కమల్ హాసన్‌కు అరుదైన అవకాశం
Publish Date:Jun 28, 2025
Advertisement
కమల్ హాసన్ కి యూనివర్శల్ హీరోగా పేరుంది. కమల్ కి ఆస్కార్ కీ ఉన్న సంబంధ బాంధవ్యాలు అన్నీ ఇన్నీ కావు. భారత్ నుంచి అత్యధికంగా ఆస్కార్ కి నామినేట్ అయిన కథానాయకుల్లో కమల్ ముందు వరుసలో ఉంటారు.1987లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది కమల్ నటించిన నాయకన్ చిత్రం. అయితే తుది జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది. ఇక 1992లో దేవర్ మగన్, 1995లో కురుతి పూనల్, 1996లో ఇండియన్, 2000 సంవత్సరంలో హేరామ్ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. కానీ ఇంత వరకూ కమల్ కి ఎలాంటి ఆస్కార్ పురస్కారం రాలేదు. అలాంటి కమల్ హాసన్ కి అరుదైన గౌరవంగా.. ఆస్కార్ కమిటీలో చోటు దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన సభ్యుల జాబితాలో కమల్ పేరు కూడా ఉంది. ఎంతో మంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు కమల్. ఆస్కార్ కి నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు వేసే ఛాన్సునిస్తుంది కమిటీ. కాగా ఈ ఏడాది మొత్తం 534 మంది సభ్యులను ఆహ్వానించినట్టు ప్రకటించింది అకాడమీ. ప్రతిభావంతులైన వీరికి అకాడమీలో చోటు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది అకాడెమీ.ఇటీవల కమల్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ ఆఫ్ లైఫ్ అనే చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయినా సరే ఆయనకు శుభవార్తల వెల్లువ ఆగడం లేదు. ఇటీవలే డీఎంకే తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన కమల్ కి అనుకోకుండా ఆస్కార్ కమిటీ సభ్యుడిగానూ ఎంపిక కావడంతో ఆయన ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
http://www.teluguone.com/news/content/kamal-haasan-25-200833.html





