ధైర్యంగా ఉండండి.. న్యాయపోరాటం చేద్దాం: మృతురాలి కుటుంబీకులకు లోకేష్ అండ
Publish Date:May 7, 2022
Advertisement
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో అనుమానాస్పద స్థితిలో మరణించిన న బీఫార్మసీ విద్యార్థిని కుటుంబ సభ్యులను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వీడియో కాల్ చేసి పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. అలాగే మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం టీడీపీ పార్లమెంటరీ స్థానం అధ్యక్షుడు బీ.కే పార్థసారథి, జెడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మంచి భవిష్యత్తు ఉన్న చెల్లికి ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, దారుణం అని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని, చాలా బాధాకరం అని ఆయన ఆవేదన చెందారు. విద్యార్థిని మృతి వెనుక పోలీసులున్నారని, నిజాన్ని కప్పిపుచ్చే యత్నం చేస్తూ నాటకం ఆడుతున్నారని లోకేష్ ఆరోపించారు. ధైర్యంగా ఉండాలని, న్యాయపోరాటం చేద్దామని మరణించిన విద్యార్థిని తండ్రికి లోకేష్ ధైర్యం చెప్పారు. విద్యార్థిని మృతి విషయంలో బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారనేది బయటపడాలన్నారు లోకేష్. విద్యార్థిని మృతి విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని, పోస్టుమార్టం రిపోర్టు రాకముందే ఆత్మహత్య అని ఎలా చెబుతారని లోకేష్ నిలదీశారు. ఇలాంటి ఘటన మరొకరికి జరగకూడదని, తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని, నిందితులకు శిక్ష పడేలా చేద్దామని మృతురాలి తండ్రి గోపికి ధైర్యం చెప్పారు. తిరుపతిలో బి ఫార్మసీ చదువుతున్న తమ కూతుర్ని మాయమాటలు చెప్పి ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారని, అఘాయిత్యం చేసి ఆమెను చంపేశారని లోకేష్ తో గోపి ఆవేదనతో చెప్పుకున్నాడు. పోలీసులు ఆత్మహత్య అని చెబుతున్నా.. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆయన చెబుతున్నారు. మంచం మీద మోకరిల్లినట్లు వేలాడి ఉందని, చెక్కిళ్లపై కొరికినట్లు గాయాలున్నాయని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, అఘాయిత్యం చేసి హత్య చేశారరి గోపీ కన్నీరుమున్నీరవుతున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-leaders-visited-berated-student-family-25-135573.html





