రాహుల్ యాత్ర ఎఫెక్ట్.. కమలం పార్టీలో గుబులు

Publish Date:Dec 26, 2022

Advertisement

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అయితే ఈ యాత్రను సాధ్యమైనంతగా డౌన్ ప్లే చేయడానికి బీజేపీ చేయగలిగినంతా చేసింది. ఎవరికీ పట్టని యాత్రగా అభివర్ణించింది. యాత్ర సాగుతుండగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక, గుజరాత్,  అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  అయినా రాహుల్ గాంధీ వాటిని వేటినీ పట్టించుకోకుండా స్థిత ప్రజ్ణతతో యాత్రను కొనసాగిస్తున్నారు.

రాజకీయ యాత్ర కాదు..  విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, అసహనం దేశంలో పెచ్చరిల్లిపోతున్న సమయంలో   ప్రేమ పంచేందుకూ, ప్రజలను ఏకం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానంటూ రాహుల్ జోడో యాత్ర మొదలు పెట్టడానికి ముందు చెప్పిన మాట నుంచి ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ జరగలేదు. రాజకీయాలు, ఎన్నికల ఫలితాలను గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదు. ఆఖరికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడం తప్ప మరేం చేయలేదు.  అయినా రాహుల గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా రాజకీయాలతో సంభంధం లేకుండా యువతీ యువకులు, విద్యార్ధులు, చిన్నారులు, మహిళలు,  రైతులు, కార్మికులు  ఇలా అన్నివర్గాల ప్రజలు రాహుల్ గాంధీ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటపాటలతో   రాహుల్ జోరుగా హుషారుగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మధ్య మద్యలో సినిమా స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ముఖ్యంగా సామాజిక మాధ్యమం అంతా రాహుల్ యాత్ర వెనుక ర్యాలీ చేస్తోంది. ఇంత ఉత్సాహంగా అంతులేని ఆదరణతో సాగుతున్న కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ కు ఏం ఒరిగింది అని ప్రశ్నించే వారికి నాగపూర్ స్థానిక ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భారతీయ జనతా పార్టీ కంచుకోట అయిన నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాగ్ పూర్ లోని 236 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 200 చోట్ల గెలుపొందింది. డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సొంత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. రాహుల్ జోడో యాత్ర కారణంగానే ఈ విజయం సిద్ధించింది. ఈ పరాజయానికి కారణాలు వెతుక్కునే పనిలో బీజేపీ ఉంటే పరిశీలకులు మాత్రం కరణాలు వెతుక్కోవలసిన అవసరం ఇసుమంతైనా లేదు.. అంతా రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావమే అంటున్నారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రజలతో మమేకమౌతున్న విధానం, హెల్త్ కాన్షస్ నెస్, నడవడిక, వ్యవహార శైలి వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి.    ఆ ప్రభావమే నాగపూర్ ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించిందంటున్నారు. బీజేపీ ఎంత కాదంటున్నా.. రాహుల్ యాత్ర ఆ పార్టీలో గుబులు రేపుతున్నది. ఇందుకు సాక్ష్యం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే కాంగ్రెస్ ను తేలిగ్గా తీసుకోవద్దని క్యాడర్ ను హెచ్చరించడమేనని పరిశీలకులు అంటున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. బీజేపీ క్యాడర్ ను కాంగ్రెస్ విషయంలో హెచ్చరించడమే రాహుల్ యాత్ర బీజేపీలో గుబులు రేపుతున్నదనడానికి నిదర్శనం.

అంతే కాదు కర్నాటక రాష్ట్రంలో రాహుల్ యాత్ర సాగుతున్న సమయంలో బీజేపీ సంకల్ప యాత్ర ప్రారంభించింది. కర్నాటక లోని బీజేపీ సర్కార్ రాహుల్ యాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించింది.  తాజాగా కోవిడ్ ప్రొటోకాల్ ఆంక్షలు విధించింది. వీటిని వేటినీ పట్టించుకోకుండా రాహుల్ యాత్ర జనాదరణతో కొనసాగుతుండటం బీజేపీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ యాత్ర ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందన్నఆశా భావం హస్తంపార్టీలో వ్యక్తం అవుతుంటే.. అదే భావంతో బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది. 

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.