తెలుగుదేశం టార్గెట్ లో వాయలార్ రవి?
Publish Date:May 18, 2012
Advertisement
వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తీవ్ర కృషి చేస్తున్న వాయిలార్ రవిపై బాణాలు ఎక్కుపెట్టడానికి తెలుగుదేశంపార్టీ సన్నాహాలు చేస్తోంది. ఆయన గత చరిత్రపై ఆరాలు తీస్తోంది. కేరళలో ఆయన పనితీరు ఎలా వుండేది అక్కడ ఆయనపై ఏమైనా ఆరోపణలు వచ్చాయా? అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాయిలార్ రవికి వ్యతిరేకంగా ఏమైనా సమాచారం దొరికితే ఆయనను టార్గెట్ చేస్తూ విమర్హ్షలు గుప్పించాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు తెలిసింది. నిన్నటి దాకా రాజకీయపెద్దగా, పిసిసి చీఫ్ కు గురువుగా వాయలార్ రవికి రాష్ట్రస్థాయి నేతల్లో ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎఐసిసి పరిశీలకునిగా, పార్టీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకునిగా ఆయన పాత్ర మారింది. దీంతో ఏమైనా సరే రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 80 శాతమైనా విజయం సాధించాలని ఆయన కృషి ప్రారంభిం చారు. దీనికి గాను ఆయన పార్టీ నేతలను సమన్వయ పరుచుకుంటూ వారి కార్యక్రమాలను శాసిస్తున్నారు.అలానే ఎక్కడ ఏ అభ్యర్థి ఎంత వరకూ ఓటర్లను ఆకర్షిస్తున్నారనే అంశంపై సమీక్షలూ చేస్తున్నారు. చివరకు నేరుగా తానే ప్రచారానికి తిరగాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇక ఎన్నికలయ్యేంత వరకూ రాష్ట్రంలోనే ఉండిపోతానని ప్రకటించారు. ముందుగా తన ప్రచారం ఆళ్ళగడ్డలో పూర్తి చేసుకున్నారు. తరువాత గుంటూరు జిల్లా మాచర్ల, పరకాలలో కూడా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నేరుగా తాను చూసిన వాతావరణాన్ని నమ్మిన రవి ఎక్కడికక్కడే మంచి పట్టున వారిని ఎంపిక చేసుకుని వారితో సంభాషిస్తారు. చాలా తక్కువగా మాట్లాడే ఈయన ఒక్కోసారి రెండున్నర గంటలు ఫోను కూడా మాట్లాదగారని ఈ ఉప ఎన్నికల్లో నిరూపించుకున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్లతో ఆయన సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్న వాయిలార్ రవి అనుకున్న లక్ష్యం సాదిస్తారా లేక ప్రత్యర్థి పార్టీ జల్లే బురదమరకలతో తిరిగి ఢిల్లీ వెళతారా అన్నది తేలాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/telugudesham-party-targetting-vayalar-ravi-24-14138.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





