మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడో?

Publish Date:Mar 29, 2025

Advertisement

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏప్రిల్ 3 ముహూర్తం  అని కూడా ప్రచారం జరిగింది. అలాగే  కొత్త మంత్రులు వీరే అంటూ నాలుగు పేర్లు, నాలుగు ముఖాలు తెరపైకి వచ్చాయి. 

అయితే  రోజు రోజుకూ సీన్ మారుతున్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి, ఓ వంక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను రాత్రికి రాత్రి ఢిల్లీ పిలిపించుకుని మరీ మంత్రివర్గ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది అన్న అనుమానాలు  వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ కాదు  మరేదో  ఉందనే  కథనాలూ వచ్చాయి. అయితే  ఆ అనుమానాలు అంతగా నిలవలేదు.

 అయితే ఈ ఐదారు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ స్వరూప స్వభావాలు మెల్ల మెల్లగా మారుతూ వస్తున్నాయి. నిజానికి  రేపు  ఎప్పుడైనా  జరిగేది  కేవలం మంత్రి వర్గ విస్తరణ మాత్రమే కాదు. మంత్రి వర్గంలో ఉన్న ఖాళీలను నింపే క్రతువు మాత్రమే కాదు, మంత్రి వర్గంలో  భారీగానే   మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అవును జరిగేది, మంత్రి వర్గ విస్తరణ కాదు,   మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ అంటున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం  ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనే నిర్ణయానికి వచ్చిందని కాంగ్రస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, దీర్ఘకాల ప్రణాళికతో దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించిన రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని  తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలని రాహుల్ సంకల్పించారని అంటున్నారు. 

ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చి పట్టుమని పదిహేను నెలలు అయినా  కాకముందే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతున్నట్లు వస్తున్న వార్తల విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉందని అంటున్నారు. అందుకే  మంత్రి వర్గం సర్జరీ కి సిద్దమయినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒక విధంగా, డిఫరెంట్ సోర్సెస్  నుంచి సేకరించిన   గ్రౌండ్  రిపోర్ట్స్ ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు  చేపట్టేదుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తే చేసినట్లు చెపుతున్నారు. 

అంతే కాదు  మార్చి 24న ఢిల్లీలో జరిగిన చర్చల్లోనే, మంత్రి వర్గ పని తీరును సమీక్షించినట్లు చెపుతున్నారు. కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య సరైన సమన్వయం లేక పోవడంతో ఈ శాఖల్లో మార్పులు తప్పవని  కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి  అన్నిటికంటే ముఖ్యంగా మంత్రివర్గంలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో కొందరు మంత్రుల శాఖలు మార్చడంతో పాటుగా  అవసరమైతే ఉద్వాసనలు వెనకాడరాదనే నిర్ణయానికి అదిస్థానం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. 

అదొకటి అలా ఉంటే, మూడవ తేదీ ముహూర్తం విషయంలోనూ ఇంకా పూర్తి స్పష్టత రాలేదని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీకి దగ్గరైన రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు కీలక మార్పుల విషయంలో  తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అధిష్టానం పునారలోచనలో పడిందని అంటున్నారు. ఈ సందర్భంగా సదరు సీనియర్ నాయకుడు గతంలో ఫిర్యాదుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన విషయాన్నీ గుర్తు చేసిన మీదట, మరో సారి రాష్ట్ర నాయకులతో మరింత లోతుగా చర్చించిన తర్వాతనే  ముహూర్తం ఖరారు  చేయాలనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే, మూడవ తేదీ ముహూర్తం మిస్సయ్యే అవకాశం లేక పోలేదని అంటున్నారు.ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ  రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాతనే, ముహూర్తం ఖరారు అవుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.