కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి. నిఫా వైరస్ విజృంభణతో కేరళ గజగజలాడుతోంది. మలప్పురం జిల్లా చెట్టియారంగడిలో నిపా వైరస్ కారణంగా 18 ఏళ్ల బాలిక మరణించింది. నిపా కాంటాక్ట్ అనుమానితుల జాబితాలో 345 మంది ఉన్నారని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మలప్పురం పాలక్కాడ్ కోజికోడ్ లలో హై అలర్ట్ ప్రకటించారు. పాలక్కాడ్ అయితే నిఫా వైరస్ వ్యాప్తి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిపా వైరస్ సోకిన వ్యక్తి కాంటాక్ట్ అయిన 58 మందిని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాధి సోకిన వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో వార్డులను జిల్లా కలెక్టర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. బహిరంగ సభలను నిషేధించారు. మెడికల్ స్టోర్స్ మినహ, దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్తలకు సెలవు ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్ లలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nifa-virus-danger-bells-in-kerala-25-201419.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి