ఎన్నికలు ఎప్పుడొచ్చినా .. టీడీపీదే జయం ..విజయం ఎలైట్ ముందస్తు సర్వే చెప్పిన నిజం

Publish Date:Jun 10, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక విధమైన గందరగోళం ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లేదు. ప్రజాభిప్రాయం చాల స్పష్టంగా వుంది ... ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని, ఒక్క అవకాశం కోసం అదే పనిగా ప్రాధేయపడిన, జగన్మోహన్ రెడ్డికి జనం 2019లో ఒక అవకాశం ఇచ్చారు.. కానీ, మూడేళ్ళ తర్వాత ఇప్పుడు, జగన్ రెడ్డి మాట నిలుపుకున్నారా? అద్భుతాలు సాధించారా? రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్ళరా అంటే ... జనం పెదవి విరుస్తున్నారు. అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. 2019 ఎన్నికలలో తాము తీసుకున్న నిర్ణయం తప్పని, ఏకంగా 47.37 శాతం మంది ఓటర్లు స్పష్టం చేశారు. వైసీపే ప్రభుత్వం తమ ఆశలను వమ్ము చేసిందని చెప్పు కొచ్చారు. 38.46 శాతం మంది మాత్రమే, తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. తప్పును ఒప్పుగా పేర్కొన్నారు. మరో 14.16 శాతం మంది అటూ ఇటూ కాకుండా ఉన్నారని  ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది.  

ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి సామర్ధ్యం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీల పనితీరు, ప్రాధాన్యతలు, సమర్ధ్య  నాయకత్వం.. ముఖ్యమంత్రి, చివరకు ఈ సారి ఓటేవరికీ .. అనే విభిన్న ప్రశ్నల ప్రామాణికంగా, ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ నిర్వహించిన సర్వేలో  ఏపీ ఓటర్లు, క్లియర్ కట్’ గా వైసీపెకి వ్యతిరేకంగా తీర్పు నిచ్చారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు నాయకత్వాని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ సర్వే మరో మారు సపష్టం చేసింది.   

ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 ( 20.02.2022) నుంచి మార్చి 05, 2022 వరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 35 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 350  పోలింగ్ బూతుల పరిధిలో అన్నివర్గాలకు చెందిన 10, 500 మంది ఓటర్లను వ్యక్తిగతం ఇంటర్వ్యూ చేసి, Stratified Random Sampling, పద్దతిలో  సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తెస్సుకుని రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల పరిస్థితిని విశ్లేషిస్తే, ఎన్నికాలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ తరిగి అధికారంలోకి రావడం తధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా, ఏపీ పోటీ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది మూడో పార్టీకి అవకాశం లేదని విష్యం కూడా సర్వే స్పష్టం చేసిద్నై విశ్లేషకులు అంటున్నారు. మూడో స్థానంలో ఉన్న జన సేనకు మొదటి రెండుస్థానల్లో ఉన్న టీడీపీ, వైసీపీలకు మధ్య ఏ ప్రమాణం ఆధారంగా చూసినా గ్యాప్ .. భారీగా.. భయంకరంగా ఉందని, అందుకే, ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ఉంటుంది.. అంతిమంగా టీడీపీ విజయం సాధిస్తుందని అంటున్నారు. 
ఈ సర్వే ఫలితాల ప్రకారం, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ కొంచెం అటూ ఇటుగా ప్రభుత్వ వ్యతిరేక పస్పుటంగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మాకొద్దు’ అనే మాటే మూడు ప్రాంతాల్లో వ్యక్తమైంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజాక వర్గాలకు గానూ, 35 నియోజకవర్గాల పరిధిలోని 10,500 ని సర్వే చేస్తే అందులో,  కేవలం 2635 (25.09 శాతం) మంది మాత్రమే ప్రభుత్వ పనితీరు పట్ల సంపూర్ణ సంతృప్తిని వ్యక్తపరిచారు, మరో 2067 (19.68 శాతం) మంది ఫర్వాలేదని పెదవి విరిచారు. మరో 3321 (31.63 శాతం) మంది .. అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, 2477 (23.59 శాతం) మంది అయితే, ఛీ ..ఛీ అంటూ సంపూర్ణ అసంతృప్తిని వ్యక్తపరిచారు.  

పార్టీల పరంగా చూస్తే, 4515 (43 శాతం)  ఓట్లతో తెలుగు దేశం పార్టీ  ప్రధమ స్థానంలో వుంది. వైసీపీ, 4111 (39.15 శాతం) ఓట్లతో రెండవ స్థానంలో వుంది. మూడవ స్థానంలో నిలిచిన జనసేనకు 1103 (10.50 శాతం) ఓటర్లు, ఫోర్త్ ప్లేస్’లో నిలిచిన బీజీపీకి 135 (1.28 శాతం) ఓటర్లు మద్దతు పలికారు. అంటే, ప్రస్తుత పరిస్థితిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచినా టీడీపీకి వైసీపీ కంటే 3.85 శాతం ఓట్లు అధికంగా పోలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.  

అదే విధంగా, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందని అడిగితే,చంద్రబాబు నాయుడు సిఎం కావాలని,4506 మంది అంటే 42.91 శాతం మంది కోరుకుంటున్నారు.కేవలం 39.09 శాతం (4102)  మంది మాత్రమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమత్రి కావాలని కోరుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు, 1112 మంది మాత్రమే, అంటే కేవలం 10.59 శాతం మంది మాత్రమే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.ముఖ్యమంత్రి  రేసులో ఉన్నామని అనుకుంటున్న మిగిలిన అందరికీ కలిపి 7.44 శాతం ( 782) మంది ఓటేశారు. 

ఈ ఫలితాలను బట్టి చూస్తే, వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల జనాలకు మూడేళ్ళకే ముఖం మొత్తిందనే విషయం స్పష్టమవుతోందని సర్వే విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, అన్ని సర్వేలలోలానే, ఈ సర్వే లోనూ ఫలితాలు  ప్లస్ ఓర మైనస్ 3 శాతం అతూ ఇటు అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 

ఇదిగాక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రజలు ఆందోళన చేడుతున్నారని సర్వేలో సప్ష్టమైంది. మొత్త 10, 50౦ మందిలో 28. 36 శాతం మంది  రాష్ట్ర రాజకీయాలు చాల చాల సంక్లిష్టంగా ఉన్నాయని అంటే, 17.06 మంది స్వార్ధపూరిత అవకాశవాదరాజకీయాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. మరో 27.12 శాతం మంది రాష్ట్ర రాజకీయాలు ప్రమాదకర పోకడలు పోతున్నాయని ఆందోళన వ్యక్త పరిచారు.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.