కేసీఆర్ వీక్ నెస్ ఇదే.. ఈటల సంచలనం

Publish Date:Jun 9, 2021

Advertisement

టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా దూకుడు మరింత పెంచారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండవరోజు పర్యటించిన ఈటల.. తన మద్దతుదారులతో కలిసి బలప్రదర్శన చేశారు. ఇల్లందకుంటకు వెళ్లిన రాజేందర్.. స్థానికులతో మాట్లాడారు. తన పర్యటనతో మద్దతు కూడగట్టుకోవడంతో పాటు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ లో తనకు ఏ విధంగా అవమానం జరిగిందో వివరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను చెప్పుకుంటూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చెబుతున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ బండారం బయటపెడుతున్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా కేసీఆర్ వీకెనెస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక వ‌స్తుందంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారని ఈట‌ల రాజేంద‌ర్ ఎద్దేవా చేశారు. మ‌న ముఖ్య‌మంత్రికి ఒక అల‌వాటు ఉంది.. ఎప్పుడు ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా ఆ ని‌యోజక వ‌ర్గాల్లో వ‌రాల జ‌ల్లు కురిపించే అల‌వాటు ఉంది..కాబ‌ట్టి ఈ నియోజ‌క వ‌ర్గంలో కూడా మూల‌న ప‌డ్డ ప‌నులు జ‌రిగేలా నిధులు విడుద‌ల చేయాల‌ని నేను కోరుతున్నానాను ఈట‌ల డిమాండ్ చేశారు.వావిరాలను మండ‌లంగా చేయాల‌ని కోరాను., గ‌తంలో చ‌ల్లూరు మండ‌లం కావాల‌ని  కోరాను. అలాగే, హుజూరాబాద్‌ను జిల్లా చేయాల‌ని కోరాను. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం. మా కోరిక మేర‌కు త‌క్ష‌ణ‌మే ఈ దిశ‌గా అడుగులు వేయాలి. 

అధికారంలో ఉన్నపుడు..  లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నానన్నారు రాజేందర్.  హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తెల్ల రేష‌న్ కార్డులు, పింఛ‌న్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు. 58 ఏళ్లు నిండిన అంద‌రికీ పింఛ‌న్లు ఇవ్వాలన్నారు. 2018 ఎన్నిక‌ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పారని.. ఇకనైనా వెంటనే అమలు చేయాలన్నారు ఈటల. హుజూరాబాద్‌లో ఓట్లు కావాలంటే నిరుద్యోగ భృతి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటూ  అని ఈట‌ల కామెంట్ చేశారు.

తానుపార్టీ పెట్ట‌లేదు.. పార్టీ మార‌లేదని  ఈట‌ల అన్నారు.  ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు మాత్రం వ‌చ్చానన్నారు. ఎవ‌రో అనామ‌కుడు ఇచ్చిన ఫిర్యాదు వ‌ల్ల తనను తొలగించారని చెప్పారు. ఎవరూ తీసుకున్న బొందలో వాళ్లే పడతారని.. తనను వేధించిన వారికి తగిన శాస్త్రి జరుగుతుందని ఈటల ఆవేశంగా మాట్లాడారు. హుజూరాబాద్‌లో కొంద‌రు చెంచాగాళ్ల‌ను పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ లో కురుక్షేత్ర యుద్ధం జ‌ర‌గ‌నుందని..  ఇక్క‌డ న్యాయ‌ యుద్ధం జ‌రుగుతుందని.. హుజూరాబాద్ ప్ర‌జ‌లే ఇక్క‌డ గెలుస్తారని చెప్పారు ఈటల రాజేందర్.  

By
en-us Political News

  
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.