బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ స్థానిక ఎన్నికలు.. లింకేటి?

Publish Date:Sep 9, 2025

Advertisement

తెలంగాణలో స్థానిక సమరం మరో వాయిదా ఖాయం అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇదిగో.. అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న తెలంగాణ స్థానిక ఎన్నికలు కోర్టు స్పష్టమైన గడువు విధించిన తరువాత కూడా మళ్లీ మరో మారు వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తున్నది.  వాస్తవానికి స్థానిక సంస్థల గడువు ముగిసి చాలా కాలమైంది. తెలంగాణలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వాటి గడువు ముగిసి కూడా ఏడాది దాటింది.  

అప్పటి నుంచీ కూడా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది.  ఈనేపధ్యంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహిస్తాం, అప్పుడు నిర్వహిస్తామంటూ ముహూర్తాలు ఖరారు చేసి ఉజ్జాయింపుగా తేదీలనూ ప్రకటించేస్తున్నా.. అవన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి.  అసలీ ఎన్నికలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉన్నట్లు కనిపించదు.   

ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల విషయంలో పట్టుబడుతుండటంతో కోర్టు విధించిన గడువులోగా స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఇసుమంతైనా లేదన్న విషయం దాదాపు స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణకు తగినట్లుగానే ఇటీవలి మంత్రివర్గ సమావేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం లభించే వరకూ స్థానిక పోరుకు వెళ్లవద్దన్ననిర్ణయం తీసుకున్నది. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మరి కొంత గడువు కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అదే జరిగితే ఇక ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఇసుమంతైనా లేనట్లేనని అంటున్నారు. ఎందుకంటే.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది.  వారి వద్ద నుంచి ఈ నెల 30లోగా ఎటువంటి నిర్ణయం వెలువడకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కారణాన్ని చూపుతూ కోర్టును ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తంగా బీహార్ ఎన్నికలు ముగిసే వరకూ తెలంగాణ స్థానిక సమరం వాయిదా పడటమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందు కోసం కోర్టును స్థానిక పోరును మూడు నుంచి నాలుగు నెలల పాటు వాయిదా వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆ లోగా రాష్ట్రపతి లేదా గవర్నర్ నుంచి బీసీల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.  
ఇంతకీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో లింకేమిటంటే.. బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్నది రేవంత్ బావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కోర్టును ఆశ్రయించైనా సరే స్థానిక ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ పట్టుబ డుతుందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.