రాష్ట్ర విభజనపై ఎవరిది అనుమానాస్పద వైఖరి

Publish Date:Dec 27, 2013

Advertisement

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనపై నేటికీ ఒక స్పష్టమయిన వైఖరి అవలంబించకుండా ఇరు ప్రాంత ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్, వైకాపా, తెరాసలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీలకు లేని సమస్య ఒక్క తెదేపాకు మాత్రమే ఉన్నందునే ఆవిధంగా వ్యవహరించవలసి వస్తోందని ఆ పార్టీలకు కూడా తెలుసు. కేవలం తెలంగాణాకే పరిమితమయిన తెరాస, సీమాంధ్రకే పరిమితమయిన వైకాపాలకు రెండో ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన, అవసరం కూడా లేదు గనుక ఆ రెండు పార్టీలు విభజనపై తమకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా స్పష్టమయిన వైఖరి అవలంబించగలుగుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నకాంగ్రెస్ పార్టీ, అందుకోసం తన పార్టీని తెరాస, వైకాపాలకు తాక్కట్టుపెట్టుకోవడానికి మానసికంగా సిద్దపడింది గనుక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలందరూ అభ్యంతరాలను, అభ్యర్ధనలను కాదని విభజనపై గట్టిగా మాట్లాడగలుగుతోంది.

 

ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని ఉంటే నేడు వైకాపా పరిస్థితి ఏటికి ఎదురీదుతున్నట్లు ఉండేది. కానీ దాని అదృష్టవశాత్తు తెదేపా ఆవిధంగా చేయకపోవడంతో వైకాపాకు అది ఆయాచిత వరంగా మారింది. అదేవిధంగా ఒకవేళ వైకాపా కూడా నేటికీ రెండు ప్రాంతాలలో పోటీ చేయాలని భావించి ఉండి ఉంటే, ఆ పార్టీ నోట కూడా సమైక్యమనే మాట వినపడేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

తెదేపా రెండు ప్రాంతాలలో ఎలాగయినా పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే నేటికీ స్పష్టమయిన వైఖరి చెప్పలేకపోతోంది. కానీ, రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖపై నేటికీ తెదేపా కట్టుబడే ఉంది. కానీ సీమాంధ్రలో పార్టీ ప్రయోజనాలు దెబ్బ తింటాయనే భయంతోనే ఆమాటను గట్టిగా చెప్పుకోలేకపోతోంది. అందువల్ల ఆపార్టీ తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతోందని తెలిసి ఉన్నప్పటికీ, మౌనం వహించక తప్పడం లేదు.

 

కానీ సమైక్యవాదం చేస్తున్న వైకాపా కేవలం సీమాంధ్ర పైనే తన దృష్టి పెట్టడం గమనిస్తే అది మనస్పూర్తిగా రాష్ట్ర విభజనను కోరుకొంటున్నసంగతి స్పష్టమవుతోంది. తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతో పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలను తమ తమ ప్రాంతాల ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడేందుకు అంగీకరించవలసి వస్తే, సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించాలనే తాపత్రయంతో వైకాపా భూటకపు సమైక్యవాదం చేస్తోంది.

 

నిజం చెప్పాలంటే తెదేపా వ్యవహరిస్తున్నతీరుని, అందుకు గల కారణాలను సామాన్య ప్రజలు కూడా స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. కానీ సీమాంధ్రపై పట్టుకోసం సమైక్యవాదం చేస్తున్న వైకాపా వైఖరే చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పక తప్పదు.

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.