జానా కూడా జంప్ జిలానీ అవుతారా?

Publish Date:Nov 20, 2014

Advertisement

 

యుద్ధంలో సేనాధిపతి అందరికంటే ముందు వుండాలి. సైన్యం వీరోచితంగా యుద్ధం చేసేలా ఉత్సాహాన్నివ్వాలి. అయితే అలాంటి సేనాధిపతి శత్రువులకు లొంగిపోతే యుద్ధం ముగిసిపోయినట్టే. మరి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయా అనే సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఆ మంత్రానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే ఎంటర్‌టైన్‌మెంట్ చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తూ వుండటంతో బిత్తరపోయారు. అర్జెంటుగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు. అసెంబ్లీలో కూడా నానా లొల్లి చేశారు. ఇంతవరకూ ఓకే... ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నానా గందరగోళం చేస్తుంటే, శాసనసభా పక్షం నాయకుడు జానారెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వుండటం అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.

 

తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ నాయకులు ప్రతి అంశంలోనూ వాగ్ధాటితో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. వారి ధాటికి తట్టుకోలేకే ప్రభుత్వం వారిని వారం రోజులపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రలోభపెట్టే అంశం మీద అసెంబ్లీలో గానీ, బయట గానీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి మాట్లాడిన తీరు చప్పచప్పగా వుండటమే కాకుండా, ఆయన ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదని అంటున్నారు. మాటలతో ప్రభుత్వాన్ని కడిగిపారేయాల్సిన జానారెడ్డి ఒక్కోమాట ఆచి తూచి మెల్లగా మాట్లాడుతూ, నీతిసూత్రాలు చెబుతున్నట్టుగా మాట్లాడుతూ వుండటం ఎంతమాత్రం బాగాలేదని కాంగ్రెస్ పార్టీవారే గొణుక్కున్నారు. ఆ తర్వాత ఒక రోజు జానారెడ్డి సభకు రాకపోవడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఉప నాయకుడు జీవన్ రెడ్డి సభలో వాడిగా, వేడిగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేశారు. అంతకుముందు రోజు జానారెడ్డి మాట్లాడిన తీరుకంటే జీవన్ రెడ్డి మాట్లాడిన తీరు బాగుందని, టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోరాడే విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం పెంచిందన్న అభిప్రాయాలు వినిపించాయి.

 

ఇదిలా వుంటే మొన్న ఒకరోజున అసెంబ్లీ స్పీకర్ జానారెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులందరినీ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అందర్నీ సస్పెండ్ చేసి జానారెడ్డిని మాత్రం ఎందుకు వదిలేశారో ఎవరికీ అర్థం కాలేదు. సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యులందరూ సభ నుంచి బయటకి వెళ్ళిపోతే, వారికి నైతిక మద్దతు ఇస్తూ జానారెడ్డి కూడా బయటకి వెళ్ళిపోతే మర్యాదగా వుండేది. అయితే జానారెడ్డి మాత్రం తాను కూర్చున్న సీట్లోంచి అంగుళం కూడా కదలకుండా కూర్చున్నారు. జానారెడ్డి వ్యవహరించిన ఈ తీరు కాంగ్రెస్ సభ్యులకే అర్థం కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జానా గళం విప్పకపోవడం, కాంగ్రెస్ సభ్యులకు నైతిక మద్దతు ఇవ్వకపోవడం చూస్తుంటే టీఆర్ఎస్ ఆకర్ష మంత్రానికి జానారెడ్డి కూడా లొంగిపోయారా అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జానారెడ్డి కూడా జంప్ జిలానీ అయ్యే ఛాన్స్ ఉందని ఊహిస్తున్నారు.

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.