చెలరేగిన సంజు శాంసన్.. సెమీస్‌లో భారత్
Publish Date:Mar 1, 2026
Advertisement
టీ 20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా 19.2 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. సంజు శాంసన్ కీలక ఇన్నింగ్ ఆడి జట్టుని గెలిపించాడు. వాంఖడేలో మార్చి 5న రెండో సెమీ ఫైనల్లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఇక 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా, వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ భారత్‌ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసిన శాంసన్, విండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 కీలక పోరులో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణయం తొలుత తప్పేమో అనిపించేలా వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. రోస్టన్ చేజ్ 40, జేసన్ హోల్డర్ 37 నాటౌట్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 34 మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో జస్పీత్ బుమ్రా (2/36) కీలక సమయంలో వికెట్లు తీసి విండీస్ స్కోరు 200 దాటకుండా అడ్డుకోగలిగారు.
అయితే చివరి 5 ఓవర్లలో 60 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ యువ సంచలనం తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా (17) బాధ్యతాయుతంగా ఆడి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే 199 పరుగులు సాధించి భారత్‌కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
http://www.teluguone.com/news/content/team-india-beat-windes-36-214844.html





