కువైట్ నరకంలో తెలుగు మహిళ.. సురక్షితంగా వెనక్కు తీసుకురావాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు

Publish Date:May 21, 2026

Advertisement

 కుటుంబానికి అండగా నిలవాలనే తపనతో గల్ఫ్ దేశానికి వెళ్లిన ఒక సామాన్య తెలుగు మహిళకు అక్కడ ఊహించని నరకం ఎదురైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి అనే మహిళ బతుకుదెరువు కోసం ఈ ఏడాది 2026 ఫిబ్రవరిలో కువైట్ దేశానికి వెళ్ళింది. పీలేరుకు చెందిన చిన్నబ్బ అనే లోకల్ రిక్రూట్‌మెంట్ ఏజెంట్   మాటలు నమ్మి, అక్కడ హౌస్ కీపింగ్ లేదా గృహ సహాయకురాలిగా చేరింది. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాతే ఆమె అసలు మోసాన్ని గ్రహించింది. సదరు ఏజెంట్లు ఆమెకు కనీసం చెల్లుబాటయ్యే సరైన ఎంప్లాయ్‌మెంట్ లేదా వర్క్ వీసా  అందించకుండానే కువైట్ పంపించేశారని తెలుస్తోంది. దీంతో ఆమె అక్కడ చట్టపరమైన రక్షణ కూడా లేని తీవ్ర దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయింది.

కువైట్ చేరిన కొద్దిరోజులకే భాగ్యవతిపై యజమానుల వేధింపులు మితిమీరిపోయాయి. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన నరకయాతన అనుభవించిన ఆమె..  ఇక అక్కడి బాధలను తట్టుకోలేక  తనను తిరిగి ఇండియాకు పంపించవలసిందిగా యజమానులను, ఏజెంట్లను బతిమాలినా ఫలితం లేకపోగా.. వేధింపులు మరింత ఎక్కవయ్యాయి.  తనను ఇండియాకు పంపించాలంటే ఏజెంట్‌కు ఇచ్చిన భారీ మొత్తాన్ని తిరిగి కట్టాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఈ దారుణ పరిస్థితుల్లో   దిక్కుతోచని స్థితిలో  భాగ్యవతి..  ఎలాగైనా సరే ఆ నరకం నుండి బయటపడాలనే ఆశతో ఒక ఆవేదనాభరితమైన సెల్ఫీ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గార్లను ఉద్దేశించి  నన్ను ఎలాగైనా కాపాడండి.. ఈ నరకం నుండి నన్ను బయటకు తీసుకురండి అంటూ కన్నీళ్లతో వేడుకుంది.

ఈ  సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా.. మీడియా కథనాల ద్వారా నేరుగా సీఎం కార్యాలయం దృష్టికి వెళ్ళింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా  స్పందించారు.  వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. భాగ్యవతిని వీలైనంత త్వరగా, సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు  అత్యవసర చర్యలు చేపట్టాలని  అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ ,  కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో  అత్యవసరంగా సంప్రదింపులు జరిపింది. బాధితురాలి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆమెను వేగంగా ఇండియాకు రప్పించేందుకు  దౌత్యపరమైన ఏర్పాట్లను వేగవంతం చేశారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీసులు  తొండవాడలోని భాగ్యవతి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి మాట్లాడారు. తమ ఆడబిడ్డ సురక్షితంగా తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరపున పూర్తి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోంది.

By
en-us Political News

  
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.