అదే జరిగితే ఇరాన్‌ను ముక్కలు ముక్కలు చేయండి.!
Publish Date:Jul 10, 2026
Advertisement
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాచాలత ప్రదర్శించారు. ఇరాన్ ముక్కలు చేయండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉద్రిక్తతలను పెంచేశారు. ఇరాన్ తనను ఖతం చేయడానికి వ్యూహాలు రచించిందంటూ వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. ఒక వేళ ఇరాన్ తనను చంపితే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహాతీతంగా, తీవ్రాతి తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తనకేదైనా హాని తలపెడితే ఇరాన్‌పై ఎలాంటి భీకరమైన చర్యలు తీసుకోవాలో.. ఆ దేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలో అమెరికా రక్షణ అధికారులకు తాను ఇప్పటికే రాతపూర్వకంగా అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని ట్రంప్ వెల్లడించి సంచలనం సృష్టించారు. న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. తన హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందంటూ వస్తున్న తాజా లీకులపై మాట్లాడారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్, సీఎన్‌ఎన్ వంటి వార్తా సంస్థలు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తోందని, ఈ అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ అధికారులు నేరుగా వాషింగ్టన్‌తో పంచుకున్నారని ఇటీవల కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆ కథనాలపై వైట్ హౌస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ట్రంప్ స్వయంగా.. ఆ కథనాలను న్యూయార్క్ పోస్ట్ ఇంటర్వ్యూలో ఖండించారు. ఇజ్రాయెల్ నుంచి తమకు నేరుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. అయితే తాను ఇరాన్ హిట్ లిస్ట్‌లో నంబర్ వన్' స్థానంలో ఉన్నాననీ, ఆ దేశం నుంచి తనకు ముప్పు ఉందనీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను , ఇరాన్ వల్ల తనకు హాని జరిగితే.. ఆ దేశాన్ని ముక్కల ముక్కలు చేయాలని అమెరికా సైన్యానికి ఇప్పటికే రాతపూర్వక ఆదేశాలు ఇచ్చేశాననీ, ఇచ్చేశాననీ చెప్పారు. తనకు ఏదైనా జరిగితే.. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా, మానవజాతి ఊహించని స్థాయిలో ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎ దౌత్యపరమైన, సైనికపరమైన విభేదాలు మున్నెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరినట్లైంది. టర్కీ రాజధాని అంకారాలో ఇటీవల జరిగిన నాటో సదస్సులో ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ పై భీకర దాడులకు ఆదేశాలిచ్చానంటూ చేసిన ప్రకటన, అదే సమయంలోఆ దేశంతో దౌత్య చర్చలు కొనసాగిస్తామనడం.. ఆయన ద్వంద్వ ప్రవృత్తిని, ద్వంద్వ వైఖరినీ వెల్డిస్తున్నాయి. మొత్తం మీద ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. Donald Trump Iran threat, Trump assassination plot, US Iran relations, Israel intelligence warning, New York Post Trump interview
http://www.teluguone.com/news/content/tear-iran-to--pieces-36-225682.html





