ప్లీజ్! నన్ను ప్రజాసేవ చేసుకోనీయరూ!
Publish Date:Dec 7, 2012
Advertisement
నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే, ప్రజాసేవలో ‘ప్రజలకు సేవ’ కూడా ఉండదు. అయినా, మన నేతలు ఆ పడికట్టుపదాన్ని అలవోకగా వాడేసుకొంటూ ప్రజలతో ఆడేసుకొంటున్నారు. అయినా కూడా భూదేవంత సహనమూర్తులయిన ప్రజలు మళ్లీమళ్లీ వాళ్ళనే ‘ప్రజాసేవ’ చేయాలని గట్టిగా కోరేస్తుండటం వల్ల, వాళ్ళ మీద గౌరవంతోనో లేక వాళ్ళమాట కొట్టేయలేని తమ బలహీనతవల్లనో పాపం శ్రమ అనుకోకుండా ప్రజాసేవ చేసుకుపోతున్నారు సదరు ప్రజా ప్రతినిధులు. ఇక, విషయానికి వస్తే, గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజాసేవకే అంకితమయిపోయి, కాంగ్రేసు యంపీగా ఇటు పార్టీకి, అటు ప్రజలకి సేవలందిస్తున్న శ్రీ కావూరి సాంబశివరావుగారు, తనకు మంత్రి పదవి ఇవ్వక పోవడముతో ప్రజలకి మరింత ఎక్కువగా సేవచేయలేకపోతున్నని బాధపడుతూ కొద్ది రోజుల క్రితమే తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసేసారు. యఫ్.డి.ఐ. బిల్లు వోటింగు సమయంలో పాల్గొనకుండా కాంగ్రేసు ‘హస్తాన్ని’ కొంచెంమెలి తిప్పి చూసారు. కాని, పార్టీ హై కమాండులో పెద్దగా చలనం రాలేదు. అటు పార్టీలోంచి పొమ్మని చెప్పకుండా, ఇటు మంత్రి పదవీ ఇయ్యకపోతే ఇక ప్రజాసేవ ఎలాగ చేసుకోవాలో తెలియక ఆయన సతమతమయిపోతూ ఆ ఆవేదనని మీడియా ముందు ఉంచేరు ఇలా... “ఇన్ని సంవత్సరాలుగా నిస్వార్దంగా పార్టీకి సేవలందిస్తున్న నాకే పార్టీలో గుర్తింపు లేకపోతె, ఇక మా వంటి సామాన్య పార్టీ కార్యకర్తలమేమైపోవాలి అని కార్యకర్తలు నిలదీస్తుంటే వాళ్ళకి నేను జవాబు చెప్పుకోలేక పొతున్నను. నిజమే! మా అధిష్టానానికి ‘పెరటి మొక్క వైద్యానికి పనికి రాదనట్లు’, పాత కాపులమయిన మేము పనికి రాకుండా పోయాము. నిన్న గాక మొన్న పార్టీలో జేరిన వారికి మంత్రి పదవులు మాకు శూన్య ‘హస్తం.’’ “గత అనేక సంవత్సరాలుగా నాంచబడుతున్న ‘కొల్లేరు సరస్సు ఉద్యమాన్ని’ మళ్లీ ప్రారంభించాలని అనుకొంటున్నాను. అవసరమయితే, రైల్ రోకో, హైవే రోకో వంటి ఆందోళనలకీ మేము సిద్దం” అని ప్రకటించేరు కావూరి వారు. ఇప్పుడు ఆయనని ‘ప్రజాసేవ’ చేసుకొనీయాలో వద్దో కాంగ్రెసు అధిష్టానమే ఆలోచించుకోవాలి మరి.
http://www.teluguone.com/news/content/kavuri-sambhasivarao-24-19573.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





