కొవిడ్ థర్డ్ వేవ్ మార్చి వరకు రాదు! పిల్లలను స్కూల్ కు పంపాలన్న వైద్యశాఖ
Publish Date:Sep 13, 2021
Advertisement
తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ చేసినా విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంటోంది. కొందరు పేరెంట్స్ తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. థర్డ్ వేవ్ వస్తుందంటూ కొన్ని సంస్థలు హెచ్చరికలు చేస్తుండటం, థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందనే ప్రచారమే వాళ్ల భయానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కీలక ప్రకటన చేసింది. కొవిడ్ థర్డ్ వేవ్ మార్చి వరకు వచ్చే అవకాశం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. పిల్లలను స్కూల్స్ కి పంపండిడానికి భయపడొద్దని పేరెంట్స్ కు సూచించారు. స్కూల్స్ తెరిచాకా 1.5 లక్షల మంది విద్యార్థులకు టెస్ట్ లు చేస్తే 57 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు శ్రీనివాసరావు. 5 లక్షల మంది రెసిడెన్స్, హాస్టల్స్ లో చదువుకుంటున్నారని... అవి కూడా స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు. దేశంలో కేరళ, మహారాష్ట్ర లలో మాత్రమే కేసులు ఎక్కువ ఉన్నాయన్నారు. కొవిడ్ అదుపులో ఉన్నా.. జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ వో వెల్లడించారు. 27 వేల ప్రభుత్వ బెడ్స్ కు ఆక్సిజన్ కల్పిస్తున్నామని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చిన సమర్థంవంతంగా ఎదుర్కొనేందుకు 3 వేల 202 బెడ్స్ ను పిల్లల కోసం ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 113 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు శ్రీనివాసరావు. డెల్టా వేరియంట్ వైరస్ పూర్తిగా తగ్గలేదుని, మాస్క్ ధరించాలని జనాలకు సూచించారు శ్రీనివాస రావు. ఐటీ కంపెనీలు ఇంకా ఓపెన్ కాలేదు.. వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు.. కంపెనీలు కూడా ఓపెన్ చెయ్యాలని కోరారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని, లక్షలాది మందికి ఉపాధి దొరకాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామ్ననారు శ్రీనివాసరావు.Ghmc లో 100 శాతం మొదటి డోసు పూర్తైందని తెలిపారు. గత 3 వారాల్లో 8.75 లక్షల మందికి మొబైల్ వ్యాక్సిన్ ద్వారా ఇచ్చామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98 శాతం మందికి హాస్పిటల్ కు వెళ్లవలసిన అవసరం రావడం లేదన్నారు శ్రీనివాస రావు. థర్డ్ వేవ్ రావాలంటే.. కొత్త వేరియంట్ మాత్రమే రావాలి.. అప్పటి వరకు 3వ వేవ్ రాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజు 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామన్నారు. 20 లక్షల వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.. ఈ నెలలో25 లక్షల డోసులు రాబోతున్నాయని చెప్పారు. ఈ సీజన్ లో వచ్చే రోగాలకు అన్ని ఒకే లక్షణాలు ఉంటాయన్నారు. 95 శాతం వైరల్ ఫీవర్స్, మలేరియా 2 జిల్లాలో ఎక్కువ ఉందన్నారు. ఈ సీజన్ లో ప్రతి నెల 2 లక్షల వరకు వైరల్ ఫీవర్ వస్తుంటాయన్నారు డీఎంహెచ్ వో శ్రీనివాసరావు. రాష్ట్రంలో R ఫ్యాక్టర్ .5% , పాజిటివిటి రేట్ 4.5% ఉందన్నారు.
http://www.teluguone.com/news/content/telangana-dmho-says-covid-third-wave-come-after-march-only-39-122916.html





