ఐటీ పితామహుడు చంద్రబాబు.. జగద్గురు శ్రీశ్రీరవిశంకర్

Publish Date:May 21, 2026

Advertisement

బెంగళూరు నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం ఒక అద్భుతమైన రాజకీయ, ఆధ్యాత్మిక సమ్మేళనానికి   వేదికగా మారింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 వసంతాలు పూర్తి చేసుకున్న  సందర్భంతో పాటు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు, జగద్గురువు  శ్రీశ్రీ రవిశంకర్  70వ జన్మదిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమకాలీన సమాజంలో టెక్నాలజీతో పాటు మానసిక ప్రశాంతత ఎంత అవసరమో చాటిచెప్పేలా ఈ ఇరువురి  భేటీ జరిగింది.  

ఈ వేడుకల వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కేవలం   ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదనీ,  అంతకుమించిన  మానవతావాది అని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా హింసలేని సమాజం కోసం, నేటి ఆధునిక మానవుడిని పీడిస్తున్న ఒత్తిడి రహిత జీవితం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న నిరంతర కృషిని ఆయన  అభినందించారు. 

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు అతలాకుతలం అవుతున్నాయని.. ఇండియా  కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి బలమైన, గొప్ప నాయకుడు మనకు ఉండటం వల్ల యుద్ధాల ప్రభావం తక్కువ ఉందని అన్నారు.  ప్రస్తుతం తాము ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఒక తిరుగులేని టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నామని, అయితే సమాజానికి కేవలం సాంకేతికత మాత్రమే సరిపోదని..  దాంతో పాటుగా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత కూడా  ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ మహత్తర మార్పు కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ తన సేవలను ఆంధ్రప్రదేశ్‌కు విస్తృతంగా విస్తరించాలని, నవ్యాంధ్రను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రీశ్రీ రవిశంకర్ సంపూర్ణ సహకారాన్ని అందించాలని  కోరారు. 

కాగా  శ్రీశ్రీ రవిశంకర్  తన ప్రసంగంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఐటీకి ఆద్యుడిగా అభివర్ణించారు.  దేశంలో ఐటీ సంస్కరణలకు నిజమైన ఆద్యుడు, పితామహుడు చంద్రబాబేనన్నారు.  నాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో, ప్రపంచ టెక్నాలజీ పటంలో సగర్వంగా నిలిపిన  ఘనత కేవలం చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్‌కే దక్కుతుందన్న ఆయన.. కొన్నేళ్ల క్రితం తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు తనను కలిశారని, ఆ సమయంలో దేశంలోని యువత ఆలోచనా విధానాన్ని మార్చడం, వారిని ఉన్నతంగా పరివర్తనం చెందించడమే తన ఏకైక లక్ష్యమని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసుకున్నారు.   ఈ రోజు అమెరికా దేశంలోని ప్రసిద్ధ నగరాలైన మేరీల్యాండ్, వర్జీనియా వంటి అగ్రశ్రేణి ప్రాంతాలు మినీ ఆంధ్రప్రదేశ్‌ను తలపి స్తున్నా యంటే దానికి కారణం చంద్రబాబు నాటిన ఐటీ బీజమేనని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.  

By
en-us Political News

  
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.