బిక్షపతికి బి.సి.ఓట్లు పడతాయా?
Publish Date:May 18, 2012
Advertisement
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి భిక్షపతి పేరును ప్రకటించింది. నియోజకవర్గంలో 50 శాతం ఉన్న బిసి ఓట్లకు గేలం వేసేందు కు టి.ఆర్.ఎస్. ఆఖరి నిమిషంలో అభ్యర్థిని మార్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సాంబారి సమ్మారావు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ, టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా మోలుగూరి భిక్షపతి పోటీలో ఉన్నారు. తెలంగాణా పొలిటికల్ జెఎసి మద్దతు తమకు లభించగలదని టి.ఆర్.ఎస్. పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నరసింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ ఛార్జిలకు టిక్కెట్టు ఇచ్చే టి.ఆర్.ఎస్. సాంప్రదాయం కూడా కొనసాగింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు, టి.ఆర్.ఎస్. అభ్యర్థి భిక్షపతి బిసి ఓట్లను పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికీ ఇతరుల ఓట్లు ఎక్కువ లభిస్తే వారు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి, తాజామాజీ కొండాసురేఖటి పోటీపడతారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2009 ఎన్నికలను పరిశీలిస్తే 13వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండాసురేఖ విజయం సాధించారు. అప్పుడు కూడా టి.ఆర్.ఎస్. అభ్యర్థి భిక్షపతి ఈమెతో పోటీపడ్డారు. సురేఖకు 69,135, భిక్షపతికి 5,335 ఓట్లు వచ్చాయి. ఈసారి ఏమైనా సరే పరకాల ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీలో కాలుమోపాలను కుంటున్నానని భిక్షపతి టి.ఆర్.ఎస్. కార్యకర్తలతో అంటున్నారు. వారు కూడా గదేముందిలే అన్నా ఈసారి నీవేనే ఎమ్మెల్యే అని భరోసా ఇస్తున్నారు. పేరు ప్రకటించిన నిమిషం నుంచి భిక్షపతి కార్యకర్తల భరోసా కోరటం టి.ఆర్.ఎస్. నేతలకు ఆనందాన్నిచ్చింది.
http://www.teluguone.com/news/content/could-bikshapathi-wins-bc-votes-24-14132.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





