ఉండాలా వెళ్లాలా.. అయోమయంలో కాంగ్రెస్ సీనియర్లు

Publish Date:Dec 26, 2022

Advertisement

కాంగ్రెస్ లో సంక్షోభానికి కారణమైన సీనియర్ల పరిస్థితి ఇప్పుడు  అయోమయంలో పడింది. సంక్షోభ పరిష్కారానికి కేంద్రం దూతగా వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. ఒక్కొక్కరితో విడివిడిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై సీనియర్లు చేసిన ఫిర్యాదులను సావధానంగా విన్నారు. అంతే. ఆ తరువాత ఆయన వారికేమీ చెప్పలేదు. సరికదా.. ఏవైనా ఇబ్బందులు ఉంటే హైకమాండ్ కు విన్నవించుకోవాలి తప్ప మీడియా ముందు మాట్లాడటం తగదంటూ ఓ జనరల్ సూచన చేసి చక్కాపోయారు.

అయితే సీనియర్ల కు ఆ సూచన ఒక వార్నింగేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక పరాజయం బాధ్యత పూర్తిగా రేవంత్ పై పడుతుందన్న భావనలో ఉన్న సీనియర్లకు  డిగ్గీ రాజా మాటలు మింగుడు పడటం లేదు. ఆయన వచ్చి వెళ్లిన తరువాత కూడా పరిస్థితి ఆయన రాక ముందు ఎలా ఉందో అలాగే ఉంది. అదనంగా తమ ఫిర్యాదులపై డిగ్గీ రాజీ స్పందించకపోవడంతో సీనియర్లు గతం కంటే బలహీనపడ్డారన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది.

 దీంతో ఇక ఇప్పుడు ఏం చేయాలన్న గందరగోళంలో సీనియర్లు పడ్డారు. డిగ్గీ రాజా వచ్చి వెళ్లిన తరువాత కాంగ్రెస్ నేతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక  పార్టీలోనే కొనసాగుతూ అసమ్మతి కార్యకలాపాలు కొనసాగించే అవకాశం వారికి లేకుండా పోయింది. డిగ్గీ రాజా హస్తినకు వెళ్లిన తరువాత ఆయన మళ్లీ ఎప్పుడొస్తారు.. తమ అసమ్మతిని ఆయనకు ఎప్పుడు తెలియజేయాలి అని ఎదురు చూడాలే తప్ప గతంలోలా ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ పై ఇష్టారీతిగా విమర్శలు చేసి, అసమ్మతి రాగం అంటూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.

డిగ్గీ రాజా సూచనతో వారికి ఏమైనా ఇష్యూలు ఉంటే హైకమాండ్ ఎదుటకు తీసుకు వెళ్లాలి తప్ప గతంలోలా మీడియా మీట్ పెట్టి నిప్పులు చెరిగేసి, విమర్శలు గుప్పించాలంటే కుదిరే పరిస్థితి లేదు. క్రమశిక్షణ చర్యల కత్తి వారి మెడమీద వేళాడుతోంది. అంటే ఇకపై పార్టీలో ఉండాలంటే రేవంత్ నిర్ణయాలకు వంత పాడాల్సిందే. అలా పాడలేని వారుంటే మర్యాదగా పార్టీని వీడి వెళ్లాలి. ఇదీ డిగ్గీ రాజా సూచన సారాంశం.

ఇప్పుడు ఆ సూచనే కాంగ్రెస్ సీనియర్లను అయోమయంలో పడేసింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు టీపీసీసీ చీఫ్ ను కానీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ ను కానీ మార్చే అవకాశాలు లేవని డిగ్గీ రాజా చెప్పకనే చెప్పేశారు. దీంతో దిగ్విజయ్ వచ్చి వెళ్లిన తర్వాత రేవంత్ వర్గం మరింత బలం పుంజుకుందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా గ్రూపులు కట్టిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు  ఇప్పుడు వెనక్కు తగ్గలేక, ముందుకు సాగలేక ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం  బలోపేతం అయ్యింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇదంతా రేవంత్ టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత చోటు చేసుకున్న పరిణమామమే. దానికి తోడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణను తీసుకువచ్చిన ఘనతను కూడా కేసీఆర్ వదులుకున్నారు.

దీంతో ఇప్పడు  తెలంగాణ ఇచ్చిన పార్టీగా  ప్రజలకు గట్టిగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ కు లభించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్లు  ఇంత కాలం పార్టీని అంటిపెట్టుకుని ఉండి, తీరా ఫలాలు ( అధికారం) దుక్కుతాయన్న అవకాశాలు ఉన్న సమయంలో పార్టీని వీడటం తొందరపాటు అవుతుందా అన్న సంశయం వెన్నాడుతోంది. అలా కాదని పార్టీనే అంటిపెట్టుకుని ఉంటే ఇంత కాలం తాము వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఏం చెబితే అది చేయాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు అయోమయంలో పడ్డారు. 

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.