రాజ్యసభ ఎన్నికలు: సీనియర్లకు బీజేపీ షాక్.. కేంద్ర మంత్రలు సహా సిట్టింగ్ లకు నో చాన్స్.!

Publish Date:Oct 6, 2026

Advertisement

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుని  సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చింది.  ముఖ్యంగా యూపీలో ఒక్కరంటే ఒక్క సట్టింగ్ రాజ్యసభ సభ్యుడికి కూడా టికెట్ ఇవ్వలేదు. పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రులతో  ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి కూడా తిరిగి అవకాశం కల్పించకుండా, ఎనిమిది మంది కొత్త ముఖాలను బరిలోకి దింపుతున్నట్లు   ప్రకటించింది.

యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం  సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం యూపీ  రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు కూడా రాజ్యసభ టికెట్ నిరాకరించడం సంచలనంా మారింది.

యూపీ నుంచి ఖాళీ అవుతున్న పది రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ సులభంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మిగిలిన రెండు స్థానాలను ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకునే  అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ వంటి కేంద్ర మంత్రులకు చోటు దక్కలేదు. వీరు ఇద్దరూ గతంలో యూపీ కోటాలోనే రాజ్యసభ సభ్యులుగా సేవలందించినప్పటికీ, ఈసారి వారికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది.

పార్టీ విడుదల చేసిన కొత్త జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్‌కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,   వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ఉ:దని స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించే సంస్థాగత కార్యకర్తలకు గుర్తింపునిచ్చేలా ఈ జాబితాను రూపొందించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో ముగ్గురు ఓబీసీ వర్గాలకు చెందిన వారు, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), మరో ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉన్నారు. అంతేకాకుండా, సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఇద్దరు మహిళా అభ్యర్థులకు కూడా  స్థానం కల్పించడం విశేషం. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ తో పాటు ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శ్రుతి గంగ్వార్‌‌లను మహిళా కోటాలో బరిలోకి దించారు.

ఇక ఇతర ప్రముఖులలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.

కింది స్థాయి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులను ఎగువసభకు పంపడం ద్వారా, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలో ఎంపీలుగా కొనసాగిన ప్రముఖులను పక్కనపెట్టి మరీ కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో నాయకత్వ మార్పునకు పెద్దపీట వేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి.

రాష్ట్రంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి యువత, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనిపోయేలా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేయడంలో ఈ రాజ్యసభ ఎన్నికల ఎంపిక ఒక ముఖ్యమైన మెట్టుగా నిల వనుంది. సిట్టింగ్‌లను కాదని సరికొత్త బృందాన్ని ఎగువసభకు పంపడం ద్వారా పార్టీలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు, సమర్థులైన కొత్త నాయకులను జాతీయ స్థాయికి పరిచయం చేయాలనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీనియర్ నాయకులను పక్కనపెట్టడంపై కొంతమేర అంతర్గత అసంతృప్తి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల కోణంలో ఈ జాబితా పార్టీకి ఎన్నికల సమయంలో లబ్ధి చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అక్టోబర్ 16న జరగనున్న పోలింగ్ అనంతరం ఈ కొత్త అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా లేదా సులభంగానే రాజ్యసభకు ఎన్నికవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.


[Rajya Sabha elections, BJP candidates, Uttar Pradesh politics, Union Ministers, UP Assembly elections, Telugu One]

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.