బనకచర్లపై చర్చకునో .. ఏపీకి రేవంత్ సర్కార్ బిగ్ షాక్
Publish Date:Jul 15, 2025
Advertisement
బనకచర్ల ప్రాజెక్టు పై చర్చించడానికి తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం జరగ నుంది. ఈ సమావేశంలో బనకచర్లపై విస్తృతంగా చర్చించాలన్నది ఏపీ ప్రతిపాదన. అయితే ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. బనకచర్లపై చర్చకు రేవంత్ సర్కార్ నిర్ద్వంద్వంగా నో అంది. ఈ ప్రాజెకటుపై చర్చకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం బుధవారం (జులై16)న సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే బనక చర్ల అజెండాతో ఈ సమావేశం ప్రతిపాదన వచ్చినదే ఏపీ సర్కార్ నుంచి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది. అయితే బనకచర్లపై అయితే చర్చించేందుకుర ఏమీ లేదని తెలంగాణ సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. గత రెండు రోజులుగా ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఢిల్లీలో భేటీపై రెండు రాష్ట్రాలలో విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్ కేంద్రానికి మంగళవారం (జులై 15) ఉాదయం లేఖ రాసింది. ఆ లేఖలో బుధవారం (జులై 16) సమావేశంలో బనకచర్లపై చర్చించేందుకు విముఖత వ్యక్తం చేసింది. యి.
http://www.teluguone.com/news/content/telanagana-shock-to-ap-39-202019.html





