జే ట్యాక్స్ 30 వేల కోట్లే పెట్టుబడులా! మేకపాటి ఇదిగో చంద్రబాబు ఘనత..
Publish Date:Jun 9, 2021
Advertisement
గత రెండేండ్లలో ఆంధ్రప్రదేశ్ లో 65 భారీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటనపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రిగారు జోక్ చేశారా లేక జనాలను ఏప్రిల్ పూల్ చేశారా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా కరోనా కారణంగా ఉన్న పరిశ్రమలే సరిగా రన్ కావడం లేదు. ఇలాంటి సమయంలో పెట్టుబడులు రావడం అంటే వండరే. అయినా 65 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశామని మంత్రి ప్రకటన చేసి అభాసుపాలయ్యారనే చర్చ జరుగుతోంది. పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటనపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. మంత్రిగారు మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఎక్కడున్నాయో సెలవివ్వండి అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఏ జిల్లాలో ఏ పరిశ్రమ వచ్చిందో వివరాలు ఇవ్వగలరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలైతే మంత్రి మేకపాటిని చెడుగుడు ఆడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన కంపెనీలు వివరాలన్ని ఇస్తాం.. మీ పాలనలో వచ్చి పరిశ్రమల లిస్టు ఇస్తారా అంటూ నిలదీస్తున్నారు. అంతేకాదు గత టీడీపీ హయాంలో వచ్చిన విదేశీ పెట్టుబడులు, ఏర్పాటైన పరిశ్రమల పేర్లు, వచ్చిన ఉద్యోగాల వివరాలను జిల్లాల వారీగా చూపిస్తూ పోస్టులు పెట్టారు. మొత్తం 1220 కంపెనీలకు సంబంధించి పెట్టుబడి, కల్పించిన ఉద్యోగాల వివరాలు విడుదల చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 30000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి అంటున్నారు.. మీరు కూడా ఇలా.. ఏ కంపెనీలు వచ్చాయో.. ఎక్కడ వచ్చాయో .. పెట్టుబడి ఎంతో చెబుతూ లిస్ట్ ఇవ్వగలరా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రెండేళ్ల వైసీపీ పాలనలో పరిశ్రమలను బెదిరించి వసూలు చేసిన జగన్ ట్యాక్స్ (జే ట్యాక్స్) రూ. 30 వేల కోట్లనే... రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులుగా మీరు చెప్పినట్టున్నారని లోకేశ్ సెటైర్ వేశారు. రాష్ట్రానికి 65 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని సెలవిచ్చారనీ, ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి రాష్ట్రానికి వచ్చిన కొత్త కంపెనీలు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 3, 4 స్థానాల్లో ఉంటే, రెండేళ్ల జగన్ పాలనలో 13వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. చంద్రబాబు తీసుకొచ్చిన కియా మోటార్స్ యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీలు వీధి రౌడీల కంటే ఘోరంగా బెదిరించడం చూశాక ఏ విదేశీ కంపెనీ ఏపీకి వస్తుందని ప్రశ్నించారు. జే ట్యాక్స్ చెల్లించని కంపెనీలపై పీసీబీని ప్రయోగించి మూసివేయిస్తుంటే.. కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఎవరొస్తారని నారా లోకేష్ ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/tdp-counter-to-ap-minister-mekapati-gowtham-39-117281.html





