ఆర్టీసీ చైర్మన్ గా కొండా సురేఖ?

Publish Date:Sep 15, 2026

Advertisement

తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.  

అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   


[Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.