బాలినేనికి ఓటమి భయం!
Publish Date:May 19, 2012
Advertisement
ఒంగోలు శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కత్తులు దూసుకుంటున్నాయి. ఓటర్లజాబితా సవరణకు ఉన్న గడువును సక్రమంగా ఉపయోగించుకుని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ ని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం పన్నింది. దీనిలో భాగంగానే దొంగ ఓట్లు ఉన్నాయని ఓటింగ్ లో ఎక్కువగా పాల్గొనే బలహీనవర్గాల, దళితు వర్గాల ఓట్లు 4800 చెల్లవని అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని రద్దు చేయించింది. దీంతో షాక్ కు గురైన బాలినేనికి మరోషాక్ కు కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా ఇచ్చాయి. అదే ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని ఎనిమిదివేల ఇళ్ళపట్టాలు మంజూరు చేస్తే వాటిలో ఐదువేలు అనర్హులకి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వాటిని క్యాన్సిల్ చేయించింది. దీని తరువాత కాంగ్రెస్ కూడా మిగిలిన మూడువేల ఇళ్ళపట్టాలలో మరో రెండు వేల పట్టాలు సరైనవి కాదని కొట్టించేసింది. ఈ రెండు షాకులకు బాలినేని తీవ్రంగా స్పందించారు. తనతో న్యాయంగా పోటీ చేయటానికి దమ్ముంటే రాష్ట్రముఖ్యమంత్రే రావాలని సవాల్ చేశారు. ఎన్ని అరాచకాలు చేసినా తన గెలుపును ఆపటం ఆ రెండు పార్టీలకు అయ్యే పని కాదని ఘాటుగా సమాధానమిచ్చారు. అయితే ఓటింగ్ లెక్కల ప్రకారం అసలు విద్యావంతులు కన్నా దళితులూ, బలహీనవర్గాల వారే ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొంటారన్న విషయాన్ని గమనించే కాంగ్రెస్ ఈ చర్యకు పూనుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పట్టాలు క్యాన్సిల్ చేయటంతో ఆందోళనగా ఉన్న ఓటర్లను పార్టీలు మభ్యపెట్టడం సులభామన్న సూత్రాన్ని ఆ రెండు పార్టీలు అమలు చేశాయని వారు భావిస్తున్నారు. ఏమైనా బాలినేని రాజకీయప్రస్థానానికి ఈ ఎన్నికలు కీలకమనే విషయాన్ని పరిస్థితులు నిరూపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/balineni-srinivas-fearing-of-defeat-24-14139.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





