మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. అజెండా రాష్ట్రపతి ఎన్నికేనా?

Publish Date:Jun 10, 2022

Advertisement

హమ్మయ్య కేసీఆర్ సుదీర్ఘ మౌనముద్ర వీడారు. శుక్రవారం ఆయన మంత్రులతో, ఎమ్మెల్యేల  తోసమావేశం అవుతున్నారు. పార్టీ వ్యవహారాల కోసమేనని చెబుతున్నప్పటికీ, రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన విధానం ఏమిటన్నదానిపైనే ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

 బీజేపీ (ఎన్డీయే) అభ్యర్థిని ఓడించడమే లక్ష్యం అంటూ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన కేసీఆర్ ఆ తరువాత ఎందుకో నిరుత్సాహ పడ్డారు. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవని భావించి చప్ప బడిపోయారు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు మకాం మార్చేసి మౌనమునిలా మారిపోయారు.  మాటల మాంత్రికుడిగా, మాటలతో ఎటువంటి వారినైనా నిరుత్తురలను చేయగల సమర్ధుడిగా పేరొందిన కేసీఆర్ మౌనంతో తెలంగాణలో ఒక విధమైన నిశబ్దం తాండవిస్తోందా అనిపించే వాతావరణం నెలకొంది. దీనికంతా కారణం జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ చేసిన యత్నాలు అంతగా ఫలించకపోవడమేనని పరిశీలకులు సెటైర్లు వేసినా కూడా పట్టించుకోలేదు.  గత కొద్ది కాలంగా విపక్షాల విమర్శలకు సైతం ఆయన మౌనమే సమాధానంగా ఉంటోంది. ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

దీంతో రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చ కోసమే ఆయన పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అయ్యారు. కాగా ఇప్పటికే ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నది నిర్ణయించేశారనీ, దానిని వివరించడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. పైకి ఏం చెబుతున్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజర్ కావడమే తెరాస నిర్ణయంగా ఉంటుందని, అదే అధినేత కేసీఆర్ నిర్ణయమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఏమిటి అన్న ఉత్కంఠకుమరి కొద్ది సేపటిలో తెరపడనుంది.   టీఆర్ఎస్ ఈ ఎన్నికను బహిష్కరించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి.  

ఇప్పటికే వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయన్నది ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం అయనా, బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేసినా పెద్దగా ఫరక్ ఉండదు కానీ,   టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడమంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్లేనని పరిశీలకులు అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడానికి ఓ అడ్డంకి ఉంది. అదేమిటంటే రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులందరూ తప్పని సరిగా ఓటు వేయాలన్న నిబంధన. ఆ నిబంధన నుంచి తప్పించుకుని ఓటింగ్ కు గైర్హాజరయ్యే మార్గాల గురించి కూడా కేసీఆర్ పార్టీ ఎంపీలు,  ఎమ్మెల్యేల సమావేశంలో చర్చంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

 ఎన్డీయే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం బీజేపీకి ఎంత ముఖ్యమో, బీజేపీ ఆధిక్యతను నిరోధించే యత్నం కాంగ్రెస్ కు ఎంత ప్రధానమో, తనదైన ప్రత్యేకతను కల్పోలేదని చాటుకోవడానికి రాష్ట్రపతి ఎన్నిక    కేసీఆర్ కూ అంతే ముఖ్యం. బీజేపీ యేతర అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడం అంటూ శతధా ప్రయత్నించిన కేసీఆర్ ఒకానొక దశలో కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెడితే టీఆర్ఎస్ బేషరతు మద్దతు ఇస్తుందంటూ ప్రతిపాదించేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే అది కూడా కుదరకపోవడంతో ఉమ్మడి అభ్యర్థి ఆమోదయోగ్యమైతేనే ఓటు అంటూ ఒ మెట్టు వెనక్కు తగ్గారు. దాంతోనే ఆయన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో గైర్జాజర్ విధానానికే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు. ఇక ఇప్పుడు పార్టీ ప్రజా ప్రతినిథులతో సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.