Publish Date:Oct 15, 2025
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ పెడతారా? పెట్టరా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్నగా ఉన్నా.. కవిత ఈ ప్రశ్నకు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నారంటున్నారు పరిశీలకులు. ఆమె సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారనీ, అందుకే ఈ నెల చివరి వారంలో ఆమె తెలంగాణలోని అన్ని జిల్లాలనూ కవర్ చేసే విధంగా ఒక యాత్ర చేపట్టబోతున్నారనీ అంటున్నారు. ఆమె యాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఇంతకీ ఆ యాత్ర ఎలా జరగనుంది? ఆ డీటైల్స్ ఏంటని చూస్తే..
కల్వకుంట్ల కవిత తాను త్వరలో చేపట్టబోతున్న యాత్రలో ఎక్కడా కూడా తన తండ్రి కేసీఆర్ ఫొటో కనిపించదంటున్నారు. ఇందుకోసం ఆమె తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో ఒక పోస్టర్ ను తీసుకువచ్చి.. దానినే ప్రముఖంగా తన యాత్రద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇలా ఎందుకు? అంటే.. తండ్రి కేసీఆర్ తన అన్న కేటీఆర్ తో ఉన్నారు. ఎంత కాదనుకున్నా వారిద్దరూ ఒక జట్టు. దీనిని మార్చడం అసాధ్యం. అందుకే ఆమె సొంతంగా, స్వతంత్రంగా అడుగులు వేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకోసం అవసరమైతే.. ఇంత కాలం తన పేరు ముందు ఉంచుకున్న పుట్టింటి ఇంటి పేరు కల్వకుంట్లను సైతం వద్దనుకునేలా ఆమె అడగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందు కోసమే పార్టీ నుంచి భౌతికంగా బయటకు వచ్చేయడంతో ఆగకుండా.. కల్వకుంట్ల కుటుంబానికి కూడా దూరం జరిగి.. తాను నేటి మహిళను, కావలసినంత ఆత్మవిశ్వాసం ఉంది అని నిరూపించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
ఇక యాత్ర ఎందుకు అంటే.. ఇలా యాత్రలు చేసిన వారికి అధికార ఫలం దక్కుతుందన్న భావనతోనే అంటున్నారు. నిన్న కాక మొత్త బతుకమ్మ సందర్భంగా తన తండ్రి సొంత ఊరు చింతమడకలో కవిత కన్నీటిపర్యంతమై భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో.. మాజీ మంత్రి హరీష్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇక ఇప్పుడు తన యాత్రలో కూడా అదే చేయనున్నారు. కుటుంబం నుంచి తనను వేరు చేశారన్న సెంటిమెంటు పండించడంతో పాటు.. ఉభయతారకంగా యాత్ర సెంటిమెంటు కూడా పండుతుందని కవిత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే యాత్ర సెంటిమెంటు అందరికీ వర్తిస్తుందని కాదు. ఇక్కడా షరతులు వర్తిస్తాయ్. ఇంత వరకూ కేవలం అన్నలకే ఈ సెంటిమెంటు వర్కవుట్ అయ్యింది. చెల్లెళ్లకు కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. జగన్, షర్మిళ ఇద్దరూ యాత్రలు చేశారు. కానీ అధికారం జగన్ కే దక్కింది. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? లేక కవితకు కలిసివస్తుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-ready-for-yatra-39-207976.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.