అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్.. నిజమేనా?

Publish Date:Feb 17, 2025

Advertisement

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతారా? ప్రతిపక్ష నేతగా తన గళం వినిపిస్తారా? అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేసీఆర్..అహంకారపూరిత వ్యవహార శైలి కారణంగానే 2023 ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయారు. జనం ఆయన అహంకారాన్ని భరించలేక బీఆర్ఎస్ పార్టీని ఓడించి సాగనంపారు.  

దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకోకుంటే మీ సేవలు మాకిక అవసరం లేదని ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు. అయితే ఓటమి తరువాత కూడా కేసీఆర్ లో మార్పు రాలేదు. బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు తప్పు చేశారంటూ ఓటమి తరువాత ఒకటి రెండు సందర్భాలలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.  కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించాననీ, తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు అద్భుతమైనవనీ చెప్పుకుంటున్నారు. మేడిగడ్డ కుంగుబాటు చాలా చాలా చిన్న విషయమని చెబుతున్నారు. జనం శుష్కవాగ్దానాలకు లొంగిపోయి.. బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నారనీ, మళ్లీ తనవైపు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజలలో ఈ పరివర్తన వచ్చింది కనుకే ఇప్పుడు తాను మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు.

ఇప్పుడు ఇక తానేమిటో చూపిస్తాననీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై రేవంత్ సర్కార్ ను నిలదీస్తాననీ అంటున్నారు.   అంతే కాదు పార్టీ ఎమ్మెల్యేలకూ, మాజీ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మరీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మిస్ కాకుండా హాజరు కమ్మడి ఆదేశిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతాననీ, ప్రభుత్వాన్ని సభ వేదికగా ఎండగడతాననీ చెబుతున్నారు. 

2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ప్రజలకు ముఖం చాటేసిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తరువాత ఇక చూస్తోండి నా తడాఖా అంటున్నారంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. ఓటమి తరువాత రాజీనామాను సైతం స్వయంగా గవర్నర్ కు ఇవ్వకుండా తన పీఏతో పంపించి, రాత్రికి రాత్రి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు పారిపోయిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో    శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా వ్యూహరచన చేసుకున్నట్లు తెలుస్తోంది.   కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పదేపదే సవాల్ చేస్తున్నా ఇంత కాలం మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇఫ్పుడు  అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నారు.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.