ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన గిల్ సేన

Publish Date:Jul 6, 2025

Advertisement

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో  భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను ఔట్ ప్లే చేసి 336 పరుగుల ఆధిక్యతతో అద్భుత విజయాన్ని చేజిక్కించుకుంది. తొలుత టీమ్ ఇండియా బ్యాటర్లు.. ఆ తరువాత బౌలర్లు అద్బుత ప్రదర్శన చేశారు. శుభమన్ గిల్ టీమ్ ఇండియా టెస్టు జట్ట పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తోలి విజయం. అలాగే ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా విజయాన్ని అందుకోవడం కూడా ఇదే తొలిసారి.  

కెప్టెన్ గిల్ అద్భుత బ్యాటింగ్ కారణంగా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా భారీ లక్ష్యన్ని నిర్దేశించింది. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఔట్ చేయడంతో   608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్  కేవలం 271 పరుగులకే ఆలౌటై భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.  

తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 587 పరుగుల భరీ స్కోరు సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో రాణించారు. ఇక యశస్వి జైస్వాల్ 87 పరుగులు, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 158, జేమ్ స్మిత్ 184 నాటౌట్ సెంచరీలతో  మెరిశారు. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ స్కిప్పర్ శుభమన్ గిల్ 161 పరుగులతో భారీ సెంచరీ చేశాడు. అతడికి రిషభ్ పంత్ 65, జడేజా 69 సహకారం అందించారు. దీంతో భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్య సాధనకు ప్రయత్నించలేదు. డ్రా కోసం బజ్ బాల్ రిథమ్ లోకి వెళ్లకుండా ఢిఫెన్స్ ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 336 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా గొప్ప విజయం సాధించిందంటూ  టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్ ఇండియా గెలుపుపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో స్పందిచిన కోహ్లీ..   శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఎడ్జ్ బాస్టన్ లోని ఫ్లాట్ పిచ్ పై సిరాజ్, ఆకాశ్ దీప్ లు చేసిన బౌలింగ్ ప్రదర్శన గొప్పగా ఉందని పేర్కొన్నారు. 

మరో మాజీ కెప్టెన్ గంగూలీ కూడా శుభమన్ గిల్ సేన విజయంపై స్పందించాడు.  శుభ్‌మన్ గిల్ అండ్‌ టీమ్‌ బ్యాట్‌తో, బాల్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆకాష్ దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.బుమ్రా లేని లోటు కనబడనీయలేదని పేర్కొన్నాడు. అలాగే గిల్ బాధ్యతతో చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. 

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.