పొత్తులపై నోరు మెదపని తెదేపా-బీజేపీ

Publish Date:Feb 28, 2014

Advertisement

 

బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొందామని భావించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు ఇవ్వడంతో, కనీసం ఇప్పుడు ఆ పార్టీ పేరు కూడా ఎత్తలేకపోతున్నారు. అలాగని ఆయన ఇంతవరకు బీజేపీకి దూరం జరుగుతున్నట్లు కానీ, బీజేపీని విమర్శించడం గానీ చేయలేదు. అదేవిధంగా యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా ఇటీవలే స్థాపించబడిన ‘థర్డ్ ఫ్రంట్’ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. అయితే బీజేపీ విభజన బిల్లుకి మద్దతు ఇచ్చినట్లు ప్రకటించిన తరువాత ఆ పార్టీకి వ్యతిరేఖంగా సీమాంధ్ర ప్రజలలో పెల్లుబికిన ఆగ్రహాన్ని ప్రతిఫలించేందుకేనన్నట్లు, కొందరు తెదేపా నేతలు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కానీ ఆ తరువాత వారు కూడా చల్లబడిపోయారు. అదే విధంగా బీజేపీ అగ్ర నేతలెవరూ కూడా తెదేపాను విమర్శలకు ప్రతిస్పందించక పోవడం గమనార్హం. ఇవన్నీ కలిపి చూస్తే నేటికీ తెదేపా-బీజేపీలు పొత్తులకి సానుకూలంగానే ఉన్నట్లు భావించవచ్చును.

 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు కుదుర్చుకొంటే కాంగ్రెస్, వైకాపాలు రెండూ కలిసి, తెదేపాపై దాడి చేసే అవకాశం ఉంది గనుకనే బహుశః రెండు పార్టీలు వెనక్కి తగ్గి ఉండవచ్చును. అయితే ఇదే అదునుగా తెదేపా స్థానంలోకి వైకాపా ప్రవేశించాలని ఆశిస్తోందని ఆ పార్టీ అధినేతకు చెందిన సాక్షి మీడియాలో మోడీ అనుకూల కధనాలు చూస్తే అర్ధమవుతుంది. అంటే తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే ఒకలాగా, తాము పెట్టుకొంటే మరోకలాగా వైకాపా ప్రచారం చేస్తుందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ, ఒకవేళ తెదేపా తమతో పొత్తులకు నిరాకరిస్తే, వైకాపాతో పొత్తులు పెట్టుకోకపోయినా తప్పకుండా ఆ పార్టీకి దగ్గరయి ఎన్నికల తరువాత ఆ పార్టీ మద్దతు పొందే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ తెదేపాతో పొత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పవచ్చును.

 

నిన్న కర్ణాటకలోని గుల్బర్గా, హూబ్లీ నగరాల్లో ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోడీ మాట్లాడుతూ "తెలంగాణ ఏర్పడాలని, ఆ ప్రాంతంతోపాటు, సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంది. కానీ.. ప్రసవ సమయంలో బిడ్డ (తెలంగాణ)కు జన్మనిచ్చి తల్లి (సీమాంధ్ర)ని చంపిన డాక్టర్‌లాగా కాంగ్రెస్‌పార్టీ వ్యవహరించింది. కాంగ్రెస్ అధిష్టానం తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు ప్రజలు కొట్టుకునేలా చేస్తారు. దేశాన్ని, రాష్ట్రాలను, హృదయాలను ముక్కలు చేయడానికి కూడా వెనుకాడరు. సీమాంధ్ర కూడా ఈ దేశంలో ఒక భాగమే. కానీ, కాంగ్రెస్ పక్షపాత వైఖరి అవలంబించి సీమాంధ్రను అనాథగా చేసింది. అక్కడ తమ పార్టీకి తీవ్ర వ్యతిరేఖత ఉన్నందున ఈ ఎన్నికలలో గెలవడం కష్టమని గ్రహించినందునే ఈవిధంగా పక్షపాత ధోరణితో వ్యవహరించింది. తెలుగుజాతిని ఘోరంగా అవమానించి, సీమాంధ్రను అనాధను చేసింది. త్వరలోనే సీమాంధ్రలో పర్యటించి గాయపడిన ప్రజల హృదయాలను సేద తీర్చే ప్రయత్నం చేస్తాను. వారి ఆవేదనను, బాధను పంచుకుంటానని" సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు.

 

త్వరలోనే మోడీ సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సభకు వస్తునందున, ఆయన ప్రభావంతో సీమాంధ్రలో బీజేపీపై వ్యతిరేఖత తగ్గవచ్చు గనుక, ఆయన మొదటి విడత ప్రచారం ముగియగానే ఆ రెండు పార్టీలు పొత్తులకు సిద్దపడవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.