Publish Date:Jun 17, 2025
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI159 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే టేకాఫ్ కు ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ముప్పు తప్పింది. ఈనెల 12న అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా విమానం ఆ రోట్లో నడపడానికి సిద్ధమైన తొలి ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తంగా గత కొద్ది రోజులుగా ఎయిర్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల విమాన సర్వీసులలో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/technical-ilapsein-ahmedabad-to-london-flight-39-200139.html
వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం పర్యటనలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. మాజీ సీఎం అక్కడ రైతులతో మాట్లాడే ఫోటోలు తీసున్న ఫోటోగ్రాఫర్ దాడి చేశారు.
కర్ణాటకం మరోమారు తెరపై కొచ్చింది. నిజానికి.. కర్ణాటకలో రెండేళ్ళ క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కౌన్ బనేగా ముఖ్యమంత్రి అనే సీరియల్ తెర పైకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సంధి కుదిర్చింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను,ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులను గుర్తించిన సిట్.. బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది.
రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాగ్వర్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కుప్పకూలింది. చురు జిల్లాలోని రతన్‌గఢ్ ప్రాంతంలో క్రాష్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ. అదీ ఐపీఎల్‌కున్న క్రేజ్, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది
నీటిఎద్దడి ప్రమాదఘంటికలు మ్రోగిస్తోంది. నీటి వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడం, వృధాగా నీరు మురికి కాలువలో కలిసిపోవడం.తో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. పట్టణాలు,నగరాలు విస్తరణ కారణంగా ఏటికేడు నీటి వినియోగంవిపరీతంగా పెరిగిపోతోంది.
ప్రతిష్ఠాత్మక సింహాద్రి అప్పన్న ఆలయంలో నేడురేపు జరిగే గిరి ప్రదక్షిణకు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా ఆషాఢమాసంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు ఈ ఏడు పదిలక్షల మంది వరకూ హాజరౌతారన్న అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
గ్రేటర్‌లో హైడ్రా కూల్చివేతల పర్వం మొదలైనప్పటి నుంచి పాతబస్తీలోని ఒవైసీ విద్యాసంస్థలపై పెద్ద దుమారమే రేగుతోంది. పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించారు. అయితే ఈ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. జగన్ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగానే సమయం వుంది. జమిలి ఎన్నికలు వస్తేనో, ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ, లేదంటే.. 2028 సెకండ్ హాఫ్ లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నిజానికి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిండా రెండేళ్ళు అయినా కాలేదు.