Publish Date:Oct 15, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దొంగ ఓట్ల వ్యవహారంతో పాటు కన్నీటి కథలు కూడా భారీగానే నడుస్తున్నాయ్. బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత తన భర్తను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారొక సభలో. అయితే ఈ కన్నీటి కహానీలు కేటీఆర్, హరీష్ కావాలనే దగ్గరుండి నడిపిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు పొన్నం తదితరులు. తమకు సునీత మీద సానుభూతి ఉందంటూనే.. ఆమెను కావాలనే రెచ్చగొట్టి ఏడిపించి సీన్ క్రియేట్ చేస్తున్నది మాత్రం హరీష్, కేటీఆరే అంటూ విమర్శలు చేస్తున్నారు.
అసలు బీఆర్ఎస్ తమ అభ్యర్ధిగా సునీతను నిలబెట్టిందే ఇందుకు అంటున్నారు. వాస్తవానికి జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత పార్టీ అనుకున్న వ్యక్తులు వేరు అంటూ గుర్తు చేస్తున్నారు. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత కేటీఆర్ సతీమణి శైలిమ పేరు, ఆ తరువాత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా బీఆర్ఎస్ పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
అయితే శైలిమ, విష్ణువర్దన్ రెడ్డిలలో ఒకరిని నిలిపినా.. జూబ్లీ ఉప ఎన్నిక జరుగుతుందే కానీ, బీఆర్ఎస్ కు అవసరమైన సెంటిమెంట్ పండదన్న భావనతోనే మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారని అంటున్నారు. బేసిగ్గా బీఆర్ఎస్ ఆయువు పట్టు మొత్తం సెంటిమెంటులో దాగి ఉంటుంది. అయితే ప్రాంతీయ సెంటిమెంటు, లేకుంటే ఇదిగో ఇలాంటి సెంటిమెంట్లు ఆధారంగా వారు తమ కారు నడిపిస్తుంటారు. ఎందరో బలిదానాల పునాదుల మీద కట్టుకున్న పార్టీ కదా? అలాగే ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ దంతా ఎమోషన్ చుట్టూ ఆడే డ్రామానే అంటారు వారు. ఇవేవీ కాకపోతే.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుని మరీ ఆయనపై విమర్శలు గుప్పించి పబ్బంగడుపుకోవడం చూస్తున్నాం కదా అని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం సెంటిమెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ రాజకీయం ఉంటుందనీ, అటువంటి పార్టీకి అందివచ్చిన అవకాశంలా సునీత కన్నీళ్లు చెంతనే ఉంటే వాడుకోకుండా ఎలా ఉంటారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tears-raising-political-heat-in-jubleehills-by-poll-39-207978.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.