తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికకు ముహూర్తం ఖరారు
Publish Date:Jun 28, 2025
Advertisement
జూలై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు కమలం పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుండగా, ఎల్లుండి సోమవారం నామినేషన్ల స్వీకరిస్తారని సమాచారం. ఆ తర్వాత పార్టీ చీఫ్‌ను ఎంపిక చేస్తారు. ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్‌షా ఇందూరుకు రానున్నారు. అదే రోజున బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అమిత్ షా పలువురు బీజేపీ సీనియర్ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఒకరిద్దరి పేర్లు ఫైనల్ చేయొచ్చని సమాచారం. ఆ సమయంలోనే ఏపీ నూతన అధ్యక్షుడి నియామకం సైతం జరుగునుంది. అయితే, బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి రేసులో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, డీకే.అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీ హైకమాండ్ ఎట్టకేలకు జులై రెండో వారంలో ప్రకటన చేస్తుందనే ప్రచారం ఉండటంతో బీజేపీ పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని, త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీహిల్స్ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నిక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోను సత్తాచాటుతామని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు
http://www.teluguone.com/news/content/telangana-bjp-25-200825.html





