నవరత్నాలు కాదు నవ మోసాలు

Publish Date:Jun 29, 2023

Advertisement

నవరత్నాల పేరిట జగన్నాటకాన్ని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు బట్టబయలు చేశారు. జగన్ నవరత్నాల బాగోతంపై తెలుగుదేశం నివేదికను ఆయన విడుదల చేశారు.    ప్రకాశించని నవరత్నాలు-జగన్ మోసపు లీలలు పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో జగన్ సర్కార్ అబద్ధపు హామీల నిగ్గు తేల్చారు.  

వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని అచ్చన్నాయుడు పేర్కొన్నారు. పాదయాత్ర హామీలు 10 శాతం కూడా అమలు చేయలేదనీ, నవరత్నాల హామీల్లో 25 శాతం కూడా అమలు చేయలేదనీ పేర్కొన్నారు. ఫేక్ సీఎం ఫేక్ మాటలు తప్పుడు ప్రచారంతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారనీ, రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదనీ నివేదిక పేర్కొంది. అలాగే  వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదనీ, పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2  ఇంత వరకూ అమలు కాలేదని పేర్కొంది.  అమ్మఒడి కింద ఇచ్చిన  రెండు హామీలూ అమలు కాలేదని అచ్చన్నాయుడు అన్నారు. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5 హామీల పరిస్థితీ అంతేనని అన్నారు.  

బోధనారుసుం కింద ఇచ్చినరెండు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన 3మూడు హామీలూ పెండింగ్‍లోనే ఉన్నాయన్నారు.  మద్యనిషేధమంటూ ఇచ్చిన  హామీ  పరిస్థితీ అంతేనని, అలాగే వైఎస్సార్ ఆసరా, చేయూత కింద  ఇచ్చిన నాలుగు హామీలూ నెరవేరలేదని అచ్చన్నాయుడు అన్నారు.   నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందడం లేదనీ, జగన్ చెప్పే మాటలన్నీ అసత్యాలేనని అచ్చన్నాయుడు విమర్శించారు.  ఎన్నికల ముందు చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేసింది మరొకటి అన్నారు.  అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామన్నారనీ, కానీ ఇచ్చింది మాత్రం రూ.13 వేలేనన్నారు.  రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నారన్నారు.

 తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమంద్వారా ప్రతి మహిలకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించామని అచ్చన్నాయుడు చెప్పారు. ఫించన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు ఇచ్చాం - మేం 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే ప్రస్తుత వైసీపీ సర్కార్ మాత్రం 62 లక్షల మందికి  మాత్రమే పిఛను ఇస్తోందన్నారు.  జగన్ సర్కార్ 10 లక్షల మందికి పింఛన్ తొలగించిందనీ, ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తోందనీ అచ్చన్నాయుడు విమర్శించారు. 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.