తెలంగాణకు మేలు చేసేదెవరు?

Publish Date:Apr 27, 2014

Advertisement

 

ఈసారి కేంద్రంలో, ఆంధ్ర, తెలంగాణాలలో ఏర్పడబోయే ప్రభుత్వాలను బట్టి ఆయా రాష్ట్రాల అభివృద్ధి ఆదారపడి ఉంటుంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో లేదా ఏ ఒక్క రాష్ట్రంలోనయినా తెదేపా-బీజేపీల ప్రభుత్వాలు ఏర్పడినట్లయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహజంగానే మంచి సయోధ్య ఉంటుంది గనుక ఆ రాష్ట్రాల పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమయిన నిధులు విడుదలవుతూ త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది.

 

ఒకవేళ తెలంగాణాలో తెరాస భారీ మెజార్టీతో  అధికారంలోకి వచ్చినా, కేసీఆర్ చెపుతున్న ‘బంగారి తెలంగాణా’ నిధుల కోసం కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాని దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడవలసి ఉంటుంది. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలతో వ్యవహరిస్తున్న తీరువలన వారి మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడూ ఎవరితో ఒకరితో కయ్యాలే తప్ప స్నేహధర్మం పాటించడం అలవాటులేని తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణా పగ్గాలు చేపడితే, తెలంగాణాకు కేంద్రం నుండి ఆశించినంతగా సహకారం ఉండదు. పైగా తమ పార్టీ గెలిస్తే ఆ రెంటికీ మద్దతు ఇవ్వనని, ఎక్కడా కనబడని థర్డ్ ఫ్రంట్ కే మద్దతు ఇస్తానని చెపుతున్నారు. అటువంటప్పుడు ఆయన తను హామీ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టుకోవడానికి నిత్యం కేంద్రంతో గొడవపడక తప్పదు. దాని వలన తెలంగాణకు లాభం కంటే మరింత నష్టమే జరిగే అవకాశం ఉంది.

 

ఇక కొమ్ములు తిరిగిన సిటింగ్ కాంగ్రెస్ యంపీలతో పోలిస్తే తెరాసకు బలమయిన యంపీ అభ్యర్ధులే లేరు. పైగా తెలంగాణాలో ఉన్న 17 యంపీ స్థానాలకి కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, తెరాస, మజ్లిస్ మరియు స్వతంత్ర అభ్యర్ధులు చాల మందే పోటీ పడుతున్నారు గనుక తెరాసకు మహా అయితే ఏ నాలుగయిదు యంపీ సీట్లో మాత్రమే దక్కే అవకాశముంది. ఆ నాలుగయిదు సీట్లను కేంద్రానికి ఎరగా వేసి తెరాస సాధించగలిగేదేమీ ఉండదు. అటువంటప్పుడు తెరాస చేసే డిమాండ్లను కూడా కేంద్రంలో పట్టించుకొనే వారే ఉండరు.

 

అదేవిధంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, లేదా కాంగ్రెస్-తెరాసలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, వారు వ్యతిరేఖించే బీజేపీ ఒకవేళ  కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఇబ్బందికరమే. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి, తెలంగాణాలో కూడా ఆ పార్టీ లేదా తెరాసతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మాత్రం తెలంగాణకు తప్పకుండా ఎంతో కొంత మేలు జరగవచ్చును. కానీ కేంద్రంలో కాంగ్రెస్, తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీఇబ్బందులు తప్పవు.

 

ఒకవేళ కాంగ్రెస్-తెరాసలు కలిసి సంకీర్ణానికే సిద్దపడినా, ఆ రెండు పార్టీలలో నేతలూ  కీలక పదవులు, అధికారాలు  తమకే కావాలని కోరుకోవడం సహజం గనుక వారిది కలహాల కాపురమే అవుతుంది. ఒకవేళ తెలంగాణాలో తెదేపా-బీజేపీ కూటమి అధికారం చేజిక్కించుకొన్నప్పటికీ, అప్పుడు కూడా వారి మధ్య ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడినట్లయితే వారు కేంద్రం నుండి తెలంగాణా కోసం భారీగా నిధులు రాబట్టే అవకాశం ఉండటమే వీరికి అదనపు అర్హతవుతుంది. ఇక తెరాస నేతలు ఆరోపిస్తున్నట్లు బీజేపీ నిజంగానే చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయినట్లయితే దానివలన తెలంగాణాకు మరింత మేలే తప్ప కీడు జరుగదు. ఆయన తెలంగాణకు అవసరమయిన నిధులు విడుదల చేయించగలరు.

 

కేసీఆర్ తను ఉద్యమాలకు సమర్ధంగా నాయకత్వం వహించారు గనుక, ప్రభుత్వాన్ని కూడా అంతే సమర్ధంగా నడపగలనని భావిస్తున్నారు. కానీ జవాబుదారీతనం లేకుండా రోడ్లమీద ఉద్యమాలు చేయడానికి, తమను ఎన్నుకొన్న ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన పరిస్థితిలో కార్యాలయంలో కూర్చొని ప్రభుత్వం నడపదానికీ చాలా తేడా ఉంది. ప్రభుత్వం నడపడానికి కార్యదక్షత, పరిపాలనానుభావం, ఉద్యోగులతో, ప్రభుత్వాధికారులతో, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో మంచి సమన్వయము, సక్యత వంటి చాలా లక్షణాలు అవసరం ఉంటాయి. మరి కేసీఆర్ కి అటువంటి లక్షణాలు ఉన్నాయనుకొంటే ప్రజలు నిరభ్యంతరంగా ఆయనకే ఓటు వేసుకోవచ్చును. లేకుంటే అపార పరిపాలనానుభావం ఉన్న కాంగ్రెస్ పార్టీకో లేదా ఎంతో కొంత పరిపాలనానుభవము, తెలంగాణకు నిధులు రాబట్టగల సామర్ధ్యం ఉన్న తెదేపా-బీజేపీ కూటమికో ఓటు వేసి గెలిపించుకోవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.