల పాలనలో ఎంత విసిగిపోయారో స్పష్టం అవుతున్నది.

వందల మందిని పోగేసుకొని పార్టీకి దేవాలయం లాంటి కార్యాలయంపై వీధి రౌడీల్లా దాడులు చేసినా, చట్టపరంగానే ముందుకు వెళ్దాం హింస మన సిద్ధాంతం కాదన్న చంద్రబాబు.. ఓ వైసీపీ గుండా పార్టీ అధికార ప్రతినిధి కారుపై కర్రలతో దాడికి దిగినా ప్రజలే బుద్ధి చెప్తారని సముదాయించిన చంద్రబాబు.. పార్టీకి దైవ సమానులైన కార్యకర్త రక్తం కళ్ళకి కనిపించడంతో యుద్ధ నినాదం అందుకోవాల్సి వచ్చారని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏకమై తమపై దాడికి దిగితే దెబ్బతిన్న సింహంలా జూలు విదిల్చి  టీడీపీ వేట మొదలు పెట్టింది. హింసావాదం సమాజానికి మంచిది కానే కాదు.. కానీ, శత్రువు సమరానికి దిగిన తర్వాత తప్పదు యుద్ధమే చేయాలన్నట్లు మారిపోయింది ఇప్పుడు ఏపీలో రాజకీయం.

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.