రంగంలోకి దిగుతా..రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో అధినేత్రి సోనియా
Publish Date:Mar 22, 2012
Advertisement
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె బుధవారం లోక్ సభలో తనను కలిసిన ఎంపీలతో వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందుకు నిదర్శనం. ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎక్కువ స్థానాల్లో రెండో స్థానం కూడా దక్కించుకోకపోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఫలితంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి నివేదిక సమర్పించారు. ఈ ఫలితం ముందుగా ఊహించిందే. కానీ.. దీని ప్రభావం త్వరలో జరగనున్న 18 ఉప ఎన్నికలపై పడకుండా జాగ్రత్త పడాలి. నాకు అర్థమైనంత వరకూ ఏపీలో సీనియర్లతో సమన్వయం సరిగా లేదు. ఇదే ప్రధాన లోపం. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం లేదు. ఇదే పార్టీకి నష్టం చేకూరుస్తోంది. ఇక నేనే రంగంలోకి దిగుతా. సమన్వయం ఉండేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలపైనా ఉంది. దీనిపై దృష్టి సారించాలి'' అని ఆమె అన్నట్లు తెలిసింది.
అయితే, ఫలితాలను కాంగ్రెసు జాతీయ నాయకులు తేలికగా కొట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫలితాలు ఊహించనవేనని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. పైకి తేలిగ్గా కొట్టి పారేయడానికి ప్రయత్నిస్తున్న లోలోన తీవ్రమైన మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా.. రాజ్యసభ సభ్యత్వాల ఎంపికకు సంబంధించి అధినేత్రితో సీఎం కిరణ్ సమావేశమైనప్పుడు కూడా ఉప ఎన్నికల అంశం చర్చకు వచ్చిందని తెలిసింది. ఈ సమయంలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడింటిలో ఎన్నింటిలో గెలుస్తామని సీఎంను సోనియా ప్రశ్నించారు. ఇందుకు ఆయన రెండు లేదా మూడింటిలో గెలిచే అవకాశాలున్నాయని అన్నప్పుడు.. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారని అధినేత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనంతరం, త్వరలో జరగనున్న 18 ఉప ఎన్నికల్లో ఎన్నింటిలో గెలుస్తామని సోనియా ప్రశ్నించగా సీఎం మౌనం దాల్చారని పార్టీ వర్గాలు వివరించాయి. దీంతో, ఇలాగైతే ఆ 18 స్థానాల్లోనూ విజయం సాధించడం కష్టమేనని.. పార్టీని విజయపథాన నడిపించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సీఎంకు సోనియా సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
కాగా, తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో మరోసారి తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణపై పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు తమను నమ్మలేదని, తెలంగాణ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెసు నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెసు నాయకుడు కె. కేశవరావు కూడా తీవ్రంగా స్పందించారు. కాగా, మహబూబ్ నగర్ విజయంతో బిజెపిలో కొత్త ఉత్సాహం నిండుకున్నట్లు అర్థమవుతోంది. బిజెపి జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు ఈ ఫలితంపై స్పందించారు. రాష్ట్ర రాజకీయాల్లో మహబూబ్ నగర్ ఫలితం నూతన అధ్యాయానికి నాంది అవుతుందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆదరించినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బిజెపితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/newdelhi-24-12842.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





