ఒకే కానుపులో నలుగురు పిల్లలు.. కంటికి రెప్పల్లా కాపాడిన నీలోఫర్ వైద్యులు

Publish Date:Mar 29, 2025

Advertisement

కేవలం హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ, ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ఏ పసిపాపకు ఆరోగ్యం బాగా లేకపోయినా.. ఆ పాప తల్లిదండ్రులకు  వెంటనే గుర్తొచ్చే హాస్పిటల్ నీలోఫర్.  ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు అన్న ప్రజల విశ్వాసం ఇటీవలి కాలంలో సన్నిగిల్లుతోంది. ధనార్జనే ధ్యేయంగా రకరకాల పరీక్షలు అంటూ ప్రజల జేబులు కొల్లగొడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు, నిర్లక్ష్యం నీడన వైద్యం కోసం వచ్చే వారి పట్ల ఆమానుషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాస్పత్రుల కారణంగా ఆస్పత్రులను దేవాలయాలుగా, వైద్యులను దేవుళ్లుగా భావించే పరిస్థితి క్రమంగా తగ్గిపోతున్నది.

అయితే ప్రజలలో ఆస్పత్రుల పట్ల, వద్యుల పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. తల్లీ బిడ్డల ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 1953లో ఏర్పాటైన నీలో ఫర్ ఆస్పత్రి అప్పటి నుంచీ ఆదే ఆశయం, స్ఫూర్తితో పని చేస్తున్నది.

తాజాగా హైదరాబాద్‌లోని హస్తినాపూర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో నీలోఫర్ ఆస్పత్రికి గత 22న  వచ్చింది. ఏడున్నర నెలల గర్భధారణ సమయంలో అకాల ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఆమెకు ఆదే రోజు అక్కడి వైద్యులు సిజేరియన్ ద్వారా కనుపు చేశారు నీలోఫర్ వైద్యులు. ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఇద్దరు ఆడశిశువులు కాగా ఇద్దరు మగశిశువులు. దీనిని క్వాడ్రాపుల్ ప్రెగ్నెన్సీ అంటారు.  ఆమెకు జన్మించిన పిల్లల బరువు తక్కువగా ఉన్నారు. అకాల ప్రసవం కారణంగా ఆ శిశువులకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వెంటిలేటర్ పై ఉంచాల్సిన పరిస్థితి. నీలోపర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, నియోనాటాలజీ విభాగం చీఫ్ ల పర్యవేక్షణలో ఆ నలుగురు శిశువులనూ ఆస్పత్రిలోని ఎన్ఐసీయూలో చేర్చి వైద్య సేవలు అందించారు.

 దాదాపు పది రోజుల పాటు వారిని మెకానిక్ వెంటిలేటర్ లో ఉంచారు. మొదటిలో నలుగురు శిశువులకూ తల్లి పాలు సరిపోయేవి కాదు. దీంతో ఆస్పత్రిలోని హ్యూమన్ బిల్క్ బ్యాంక్ సహాయంతో పిల్లలకు పాలు అందించారు. రోజులు గడిచే కొద్దీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో వారిని ఎన్ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు. పిల్లల బరువు కూడా పెరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులూ తగ్గాయి.   సెప్సిస్, కామెర్లు, అప్నియా, ఆర్‌ఓపి వంటి సమస్యలతో బాధపడిన ఆ నవజాత శిశువులను వైద్యులు కంటికి రెప్పల్లా కాపాడారు. వారిలో ఒక శిశువు కంటికి ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇలా అన్ని సమస్యలనూ ఒక్కటొక్కటిగా అధిగమించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచారు. దాదాపు నెల రోజులపైన ఆస్పత్రిలో ఆ శిశువులకు వైద్య సేవలు అందించిన తరువాత శనివారం (మార్చి 29) డిశ్చార్జ్ చేశారు. ఇప్పటికీ పిల్లలు కొంత తక్కువ బరువుతోనే ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఇబ్బందులేవీ లేవని వైద్యులు చెప్పారు. ఇప్పుడు నలుగురు శిశువులకూ తల్లి పాలు అందుతున్నాయనీ తల్లీ, నలుగురు పిల్లలూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని నిర్ధారించుకున్న తరువాతే డిశ్చార్జ్ చేశామని నీలోఫర్ వైద్యులు తెలిపారు.   

By
en-us Political News

  
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.