అక్కడా తెలంగాణవాదమే గెలిచింది
Publish Date:Mar 22, 2012
Advertisement
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అద్భుత విజయం సాధించారు. కొవూరుతో సహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో గెలుపును అందరూ ఊహించిందే. అయితే మహబూబ్ నగర్‌లోనూ టిఆర్ఎస్ గెలుస్తుందని అందరూ భావించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేలో అదే చెప్పారు. తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ టిఆర్ఎస్ గెలుపు ఖాయమనుకున్నారు. అయితే అనూహ్యంగా ఫలితం తారుమారయింది. అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ బిజెపి విజయం సాధించింది. ఇటీవలి క్రితం వరకు అసలు పోటీకి దిగాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న బిజెపి ఏకంగా పాలమూరులో పాగా వేసింది.
బిజెపి విజయానికి పలు కారణాలు చూపిస్తున్నారు. కెసిఆర్ వైఖరి, అభ్యర్థికి కలిసొచ్చిన సామాజికవర్గం, ప్రత్యర్థి పార్టీలలో క్రాస్ ఓటింగ్ ఇలా అనేక కారణాలు కనబడుతున్నాయంటున్నారు. మహబూబ్‌నగర్ ఎంపిగా గెలిచినప్పటి నుంచి మళ్లీ నియోజకవర్గం వైపు కెసిఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడం, అదే సమయంలో జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించడంతో పాలమూరు ప్రజల దృష్టి అటువైపు మళ్లిందని అంటున్నారు. దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గతంలో బిజెపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. కానీ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల కాంగ్రెస్‌పార్టీ అనుసరించిన వైఖరితో ఆయన అనుచరులు తీవ్ర మనస్తాపానికి గురై శ్రీనివాస రెడ్డికి బాసటగా నిలిచారు. ఆయన సామాజిక వర్గం కూడా అండగా నిలిచినట్లుగా కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సాగించిన తెలంగాణ పోరుయాత్ర సెంటిమెంటు పరంగా ఆదరణ పెంచింది. ఇక టిఆర్ఎస్ అధినేత స్థానిక ఎంపి కెసిఆర్ వ్యవహార శైలితో స్థానికులు విసిగి వేసారని అంటున్నారు.
కాగా, పాలమూరులో టీఆర్ఎస్ ఓడిపోయిందనుకోవటంలేదని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అక్కడా తెలంగాణవాదమే గెలిచిందని చెప్పారు. "మహబూబ్‌నగర్‌లో మేమూ , బీజేపీ పోటీపడ్డాం. చివరికి తెలంగాణవాదమే గెల్చింది. రెండుపార్టీలకు కలిపి 70% ఓట్లు వచ్చాయి. సాంకేతికంగా అక్కడ మేం ఓడిపోయినా.. గెలిచింది తెలంగాణ వాదమే కదా'' అని వ్యాఖ్యానించారు. "ఉద్యమ పతాకాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లిన తెలంగాణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్య సాధన వరకు ముందుకు సాగాలి'' అని ఉద్ఘాటించారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల తీర్పు చెంపపెట్టని, వచ్చిన రాష్ట్రానికి అడ్డుపడ్డ టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతం చెల్లదని ప్రజలకు చెంప ఛెళ్లుమనిపించారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా తమ భవిష్యత్తు ప్రయాణం, ప్రస్థానం కొనసాగుతుందన్నారు. తెలంగాణ సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు.
http://www.teluguone.com/news/content/telangana-24-12845.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





