ఏజీపై తెలుగుదేశం లీగల్ సెల్ ఫిర్యాదు.. చంద్రబాబు, లోకేష్ కు ఇంటర్నల్ నోట్!
Publish Date:Jul 7, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టన ఈ ఏడాది కాలంలో ఏపీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టోంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్నిల్ నియామకాలు, పని తీరుపై పార్టీ లీగల్ సెల్ పలు అంశాలపై ఇంటర్నల్ నోట్ పంపింది. ప్రస్తుతం అధిఅధికార టీడీపీ లీగల్ సెల్ న్యాయ అధికారుల పనితీరు మరియు పనితీరుపై పంపిన 76 పేజీల అంతర్గతనోట్ లో పలు ఫిర్యాదులు చేసింది. వాటిలో మాజీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై మైనింగ్ కేసులో ప్రభుత్వం తరపున వాదించడానికి జూనియర్ న్యాయవాదిని నియమించి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేయడమే కాకుండా బెయిలు మంజూరు చేయడానికి దోహదం చేసిందని ఆరోపించింది. అదే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నిందితుల తరఫున పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారనీ, ఆయన ప్రభుత్వ వాదనను పూర్వపక్షం చేస్తూ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని వాదించారీ టీడీపీ లీగల్ సెల్ ఆ ఇంటర్నల్ నోట్ లో పేర్కొంది. అలాగే జగన్ హయాంలో తెలుగుదేశం తరఫున వాదించిన పలువురు న్యాయవాదులు సముచిత పదవుల కోసం ఎదురు చూస్తున్నా, ఖాళీల భర్తీ విషయంలో ఏజీ చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద ప్రభుత్వానికి ఏజీ లక్ష్యంగా తెలుగుదేశం లీగల్ సెల్ ఇంటర్నల్ నోట్ పంపడం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక పోతే గత జగన్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ఏడుగురు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదులు, అలాగే 23 మంది స్టాండింగ్ కౌన్సిల్లే ఇంకా అలాగే కొనాసగుతున్నారని పేర్కొంది. అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి ఏడాది కాలం పూర్తియిన తరువాత కూడా పది మంది ప్రభుత్వ న్యాయవాదు, 60 స్టాండింగ్ కౌన్సెల్ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నాయని పేర్కొంది.
http://www.teluguone.com/news/content/tdp-legal-cell-internal-note-to-cbn-39-201439.html





