హస్తినలో చంద్రబాబు, లోకేష్ హవా.. అడిగిందే తడవుగా కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్లు

Publish Date:Aug 23, 2025

Advertisement

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఎవరికైనా సరే ఢిల్లీలో కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ లు లభించడం అంత  తేలికైన విషయం కాదు. ఇదేమీ రహస్యం కాదు. అందరికీ తెలిసిన విషయమే.   మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ల కోసం ఎన్ని తిప్పలు పడ్డారో తలియంది కాదు. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కూడా మోడీ అప్పాయింట్ మెంట్ లభించడం గగనంగా మారిన పరిస్థితులు చూశారు. గతానికీ, ఇప్పటికీ హస్తినలో కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్లు పొందడమనే విషయంలో పెద్ద మార్పేమీలేదు.

అదే కష్టం. అదే జాప్యం. అయితే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల విషయంలో మాత్రం లేదు. వారికి వెంటవెంటనే అప్పాయింట్ మెంట్లు దొరుకుతున్నాయి. ప్రధాని మోడీ అయితే లోకేష్ అడగకుండానే అప్పాయింట్ మెంట్ ఇస్తున్నారు. దీనిని బట్టే ఎన్డీయేలో తెలుగుదేశం ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటో అర్ధమౌతుంది.  

ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 15 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనీసం 12 సార్లు హస్తినలో పర్యటించారు. ఆయా సందర్భాలలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.  తాజా హస్తిన పర్యటనలో కూడా చంద్రబాబు పలువురు కేందర్ మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు నిదులు కేటాయించాలని కోరారు.

చంద్రబాబు తాజా పర్యటనకు కేవలం రెండుమూడు రోజుల మంత్రి ఏపీ మంత్రి నారా లోకేష్ హస్తినలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా లోకేష్ ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దంపడుతోందనడంలో సందేహం లేదు.  ఈ ప్రాధాన్యత, ప్రాముఖ్యతకు ప్రధాన కారణం ఎన్డీయేలో తెలుగుదేశం పాత్ర అత్యంత కీలకం కావడమే. కేంద్రంలోని మోడీ సర్కార్ మనుగడకు తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యవసరయన్న సంగతి తెలిసిందే.   

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.