Publish Date:Jul 22, 2025
తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఘం క్యూ కాంప్లెక్స-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీని వేయాలని తరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది.
Publish Date:Jul 22, 2025
మద్యపాన నిషేధం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మద్యం కుంభకోణం చేసి 3500 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సిట్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ వేసిన 305 పేజీల ఛార్జ్ షీట్ లో ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించినది ఏ 1 రాజ్ కేసిరెడ్డి.
Publish Date:Jul 22, 2025
ఏపీ మద్యం కుంభ కోణ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన పీఏ బాలాజీ కుమార్ యాదవ్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది.
Publish Date:Jul 22, 2025
వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి రెచ్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాలిలో గెలిచిన..గాలిన కొడుకులు ఎక్కువయ్యారంటూ కూటమి నేతలపై మండిపడ్డారు.
Publish Date:Jul 22, 2025
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో ఇండియాని అదృష్టం వెక్కిరిస్తోంది. భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ టూర్ లో మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పటికీ లక్ మాత్రం కలిసి రావడం లేదు.
Publish Date:Jul 22, 2025
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ స్పందించారు. వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Publish Date:Jul 22, 2025
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ చేసిన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఇప్పుడు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం. ఇక్కడే ధన్ ఖడ్ రాజీనామాకు కారణాలేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు, ధన్ ఖడ్ రాజీనామాకూ ముడి పెడుతూ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.
Publish Date:Jul 22, 2025
ఒక టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్, మూడు పూటలా బయట నుంచి భోజనం, మంచం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు, ఒక పర్యవేక్షకుడు, వారానికి ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు, రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్స్. ఇదీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలిక నిందితుడు మిథున్ రెడ్డి జైల్లో కావాలని అడిగిన సౌకర్యాలు
Publish Date:Jul 22, 2025
దేశంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటైన 2006 ముంబై రైలు పేలుళ్లు కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబై లోకల్ రైళ్లలో జూలై 11, 2006న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశాన్ని విషాదంలో ముంచాయి. ఈ కేసులో కింద కోర్టు నిందితులకు విధించిన శిక్షను బాంబే హైకోర్టు రద్దు చేసి నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Publish Date:Jul 22, 2025
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎలాంటి సంకేతం, సమాచారం లేకుండా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్‌ఖడ్ తమ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు సమర్పించారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.
Publish Date:Jul 22, 2025
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఛామకూర మల్లారెడ్డి కమలం గూటికి చేరనున్నారా? కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే తెలంగాణ రాజకీయవర్గాలలో ఔననే ప్రచారమే జరుగుతోంది.
Publish Date:Jul 22, 2025
గత నాలుగు రోజులుగా తెలంగాణలో దంచి కొట్టిన వర్షాలు మంగళవారం నాడు ఒకింత తెరిపి ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఏపీ వంతు అంటున్నాయి. రానున్నమూడు రోజులూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Publish Date:Jul 22, 2025
నల్లమల అడవి ప్రాంతంలోని అభయారణ్యంలో పెద్దపులి దాడిలో ఓ గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆత్మకూరు రేంజ్ లో కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గుడానికి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడిపై సోమవారం పులి దాడి చేసింది.