టెస్టుల్లో శుభ్.. ఆరంభం!
Publish Date:Jul 7, 2025
Advertisement
ఎట్టకేలకు భారత్ యువసేన ఇంగ్లండ్ గడ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగురవేయగలిగింది. కారణం.. ఒకటి శుభ్ మన్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్. మూడు ఫీల్డింగ్. ఈ మూడింటి ద్వారా గిల్ తన టెస్టు కెప్టెన్సీలో రికార్డు విజయాన్ని నమోదు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ అనే ఈ గ్రౌండ్ లో ఏ ఆసియా జట్టు కూడా ఇంత వరకూ గెలవలేదు. 2022లోనూ ఇక్కడ టీమిండియా ఓటమి పాలైంది. ఒక పక్క రివేంజ్ తీర్చుకుంటూ మరొక పక్క రికర్డు విజయాన్ని క్రియేట్ చేసింది గిల్ నాయకత్వంలోని భారత జట్టు. ఇక్కగ గమనించాల్సిన రెండు ముఖ్యమైన అంశాలేంటంటే.. ఒకటి రోహిత్, విరాట్ లాంటి హేమా హేమీ బ్యాటర్లు లేక పోవడం. రెండు బూమ్రా కూడా రెండో టెస్టుకు రెస్టు తీసుకోవడం. మరో పక్క చూస్తే ఆదిలోనే హంసపాదులాగా.. తొలి టెస్టు ఓటమి మూటగట్టుకోవడం. దీంతో గిల్ ఒక రోహిత్ మరో కోహ్లీని తనలో ఇముడ్చుకుని.. అమాంతం జట్టు బ్యాటింగ్ భారమంతా మోశాడు.. ఏకంగా ఒక ఇన్నింగ్స్ లో డబుల్, మరో ఇన్నింగ్స్ లో 150 ప్లస్ పరుగులు చేసి.. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు 600 ప్లస్ పరుగుల లక్ష్యం నిర్దేశించాడు. అంతేనా పలు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత ఒకే టెస్టులో అత్యధిక పరుగుల రికార్డును తిరగరాశాడు. గతంలో గవాస్కర్ చేసిన డబుల్, సింగిల్ సెంచరీ ఫీట్ కూడా రిపీట్ చేశాడు. ఇక మరో ముఖ్యమైన విషయం సిరాజ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ సాధించగా.. ఆకాష్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో టెన్ వికెట్ హాల్ లో చేరాడు. ఈ ఇద్దరు సీమర్లు ఏకంగా 17 వికెట్లు కొల్లగొట్టారు. ఈ కారణాల చేత భారత్ తన రెండో టెస్టులో అపూర్వ విజయం సాధించింది. ఇప్పటి వరకూ విదేశాల్లో విజయం సాధించిన టీమ్ ఇండియా జట్లలో ఎడ్జ్ బాస్టన్ లో సాధించిన విజయమే పరుగుల పరంగా అతి భారీది.
http://www.teluguone.com/news/content/shubmangil-team-historoc-win-edgebaston-39-201435.html





