టిడిపి ఓటింగ్ కు గైర్ హాజరు, సర్వత్రా విమర్శలు
Publish Date:Dec 7, 2012
Advertisement
ఎఫ్ డి ఐ ల ఫై రాజ్య సభ లో జరిగిన ఓటింగ్ లో తెలుగు దేశం సభ్యులు పాల్గొనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పార్టీకి రాజ్య సభ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. టి డి పి కి చెందిన దేవేందర్ గౌడ్, గుండు సుధారాణి, సుజన చౌదరి ఓటింగ్ లో పాల్గొన లేదు. దీనితో యూపిఏ ప్రభుత్వం గట్టెక్కింది. వీరితో పాటు బి ఎస్ పి, ఎస్ పి సభ్యులు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ విషయంతో టి డి పి విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడానికి చంద్ర బాబు ఎంత పాకేజ్ తీసుకున్నారని ఇటీవలే టి డి పి నుండి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమర్నాథ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తో టి డి పి కుమ్మక్కు అయినదానికి ఇంతకంటే ఆధారాలు ఏమి కావాలని నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ఈ ముగ్గురు సభ్యులు వ్యక్తిగత కారణాల వల్లే ఓటింగ్ లో పాల్గొనలేక పోయారని ఆ పార్టీ ఎంపి సి ఎం రమేష్ వివరణ ఇచ్చారు. అసలు ఈ విషయం తమ నేత చంద్ర బాబు కు తెలియదని, తానే ఈ విషయాన్ని మొదటగా ఆయనకు తెలియచేసానని రమేష్ వివరణ ఇచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం దేవేందర్ గౌడ్ ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని రమేష్ అన్నారు. అయితే, సుజన, సుధా రాణి ఇంకా ఈ విషయంలో వివరణ ఇవ్వలేదు. సుజన చౌదరికి ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఓటింగ్ కు దూరంగా ఉన్నారని కూడా కధనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
http://www.teluguone.com/news/content/telugu-desam-party-devendar-goud-24-19572.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





