ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ  మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్‌గా రెండో సారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ విశ్వసనీయత ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ గ్లోబల్‌ లీడర్‌ సర్వేలో  మోడీ మరోసారి తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. సర్వేలో ప్రధాని మోడీకి అత్యధిక శాతం మంది మద్దతు ప్రకటించడంలో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75 శాతానికి చేరాయి. ఈ ఏడాది జులై 4 నుంచి 10 తేదీల మధ్య సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో ప్రధాని నంబర్1గా నిలవడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల మంది ప్రజల గౌరవాభిమానాలు చూరగొన్న నేతగా ప్రధాని నిలిచారని అన్నారు. అత్యధిక అనుకూల రేటింగ్స్ కలిగిన నేతగా ఉన్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. బలమైన నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా గౌరవాభిమానాలు పొందే నేత సారథ్యంలో భారత్ భద్రంగా ఉందని కామెంట్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోడీ 2021 నుంచి ప్రథమస్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేల్లో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70 శాతానికి పైగానే ఉంటోంది. 2022 సర్వేలో కూడా 13 ప్రపంచం నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్‌లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76 శాతానికి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్ఠంగా 78 శాతాన్ని తాకాయి. తాజా సర్వేలో ప్రధాని తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా నేత లీ జే మ్యూంగ్ ఉన్నారు. 59 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో  ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అర్జెంటీనా నేత జేవియర్ మైలీ (57 శాతం), కెనడా అధినేత మార్క్ కార్నీ (56 శాతం) ఉన్నారు. ఇక ఈ జాబితాలో 44 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు అనకాపల్లిలో మీడియా సమావేశంలో సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.1660 కోట్లతో నామిషన్ పనులు ఇచ్చారని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ అన్నారు.  గత బీఆర్‌‌ఎస్ హయాంలో రిత్వి ప్రాజెక్టు రూ.2000 కోట్లతో చేపట్టారని వాటిని నామిషన్ కింద ఇచ్చార అని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని నాపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ కవిత జైల్లో ఉన్నప్పుడు దిల్లీలో నా ఇంటికి వచ్చి కలిసిన విషయం కేటీఆర్‌ మర్చిపోయారా..? రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న భయంతో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై చేసిన తప్పుడు ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం’’ అని సీఎం రమేశ్‌ అన్నారు. 
2024 ఎన్నికల ముందు మంగళవారం, అమావాస్య నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు కూటమి పై కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో అమావాస్య నాడు పవన్ చేసిన ఈ కూటమి ప్రకటనపై పులువురి నుంచి అభ్యంతరాలొచ్చాయి. కానీ ఫలితాల తర్వాత తేలింది ఏంటంటే పవన్ అమావాస్య సెంటిమెంట్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అని.  పవన్ ఏమీ సెంటిమెంట్లు తెలీని వాడేమీ కాడని.. ఆయనకు కూడా జ్యోతిష సలహా సూచనలు ఇచ్చేవారు ఉన్నారని అంటారు. ఎవరో ఒక మహిళా జ్యోతిష్కురాలి సూచనల మేరకే పవన్.. వారాహీ అమ్మవారి కొలుపులు మొదలు పెట్టారనీ చెప్పుకొస్తారు. అంతే కాదు ఆయన తన వాహనానికి వారాహీ అని పేరు పెట్టడం ఆపై ఎన్నో యజ్ఞ యాగాలు చేయడం.. ఆ తర్వాత వారాహీ దీక్ష, సనాతన ధర్మ పరిరక్షణ.. అందులో భాగంగా భారీ ఎత్తున తీర్ధయాత్రలు, ఆపై తమిళనాడు మురుగన్ మానాడు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని చూస్తే పవన్ కి అమావాస్య పౌర్ణమి సెంటి మెంట్ల గురించి బాగా తెలుసనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మేటరేంటంటే జూలై 24న ఆషాడ అమావాస్య నాడు తన హరి హర వీరమల్లు రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేశారు పవన్. తాను గతంలో అమలు చేసిన అమావాస్య సెంటిమెంటు వర్కవుట్ అవుద్దని ఈ సారి కూడా ఫీలైనట్టు కనిపించింది. కానీ అదెందుకో ఎదురుకొట్టినట్టు కనిపిస్తోంది. రిలీజ్ వరకూ హైప్, పబ్లిసిటీ అంతా బాగానే ఉంది. ఎక్కడ తేడా కొట్టిందో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు కొందరు జన సైనికులు. బేసిగ్గా అమావాస్య తెలుగు వారికి కలసి రాక పోయినా.. తమిళ సంప్రదాయంలో అవి అతి పెద్ద శుభకరమైన రోజు. వీరి లెక్కల ప్రకారం పౌర్ణమి చంద్రుడు నానాటికీ కరిగిపోతూ వస్తాడు. అదే అమావాస్య చంద్రుడు అంతకంతకూ ఎదుగుతాడు కాబట్టి.. ఎదుగుదల ఆశించేవారు అమావాస్య నియమాన్ని ఆచరించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. తమిళనాట కూడా  అనుబంధం ఉన్న పవన్ ఈ దిశగా తన సెంటి మెంటు తొలి సారి విజయవంతం కావడంతో రెండో సారి కూడా ప్రయత్నించి చూశారు. అయితే ఇదేమంత  పని చేసినట్టు లేదు. దానికి తోడు పవన్ ఎంతో భక్తిగా కొలిచే వారాహీ అమ్మవారికి మరెంతో ఇష్టమైన నెల కూడా ఆషాడమే. అలాంటి ఆషాడ మాసంలోని పౌర్ణమిని   వదిలి అమావాస్య వెంట పడ్డారు పవన్. అందులో భాగంగా తన సినిమా హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ని ఆషాడ అమావాస్య రోజును మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారాయన. కట్ చేస్తే.. అది కూడా దారుణంగా దెబ్బ తీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు పరిస్థితేంటంటే.. ఆ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే వారే కరవయ్యారు. ఇక సినిమీలో ఆయన గుర్రం సీన్లు దారుణంగా ట్రోలవుతున్నాయి. ఇక హాళ్లలో జనం లేని క్లిప్పింగులెన్నో వైరలవుతున్నాయి. ఈ మొత్తం ఘోర పరాజయంతో ఒక ఫ్యామిలీ ప్యాక్ ఫ్లాప్ షో కంప్లీట్ అయినట్టు కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆచార్య- భోళా శంకర్- మట్కా- గేమ్ ఛేంజర్- హరిహర వీరమల్లు.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుస డిజాస్టర్లు నమోదు చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్టే లేని పవన్ కి.. తర్వాత వచ్చే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలే ఊపిరి పోయాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ALSO ON TELUGUONE N E W S
  నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేయనున్నారు. అంతేకాదు, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు.. 'ఆదిత్య 999'. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.    'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను రూపొందించాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కథ సిద్ధంగా ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని గతంలో ప్రకటించారు. అలాగే, ఈ చిత్రంలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని తెలిపారు. అయితే పలు కారణాల వల్ల 'ఆదిత్య 999' ఆలస్యమవుతూ వస్తోంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా ఫుల్ బిజీగా ఉన్న బాలయ్యకు.. దర్శకుడిగా సినిమా చేసే సమయం దొరకడం అంత తేలిక కాదు. అందుకే కొంతకాలంగా 'ఆదిత్య 999' ఊసు లేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా 'ఆదిత్య 999' మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి క్రిష్ దర్శకత్వం వహిస్తారని, ఈ సినిమాలో బాలయ్యతో కలిసి మోక్షజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని వినికిడి.   'ఆదిత్య 999'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వయంగా తానే దర్శకత్వం వహించాలని బాలయ్య భావించారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర బాధ్యతలను దర్శకుడు క్రిష్ కి అప్పగించడం విశేషం. బాలకృష్ణ-క్రిష్ గతంలో కలిసి పని చేశారు. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఆ తర్వాత 'కథానాయకుడు', 'మహానాయకుడు' అంటూ రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఇప్పుడిది వీరి కాంబోలో నాలుగో సినిమా కానుంది.   సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనున్న 'ఆదిత్య 999'ను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి నిర్మించనున్నారట. క్రిష్ డైరెక్ట్ చేసిన పలు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించే ఆలోచనలో ఉన్నారట.   క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో 'ఘాటీ' సినిమా చేస్తున్నారు. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 'ఆదిత్య 999' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.  
Lokesh Kanagaraj has become one of the most sought after directors in Indian Cinema. His Kaithi, Master, Vikram have built such an aura for him among masses that his next film, Coolie has highest anticipation. Also, the movie stars Superstar Rajinikanth, King Nagarjuna, Aamir Khan, Shruti Haasan, Upendra in leading roles.  The director is giving multiple interviews to media personalities and he shared some interesting updates. He stated that the movie will have watch smuggling track and hence, he developed watch chain for an action sequence. He also stated that he is a fan of Nagarjuna from Ratchagan/ Rakshakudu days and chased him for Simon role.  Lokesh stated that he used to sit with Nag, every weekend and did not give him time to say, No. As the senior hero has been hesitant, Lokesh met him seven times and gave narrations till he accepted. He further stated that he is still in awe of the actor, even in his 60's, he is able to maintain his look, aura.  Even Shruti Haasan stated that Nagarjuna will shock Telugu audiences, as his menacing looks will be thrilling to watch. Lokesh added that he did not want to try another actor except for Nagarjuna for the role. He remarked that Anirudh Ravichander and his team, loved the film. The movie is releasing on 14th August, Pan-India. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘కింగ్‌డమ్‌’ ఈ నెల 31న విడుదల కాబోతోంది. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలికాలంలో హిట్‌ అనేది లేని విజయ్‌ దేవరకొండ.. ఎట్టి పరిస్థితుల్లో ‘కింగ్‌డమ్‌’ను హిట్‌ చెయ్యాలన్న పట్టుదలతో ఉన్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి భారీ ఓపెనింగ్స్‌ సాధించాలని మేకర్స్‌ భావిస్తున్నారు.  జూలై 26న తిరుపతిలో ‘కింగ్‌డమ్‌’ ట్రైలర్‌ లాంచ్‌ జరగబోతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌కి షాక్‌ ఇచ్చాయి గిరిజన సంఘాలు. విజయ్‌ దేవరకొండ తమకు సారీ చెప్పాలని, లేకుంటే ట్రైలర్‌ లాంచ్‌ని అడ్డుకుంటామని గిరిజన నేతలు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను వారు విడుదల చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన నేతలు మాట్లాడుతూ ‘ఏప్రిల్‌ 26న నిర్వహించిన రెట్రో చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో గిరిజనులను కించపరిచేలా విజయ్‌ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, కామన్‌ సెన్స్‌ లేకుండా కొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. గిరిజనులు ప్రకృతి ప్రేమికులు. వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. సొసైటీలో బాధ్యత గల హీరో ఒక జాతిని కించపరచడం ఎంతవరకు న్యాయం? ఆయన చేసిన వ్యాఖ్యల్ని గతంలోనే ఖండిరచాం. మాకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేశాం. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా మాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఈరోజు జరగనున్న ‘కింగ్‌డమ్‌’ ట్రైలర్‌ లాంచ్‌ని అడ్డుకుంటాం’ అని గిరిజన నేతలు విజయ్‌ దేవరకొండను హెచ్చరించారు. 
Nara Rohith faced huge disasters and a big set back in his career, hence, he took a gap of 6 years. With Bhairavam, he made a comeback into films and now, he is gearing up to release his Sundarakanda for Ganesh Chaturthi, on 27th August. The movie has been securing positive reports even before release in the Industry.  The reports suggest that OTT platform, Jio Hotstar have secured the OTT rights after watching the film for a whopping, Rs.9 crores. For a film of this magnitude, it is stated to be huge and that too, when the markets are so low and struggling. On top of it, the movie got Rs.3 crores for Hindi dubbing and audio rights.  Combined, the movie got Rs.12 crores amount from non-theatrical rights and it is stated to be slice-of-life comedy family entertainer. The movie is directed by Venkatesh Nimmalapudi and produced by Santhosh Chinnapolla, Gowtham Reddy, and Rakesh Mahankalli. With a caption, no two love stories are same, they intrigued everyone. Nara Rohith seems to have gone for a big makeover to shed weight and play a college boy in the film. We have to wait and see, how he will pull it off on screen. But it is interesting to see a movie receiving such positive reports prior to release.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సోషల్‌ మీడియా పరిధి పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం, అనవసరమైన కామెంట్స్‌, ట్రోలింగ్‌ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా సక్సెస్‌మీట్‌లో అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పవన్‌కళ్యాణ్‌పై కేసు నమోదైంది. హరిహర వీరమల్లు సక్సెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌ ఏం మాట్లాడారు, ఎందుకు వివాదాస్పదమైంది, ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. హరిహర వీరమల్లు సక్సెస్‌మీట్‌లో అభిమానులను ఉద్దేశించి పవన్‌ మాట్లాడుతూ ‘సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రతి కామెంట్‌ గురించి ఫీల్‌ అవ్వాల్సిన అవసరం లేదు. దమ్ముంటే తిరిగి కొట్టాలి’ అంటూ ఫ్యాన్స్‌కి పిలుపునిచ్చారు. అంతేకాదు, అలాంటి కామెంట్స్‌కి దిమ్మతిరిగే రిప్లై ఇవ్వాలని, నెగెటివ్‌ కనిపిస్తే వదిలిపెట్టవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పవన్‌ చేసిన ఈ కామెంట్స్‌పై.. వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులు చెయ్యాలంటూ అభిమానుల్ని పవన్‌కళ్యాణ్‌ రెచ్చగొడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  వైసీపీ నేతల చర్యలపై పవన్‌కళ్యాణ్‌ అభిమానులు, జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ నాయకుడు దాడులు చేయమని చెప్పలేదని, వచ్చిన కామెంట్స్‌కి ధీటుగా సమాధానం చెప్పాలని మాత్రమే సూచించారని స్పష్టం చేశారు. ఈ మాత్రం వ్యాఖ్యలకే పవన్‌కల్యాణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న వైసీపీ నేతలకు సోషల్‌ మీడియా ద్వారా సమాధానం ఇచ్చారు జనసైనికులు. గతంలో వైసీపీ వారు తమ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారి కార్యకర్తలను తమపై ఉసిగొల్పారు. భౌతికంగా దాడులు చేసేందుకు సిద్ధపడ్డారు. అన్ని దారుణాలు చేసిన వైసీపీ నేతలపై ఎలాంటి కేసులు పెట్టాలి, ఎన్ని కేసులు పెట్టాలి అంటూ సోషల్‌ మీడియా వేదికగా కూటమి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ తను చేసే సినిమాల ద్వారానే కాదు, కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తన తల్లి పేరు మీద స్థాపించిన బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. అంతేకాదు, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి వారికి సాయం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ సంఘటన ఆదోనిలో జరిగింది.  కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రి నారాయణస్వామి అనే వ్యక్తి ఎంతో కాలంగా బాలకృష్ణకు అభిమానిగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు స్వామి. అందులో భాగంగా అతనికి లివర్‌ మార్పిడి చెయ్యాలని అవసరం వచ్చింది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాదాపు 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. తన అభిమాని చికిత్స కోసం ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూశారు. బద్రి స్వామికి 10లక్షలు ఎల్‌ఓసీని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర చేతుల మీదుగా స్వామికి అందజేశారు.  బద్రి నారాయణస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడన్న విషయాన్ని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ద్వారా బాలయ్య తెలుసుకున్నారు. అభిమాని కోసం ప్రభుత్వం నుంచి సహాయం అందేందుకు కృషి చేసిన నందమూరి బాలకృష్ణను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఎల్‌ఓసీ పత్రాన్ని అందించిన వసుంధరకు, సహాయం అందేందుకు కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు నారాయణస్వామి కృతజ్ఞతలు తెలిపారు. 
  Cast: Pedro Pascal, Vanessa Kirby, Ebon Moss-Bachrach, Joseph Quinn, Julia Garner, Sarah Niles, Mark Gatiss, Natasha Lyonne, Paul Walter Hauser, Ralph Ineson Crew:  Based on Fantastic Four by Stan Lee, Jack Kirby Written by Eric Pearson, Jeff Kaplan, Ian Springer, Kat Wood, Josh Friedmen Cinematography by Jess Hall Music by Michael Giacchino Editing by Nona Khodai, Tim Roche Directed by Matt Shakman  Produced by Kevin Feige    Fantastic Four has been one of biggest Marvel Superheroes in the comics but they did not enter into MCU, due to rights issues for long. Now, they have been included with The Fantastic Four First Steps film. Let's discuss about it in detail.    Plot:  Reed Richards (Pedro Pascal) has announced his superpowers and starts taking video classes as Dr. Fantastic. His wife Sue Storm/ Invisible Woman (Venessa Kirby) is pregnant but she takes care of diplomatic issues between nations. Johnny Storm /Human Torch  (Joseph Quinn) and The Thing/ Ben Grimm (Ebon Moss-Bachrach) settle with them in Baxter Tower. They are Fantastic Four and people celebrate them as Earth's mighty superheroes.  Shalla-Bal/ Silver Surfer (Julia Garner) arrive to the earth and announces that Galactus (Ralph Ineson), a 14-billion year old creature is gearing up to eat planet earth. Fantastic Four have to fight against him but he asks for their new born child to spare Earth. Will they sacrifice their baby? Can they stop Galactus? Watch the movie to know more.    Analysis:  Fantastic Four comics have been the biggest page-turners for Marvel post Spider-Man and Avengers. So, studios have been working towards developing films based on these characters but except for the first adaptation, none became successful at the box office.  With MCU entry too, the first family of superheroes could not really evoke a strong emotional connect with them. The script tried to stay true to the comics but the characters did not look like they have been fully developed. It felt like a random episode rather than building on the stakes.  With Thanos, MCU could build a gigantic villain and threat over time but Galactus, even more terrifying villain doesn't look that big of an issue. The stakes seem simple for the kind of movie they are mounting with a family of superheroes. Almost they have sidelined The Thing and it feels like producers rushed into making this film.  Pedro Pascal, Vanessa Kirby, Ebon Moss-Bachrach, Joseph Quinn are good but the story needed enough high stakes drama which is ineffectively dealt with. The movie is an improvement over recent MCU films but the feeling of watching another TV episode doesn't wash away.    Bottomline:  Better than previous MCU films but ineffective.    Rating: 2.5/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.  
  Cast: Vijay Sethupathi, Nithya Menen, Suraj Venjramoodu, Yogi Babu, Deepa, Roshini  Crew:  Music by Santhosh Narayanan  Editing by Pradeep E. Ragav Cinematography by M. Sukumar Written & Directed by Pandiraaj Produced by Sendhil Thyagarajan & Arjun Thyagarajan   Vijay Sethupathi delivered a massive blockbuster with Maharaja and now, he worked with Pandiraaj for Thalaivan Thalaivi. Nithya Menen played leading lady role opposite him and music by Santosh Narayanan has created good buzz for it. Let's discuss about the film, in detail.    Plot:  Agasaveeran (Vijay Sethupathi) starts fighting with his wife Arasi (Nithya Menen)'s family at the Karuppu Samy Temple. Without inviting him, they decide to tonsure their only child's hair for the first time. This agitates him and his entire family arrives to support him. When villagers ask them what is the issue, he starts narrating their story.  He married Arasi, after falling in love with her, against her and his family objections. He keeps calling her Perarasi and tells few lies. She accepts everything yet Agasaveeran's mother (Deepa) and sister (Roshini) start creating issues. What are they? Why did he not invited to tonsure event? Watch the movie to know more.    Analysis:  The movie has Pandiraj's mark all over it. Taking a simple village setup, he once again created characters that seem typical to rural milieu. He keeps inserting fun into the proceedings at timely intervals, keeping it real and refreshing.  But the writing gets draggy and narrative stumbles upon road block in the second hour. While the couple-  Vijay Sethupathi and Nithya Menen have chemistry, we are not allowed to watch more scenes between in the second hour for some time, giving more importance to tertiary events.  Still, the movie is watchable because of the performances, mainly, Vijay Sethupathi and Nithya Menen. They did not play these sort of characters before anf they are pitch perfect. Sethupathi as an innocent man, who loves his wife and unable to solve issues between her and ladies of his house, does a  brilliant job. His performance balances the monotonic tone at many places. Nithya Menen is good and Deepa does well. Music by Santosh Narayanan is a plus for the film and the baby role needs a special mention. Overall, with flaws in writing, it still gives a refreshing take on marriage and how to solve issues between couples within family.    Bottomline:  Good performances hold this family tale together.    Rating: 2.75/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.  
  హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై మాట్లాడడం జరిగింది.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "సాధారణంగా చిత్రపురి కాలనీలో ఆరు నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో అందరం ఒక కుటుంబ సభ్యులులాగా కూర్చుని మాట్లాడుకుని మాకు ఉన్న సమస్యల గురించి చర్చించుకుంటాము. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ సమావేశంలో మాట్లాడకుండా చలో ఫిలిం ఛాంబర్, చలో గాంధీభవన్ అంటూ బయటికి వస్తున్నారు. వారిలో అసలు చిత్రపురి కాలనీకి సంబంధం లేని వారు కూడా ఉండటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఈ కారణంగా కాలనీలో ఉండే ఎంతోమంది భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే చిత్రపురి కాలనీ ఎన్నో సమస్యలలో ఉంది. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఒక కుటుంబం లాగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాము. అవినీతి జరిగింది అంటూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడేవారు వారి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని వస్తే బహిరంగంగా మాట్లాడేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసాము. కాని ఎవరు రాలేదు. అంతేకానీ ఈ సమావేశం వ్యక్తిగతమైనది కాదు. చిత్రపురి కాలనీలో 4713 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారు. 700 నుండి 850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ పై సుమారు 3000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు. ఆరోపణలు చేసే వారితో బహిరంగంగా మాట్లాడేందుకు ఈరోజు లైవ్ పెట్టి మరి మీడియా సమక్షంలో మాట్లాడేందుకు ఈ సమావేశానికి రావడం జరిగింది. కోర్టులో ఉన్న కొన్ని విషయాలపై నేను మాట్లాడలేను కాని మిగతా వాటిపై నేను మాట్లాడతాను " అంటూ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.    * చిత్రపురి కాలనీలో జాయిన్ కావాలంటే కచ్చితంగా సినీ కార్మికులయ్యే ఉండాలి. ప్రస్తుతానికి సుమారు 60 శాతం మాత్రమే అలా ఉన్నారు. కొంతమంది అమ్ముకుని బయటకు వెళ్లిపోయారు.  * 2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో G+2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించడం జరిగింది. అవి అన్ని పెర్మిషన్ తోనే జరిగాయి కాని కొంతమంది కేసులు పెట్టిన కారణంగా ఆ కట్టడాలు ఆపడం జరిగింది.  * ఇప్పటికీ ఉన్న రేట్లు అన్ని సమావేశంలో చర్చించుకుని ఫిక్స్ చేసినవే. అలాగే కాలనీ పై ఉన్న అప్పును దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు నిర్ణయించడం జరిగింది. సఫైర్ సూట్ నిర్మించేందుకు అన్ని పర్మిషన్లతోనే ముందుకు వెళ్తున్నాము.  * శ్రావణమాసంలో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టనున్నాము. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలకు తగ్గట్లు అన్ని రకాల ఎమినిటీస్ తో సఫైర్ సూట్ నిర్మించబోతున్నాము. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి కాకపోతే కాలనీ మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా పర్మిషన్లు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దానిని పూర్తి చేసి ఉన్న సమస్యలు అన్నిటిని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్ సూట్ ప్లాన్ చేస్తున్నాము.  * చిత్రపురి కాలనీలో నీటి సమస్య అనేదే లేదు. నిరంతరం మంజీరా నీటి సరఫరా ఉంటుంది.  * కాలనీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ సరైన మెంబర్షిప్ లు ఉంటే కచ్చితంగా వారికి ఫ్లాట్ వచ్చేందుకు మా కమిటీ పూర్తి సహకారం అందించి వారికి ఫ్లాట్ వచ్చేలా పనిచేస్తుంది. వారికి ఫ్లాట్లు ఇచ్చేందుకు కూడా రెడీ గానే ఉన్నాయి.  * వచ్చే సెప్టెంబర్ నెలలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఆరోపణలు చేసేవారు వివరణ ఇవ్వాలి. ఆ వివరణ ఆధారంగా చర్యలు ఉండబోతాయి.  * ఇప్పటికీ చిత్రపురి కాలనీ పై ఉన్న సుమారు 170 కోట్ల రూపాయల అప్పును తీర్చాలంటే సఫైర్ సూట్ కేవలం 48 నెలలలో పూర్తిచేస్తే ఆ అప్పును తీర్చే అవకాశం ఉంది. అంతేకానీ కాలనీలోని సభ్యులపై ఆ అప్పు పడదు.  * 2023 తర్వాత ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఒకవేళ అలా చేసిన 336లో సినీ కార్మికులు కాని వారు ఎవరైనా ఉంటే వారిని తీసేయడానికి అనిల్ కుమార్ కమిటీ సపోర్ట్ చేస్తుంది.  * సినీ జర్నలిస్టులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా సినీ జర్నలిస్టులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అలాగే 24 క్రాఫ్ట్స్ లో తమ అసోసియేషన్ ద్వారా వస్తే ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము.  * గతంలో లోన్స్ కట్టలేని పరిస్థితులలో ఆక్షన్ వేసే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో చదలవాడ శ్రీనివాస్ గారు చిత్రపురి కాలనీకి అండగా నిలబడ్డారు.  * ప్రభుత్వం వారు ఇప్పటికే వేసిన కమిటీ వారు ఎవరైనా సినీ కార్మికులకు న్యాయంగా ఫ్లాట్ వెళుతుంది అని చెప్తే కచ్చితంగా వారికి ఫ్లాట్ ఇస్తాము.  * సభ్యులను తీయాలంటే రెండు ప్రక్రియలు మాత్రమే ఉంటాయి. ఒకటి సరైన సమయంలో డబ్బులు కట్టకపోవడం వల్ల తీసేస్తాము. లేదా సినీ కార్మికులు కాని వారిని తీసేస్తాము. ఈ రెండు కారణాలు కాకుండా సభ్యులను తీసేసే అవకాశం ఎవరికీ లేదు.  ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీకి సంబంధించిన సెక్రటరీ దొరై, కమిటీ మెంబర్లు లలిత, రామకృష్ణ, రఘు, లహరి తదితరులు పాల్గొన్నారు.  
యూత్‌లో ఒక కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన ఘనత అబ్బాస్‌కి దక్కుతుంది. 1990వ దశకంలో వచ్చిన ప్రేమదేశం తదితర చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు అబ్బాస్‌. ఆరోజుల్లో లవర్‌బోయ్‌ మంచి పేరు తెచ్చుకున్న అబ్బాస్‌ హెయిర్‌ స్టైల్‌కి విపరీతమైన క్రేజ్‌ ఉండేది. తమిళ్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన అబ్బాస్‌.. అనువాద చిత్రాల ద్వారా తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌ ఫ్యాన్స్‌ ఎక్కువగా ఉండేవారు. అలాంటి హీరో సడన్‌గా సినిమాలకు దూరంగా వెళ్లిపోయారు. సినిమాలు వదిలేసి విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నారని సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం జరిగింది.  2014లో తెలుగులో ఒక సినిమాలో కనిపించిన అబ్బాస్‌.. 11 ఏళ్ళ గ్యాప్‌ తర్వాత మళ్లీ ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. జి.వి.ప్రకాష్‌ హీరోగా రూపొందనున్న ఒక తమిళ సినిమాలో అబ్బాస్‌ను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. మరియరాజా దర్శకత్వంలో జయవర్థనన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో గౌరీప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. అబ్బాస్‌ గతంలో చేసిన సినిమాలు ఇప్పటి యూత్‌ కూడా డిజిటల్‌  ప్లాట్‌ఫామ్స్‌లో చూసి ఉన్నారు కాబట్టి వారికి కూడా అతను పరిచయమే. అబ్బాస్‌ మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు అనేది చాలా మందికి సంతోషాన్నిచ్చే వార్తే. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఇప్పటికే జి.వి.ప్రకాష్‌ చేసిన తమిళ సినిమాలు తెలుగులో చాలా విడుదలయ్యాయి. ఆ విధంగా ఈ సినిమా కూడా తెలుగులో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అబ్బాస్‌కి మంచి రీ ఎంట్రీ అయ్యే ఛాన్స్‌ ఉంది. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అబ్బాస్‌కి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అతను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు కాబట్టి ఇక్కడ కూడా అతని కెరీర్‌కి ఉపయోగపడే సినిమాలు రావచ్చు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రపంచంలో పిల్లల్ని పెంచడం అంత నైపుణ్యమైన పని మరొకటి ఉండదేమో! ఒక పక్క వారి ఆలనాపాలనా చూసుకుంటూ... మరో పక్క వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ సాగే ఈ ప్రయాణం ఏమంత సులువైంది కాదు. అలాంటి సమయంలో పిల్లలు అబద్ధం చెబుతున్నారని తేలిందనుకోండి... అంతే! తల్లిదండ్రుల ప్రతిస్పందన అసాధారణంగా ఉంటుంది. తమ పెంపకంలో ఏదో లోటు జరిగిపోయిందనో, పిల్లలు సరిగా ఎదగడం లేదనో తెగ బాధపడిపోతారు. శాశ్వతంగా పిల్లల పట్ల అనుమానపు దృక్పథాన్ని అలవర్చుకుంటారు. కానీ అంత అంతర్మధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వారేం చెబుతున్నారంటే... విశ్వాసం పెరిగితే నిజం చెబితే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న భయమే చాలా అబద్ధాలకి కారణం అవుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మనపట్ల వారికి తగిన నమ్మకాన్ని కలిగించాల్సిందే! మనతో వారు ఎలాంటి సమస్యని అయినా చెప్పుకోవచ్చుననీ... దానికి తగిన పరిష్కారం, సాంత్వన లభిస్తాయనీ నమ్మకం కలిగిన రోజున అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాదు. కారణాన్ని గ్రహించండి ప్రతీ అబద్ధం వెనుకా ఏదో ఒక కారణం ఉండవచ్చు. దాన్ని గ్రహించే ప్రయత్నం చేయమంటున్నారు. పిల్లలు సిగ్గుతోనో, భయంతోనో, అలవాటుగానో, ఎవరూ తెలుసుకోలేరనే ధీమాతోనో అబద్ధం చెప్పి ఉండవచ్చు. కారణం ఏమిటని కనుక గ్రహిస్తే వారి ఎదుగుదల గురించి విలువైన విషయాలు తెలుస్తాయి. మున్ముందు వారితో ఎలా మెలగాలో సూచన వినిపిస్తుంది. వయసుని బట్టి అబద్ధం ‘మా ఇంట్లో రివాల్వర్ ఉంది!’ అని ఓ పసిపిల్లవాడు అబద్ధం చెప్పాడే అనుకోండి. అది కేవలం గొప్ప కోసం చెప్పిన విషయం కావచ్చు. ‘మా కుక్క మాట్లాడుతుంది!’ అని ఓ 18 ఏళ్ల కుర్రవాడు చెబితే అతను సరదా కోసం చెప్పిన సంగతి కావచ్చు. పిల్లల వయసుని బట్టి వారు చెప్పే సందర్భాన్ని బట్టి ఒక విషయం అబద్ధమా కాదా అని తేల్చుకోవాల్సిందే కానీ ప్రతి విషయానికీ చిందులు వేయడం తగదు. విలువలు తెలిస్తే సరి నిజాయితీగా ఉండటం, చేసిన పనికి బాధ్యతని స్వీకరించడం, ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండటం... వంటి విలువలు పిల్లలకి తెలిస్తే వారి వ్యక్తిత్వం దృఢపడుతుంది. అబద్ధాలు చెప్పడం, పుకార్లు సృష్టించడంలాంటి పనులకు పాల్పడరు. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ద్వారానే పిల్లలకి ఇలాంటి విలువలు తెలుస్తాయి. మనమే వారి ముందు అబద్ధాలు చెబుతూ ఉంటే వారి ప్రవర్తన మరో రకంగా ఎలా ఉంటుంది? సమయం కేటాయించాలి పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వినేందుకు సిద్ధంగా ఉండాలి. వారితో గడిపేందుకు, వాళ్లు చెప్పే విషయాలు వినేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. వారి మాటల్ని ఏవో పిల్ల మాటలుగా సరిపెట్టేయకుండా... ఓపికగా వారి ప్రశ్నలకు తిరిగి జవాబు చెప్పాలి. అప్పుడే వారికి మనం విలువనిస్తున్న విషయం అర్థమవుతుంది. తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకునేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తుంది. అన్నింటికీ మించి అబద్ధం చెప్పడం సహజమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అబద్ధం చెప్పకుండా ఏ మనిషీ ఎదగడు. అది తప్పని తెలుసుకోకపోవడమే అసలు సమస్య! పై జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య రానే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు. - నిర్జర.
తల్లి కావడం అనేది ప్రతి స్త్రీకి అత్యంత సంతోషకరమైన,  బాధాకరమైన అనుభూతి. వారి స్వంత జీవితాన్ని పక్కన పెడితే, మహిళలు కొత్తగా ఒక  చిన్న జీవితానికి ప్రాణం పోస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రసవం తర్వాత వారి జీవనశైలి, దుస్తులు ధరించడం,  జీవనశైలి పూర్తిగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో తల్లి అయిన మహిళలకు  కుటుంబ మద్దతు చాలా అవసరం అవుతుంది.   ప్రతి తల్లి తన బిడ్డ గురించి చాలా భావోద్వేగంగా,  సున్నితంగా ఆలోచిస్తుంది. కొంతమంది దీనిని అర్థం చేసుకోలేరు. దీని కారణంగా చాలా సార్లు ప్రజలు తెలియకుండానే తల్లుల భావాలను దెబ్బతీసే  మాటలు అంటుంటారు. బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ ముందు ఎవ్వరూ పొరపాటున కూడా మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లవాడు ఏడుస్తున్నాడు, సరిగ్గా చూసుకో.. నీ బిడ్డ ఏడుస్తున్నాడు,  బిడ్డను సరిగ్గా చూసుకో అని ఎప్పుడూ తల్లికి చెప్పడం మంచిది కాదు.  రాత్రిపూట పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు  తరచుగా ఇలా అంటారు. ఇలా చెప్పడం సులువే.. తామేదో గొప్ప జాగ్రత్త చెప్పాం అనుకుంటారు. కానీ ఈ విషయం ఆ స్త్రీ యొక్క మాతృత్వ సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. బిడ్డ ఏడుపుతో ఎక్కువగా బాధపడేది తల్లి. అటువంటి పరిస్థితిలో పిల్లవాడిని ఊరుకోబెట్టడంలో  ఆమెకు మద్దతు ఇవ్వాలి తప్ప  పొరపాటున కూడా ఆమెను విమర్శించకూడదు. నీకు పిల్లవాడిని చూసుకోవడం చేతకాదు.. పిల్లవాడిని స్నానం చేయించడం నుండి పిల్లాడిని రెడీ చేసి,  పాలిచ్చి నిద్రపుచ్చడం వరకు ప్రతి స్త్రీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సార్లు స్త్రీలు చాలా కాలం తర్వాత కూడా బిడ్డను ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోలేరు.  వార గందరగోళానికి గురవుతూ ఉంటారు.  ఇలాంటి  సమయంలో కుటుంబం వారికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి తల్లి నేర్చుకునే ప్రయాణం భిన్నంగా ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో వారి సామర్థ్యాన్ని ప్రశ్నించే బదులు, వారికి మద్దతు ఇవ్వడం మంచిది. బిడ్డను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకుని చెడగొడుతున్నావు.. తల్లి,  బిడ్డల మధ్య స్పర్శ బిడ్డకు బంధం ,  భద్రతకు ఒక మార్గం. ఇది ఏ రకమైన "చెడు అలవాటు" కాదు. కాబట్టి బిడ్డను ఎప్పుడూ  చేతుల్లోనే ఉంచుకోవద్దని తల్లికి ఎప్పుడూ చెప్పకండి. బిడ్డకు తల్లి ఒడిలో అత్యంత సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ మాత్రం దానికే అలసిపోతావా? తల్లి అయిన తర్వాత బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి స్త్రీకి పూర్తి సమయం ఉద్యోగంగా మారుతుంది.  అది ఆమె నిర్వర్తించాల్సిన విధి కూడా. చిన్న పిల్లలు రాత్రంతా ఏడుస్తారు, అలాంటి పరిస్థితిలో  తల్లులు  రాత్రి నిద్రపోలేరు. అలాంటి పరిస్థితిలో నువ్వు బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం, నువ్వు ఎందుకు అంత అలసిపోతావు అనడం చేయకూడదు.  అది వాళ్ళని చాలా బాధపెడుతుంది. ప్రారంభ రోజుల్లో, ప్రతి తల్లి తనకోసం అరగంట కూడా కేటాయించుకోలేకపోతుంది.                          *రూపశ్రీ.  
  చాలామందిలో భయం సిగ్గు అనేవి లక్షణాలుగా ఉంటాయి. ఇవి చాలామంది సహజమే అనుకుంటారు. మరికొందరు అయితే వారి స్వభావమే అంత అనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్లో ఇలాంటి లక్షణాల గురించి నలుగురిలో ఉన్నప్పుడు మావాడికి భలే బిడియమండీ.. తనకు తాను ఏదైనా చేయాలంటే తడబడతాడు, మా అమ్మాయి చాలా మొహమాటస్తురాలు ఎవరితోనూ తొందరగా మాట్లాడదు, ఎవరితోనూ కలవదు అని చెబుతుండటం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ లక్షణాలు పిల్లల్లో ఉండటం వల్ల అదేదో బుద్దిమంతుల లక్షణం అన్నట్టు ఫీలైపోతారు చాలామంది తల్లిదండ్రులు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ లక్షణాలు మనిషిని ఎదగనీయకుండా చేస్తాయి.  బిడియపడే వ్యక్తి తనని తనే విభజించుకుంటాడు. ఆ వ్యక్తిలో ఆత్మస్థైర్యం  బలహీనంగా ఉంటుంది. ఇలా బిడియపడేవారికి కూడా  సమాజంతో అందరితో పరిచయం పెంచుకోవాలని అనిపిస్తుంది. పేరు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కానీ.. ఇవేమీ సాధించలేరు.  ఎందుకంటే బిడియపడే వ్యక్తి అంతరాత్మ ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటుంది. వీరిలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి.  ఒకటి.. ఇతరులతో స్నేహం చేయడంలో ప్రమాదాన్ని ఊహించడం. రెండు.. తన స్నేహన్ని ఇతరులు తక్కువగా చూస్తారని జంకడం. ఇలాంటి వ్యక్తులు అంగవైకల్యంతో బాధపడే రోగిలాగా ప్రవర్తిస్తారు. కేవలం ఈ ఒక్క లక్షణం వల్ల ఆ వ్యక్తి మొత్తం జీవితమే గందరగోళంగా తయారౌతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఏది చేయాలన్నా సిగ్గు బిడియాలు అవరోధకాలుగా మారతాయి. ఇకపోతే… ఈ సిగ్గు, బిడియం వల్ల కలిగే సమస్యల గురించి చెప్పుకుంటే...మితిమీరిన సిగ్గువల్ల మాటలు తడబడతాయి. కాళ్ళు వణుకుతాయి. అ వ్యక్తి అసంపూర్ణమైన వ్యక్తిత్వంతో మిగిలిపోతాడు అందరూ తనని తృణీకార భావంతో చూస్తున్నట్లుగా బాధపడతాడు. అతను తన అస్థిత్వాన్ని తాను ఋజువు పర్చుకోలేడు. సంఘ జీవితం అసంతృప్తిగా వుంటుంది. ఆఖరుకి అతని క్రింద ఉద్యోగస్థులు కూడా తనని ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద గౌరవిస్తున్నారని భావిస్తాడు. అంటే వ్యక్తి తనని తాను అల్పుడిగా భావించుకోవడం తనను అందరికంటే తక్కువగా చూసుకోవడం జరుగుతుంది.   వ్యక్తిలో ఎంతో ప్రతిభ ఉంటుంది కానీ..తన ప్రతిజ్ఞా పాటవాలని ఎలా ప్రదర్శించాలో, తవ క్రింద ఉద్యోగస్థుల యొక్క విస్వాశాన్ని ఎలా పొందాలో తెలియదు. బిడియం వల్ల అందరూ తక్కువ ధరకు కొనే వస్తువును బేరం ఆడలేక, అలా బేరం చేయడం చేతకాక, బేరం చేస్తే ఎవసరు ఏమనుకుంటారో అనే భావంతో  ఎక్కువధర చెల్లించి కొంటారు. ఇతరులు తనని చూసి నవ్వితే హేళనగా నవ్వుకుంటున్నారని భావిస్తారు. ఎవరన్నా  అభినందనలు తెలియచేస్తే అయోమయములో సరిపోతారు. ఇతరులు  చెప్పేదానిని ప్రతిఘటించడానికి భయపడిపోతారు.  మనుషుల్లో ఈ సిగ్గు, బిడియం అనేవి ఎందుకు చోటుచేసుకుంటాయి అంటే.. ఓ మనిషిలో సిగ్గు బిడియాలు చాలా కారణాల వల్ల కలుగుతాయి.  మొట్టమొదటి కారణం..   ప్రకృతి సహజమైన మనస్తత్వం. వ్యక్తిలో ఉన్న ప్రకృతి సహజంగా గుణం ఆ వ్యక్తిని సిగ్గుకు, భయానికి గురి చేస్తుంది. ఫలితంగా సున్నిత మనస్కులుగాను స్తబ్దులుగాను భయస్తులుగా, రూపొందుతారు.  రెండవ కారణం..  పరిసరాల ప్రభావం. వ్యక్తి మీద పరిసరాల ప్రభావం చాలా తీవ్రంగా చూపిస్తుంది. బాల్యంలో ఒంటరి జీవితం గడిపినా  లేదా తల్లిదండ్రులు అతిగా గారాబం చేయడం వల్ల కానీ, లేదా చిన్నతనం నుండి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మొదలైనవారికి దూరంగా ఉండటం వల్ల కానీ.. (చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలి. చదువుకునే పిల్లలు తిరగకూడదు, బయటకు వెళ్లకూడదు, ఆడుకోకూడదు వంటి నమ్మకాలతో పిల్లలను ఎక్కడికీ పంపరు, బంధువుల దగ్గరకు, స్నేహితులతో, బయట సరదాగా గడపడానికి ఇలా అన్నిటికీ దూరం ఉంచుతారు) చిన్నవయసులో  తల్లిదండ్రులచేత విపరీతమైన ఆంక్షలు, కట్టుదిట్టమైన జాగ్రతలు విధింపబడటం వల్లగాని, లేదా ఇవేమీ కాకపోయినా, బాల్యం నుంచీ యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలోనైనా తెలియకుండానే ఒకానొక బిడియం, సిగ్గు అలవాటైపోతాయి. కొందరిలో వయసు పెరిగేకొద్దీ ఈ బిడియం, సిగ్గు అనేవి తగ్గుతాయి. కానీ మరికొందరిలో ఇవి కూడా క్రమంగా పెరిగి జీవితంలో ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి. కారణమేదైనా, ఇటువంటి అనవసరమైన సిగ్గు బిడియాలు జీవితం తాలూకు సంతోషాలను ఆస్వాదించకుండా,  అమభవించనీయకుండా చేస్తాయి. కేవలం మనకి మనమే  సృష్టించుకుంటున్న ఈ పూర్తి మానసిక అవలక్షణం వల్ల జీవితమే దుర్భరమైపోతుంది. అయితే.. ఇలా సిగ్గుపడే వ్యక్తులు తమని తామే కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వారిలో మార్పు సాధ్యమవుతుంది.  ఎందుకు ? సిగ్గుకు, బిడియానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.   ఎలా?  సిగ్గును ఎలా ప్రకటిస్తారు?? తడబాటుతోనా లేదా భయపడుతూనా..  ఎర్రబడ్డ మొహంతోనా లేదా మనుషులకు దూరంగా వెళ్లడం ద్వారానా..  ఎప్పుడు? ఎటువంటి పరిస్థితుల్లో లేదా ఎవరి సమక్షంలో అధికంగా సిగ్గుపడతారు. అది ఎందుకు అలా జరుగుతోంది. ఎక్కడ? ఎక్కడ అంటే ఎలాంటి సందర్భాలలో ఈ లక్షణం అధికంగా బయటపడుతుంది?  ఈ ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలు వెతుక్కుంటే.. ఈ సిగ్గు, బిడియం అనే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు.                                      ◆నిశ్శబ్ద.
  భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయాన్నే పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నా, సాయంత్రం అలసట నుండి బయటపడాలన్నా టీ ఉండాల్సిందే.. అయితే రోజూ తాగే టీలో పాలు కలపడకుండా అందులో కాస్త నిమ్మరసం జోడిస్తే చాలా షాకింగ్ రిజల్ట్ ఉంటాయని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. దీన్నే లెమన్ టీ అంటారు.  రోజూ ఒక కప్పు లెమన్ టీ తాగడం మొదలుపెడితే  ఒకటి,  రెండు కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఇంతకూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి..  హైడ్రేషన్.. లెమన్ టీ  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి,  శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం. లెమన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,  ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, లెమన్ టీ సహజ నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయం,  మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ, బరువు.. ఎక్కువగా  జీర్ణ సమస్యలు ఎదుర్కునేవారు లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది. లెమన్  టీ జీర్ణ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం జీర్ణ సమస్యలకు మాత్రమే కాదు.. లెమన్ టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది.  కడుపు నిండిన  ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల  అనవసరమైన ఆకలిని కూడా నియంత్రించవచ్చు. చర్మం.. లెమన్  టీ  అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం,  ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా , ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు..  మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో కూడా లెమన్ టీ సహాయపడుతుంది.   ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడే  ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వాసన,  వేడిగా ఉండే లెమన్  టీ శరీరానికి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. లెమన్ టీలో లభించే పాలీఫెనాల్స్,  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. అవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. నిమ్మకాయలో నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా దుర్వాసనను తగ్గించడానికి,  చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ లెమన్ టీ తాగకూడదు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
   భారతీయులకు పరాఠాలు, రోటీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్ళలో  పూరీలు,  స్టఫ్డ్ చేసిన పరాఠాలు  చాలా సాధారణం. బంగాళాదుంపలు, పనీర్, జున్ను, మాంసం.. ఇట్లా చాలా పదార్థాలు పరాఠాల స్టఫింగ్ లో వాడతారు. పరాఠా రుచి ఇనుమడించడం కోసం చాలా రకాలుగా పరాఠాలు చేస్తుంటారు.  కానీ ఇట్లా పరాఠాలు చేయడం అన్ని విదాలుగా ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల పదార్థాలు స్టఫ్ చేసి పరాఠాలు తయారు చేసుకుని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కూడా సందేహం లేకుండా వస్తుంది అంటున్నారు. ఇంతకీ పరాఠాలలో స్టఫ్ చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రాసెస్డ్ చీజ్ లేదా మయోనైస్.. ఈ రోజుల్లో చీజ్ పరాఠాలు లేదా మాయో స్టఫ్డ్ రోల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ప్రాసెస్ చేసిన వస్తువులలో సంతృప్త కొవ్వులు,  రసాయన ప్రజర్వేటివ్స్  ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  ఊబకాయం,  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. సరిగ్గా ఉడికించని మాంసం లేదా కీమా..  పూర్తిగా ఉడికించకుండా ముక్కలు చేసిన మాంసం లేదా మటన్‌తో నింపితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.  గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది.  ఎక్కువ నూనెతో సుగంధ ద్రవ్యాలు.. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా ఏదైనా కూరటానికి ఎక్కువ నూనె,  సుగంధ ద్రవ్యాలు జోడించిన పదార్థాలు స్టప్ చేస్తే  అది  కడుపు  జీర్ణ శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఆమ్లతత్వం,  గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మిగిలిన కూరలు లేదా కూరగాయలు.. చాలా మంది మిగిలిపోయిన కూరగాయలను పరాఠాలలో ఉపయోగిస్తారు, కానీ ఏమైనా కాస్త పాడైన  కూరగాయలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ లకు  దారితీస్తాయి. అధిక ఉప్పు లేదా ఊరగాయ.. కొంతమంది  ఊరగాయ లేదా ఎక్కువ ఉప్పు జోడించడం ద్వారా పరాఠా రుచిని పెంచాలని కోరుకుంటారు. కానీ ఊరగాయలో ఉండే అధిక ఉప్పు కంటెంట్ కడుపులో చికాకు, ఆమ్లతత్వం,  అధిక రక్తపోటు వస్తుంది. అధిక ఉప్పు గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
   చాక్లెట్ అంటే అందరికీ ఇష్టం.. సాధారణ చాక్లెట్ లు అందరికీ తెలుసు కానీ  డార్క్ చాక్లెట్ గురించి చాలామందికి తెలియదు. కానీ డార్క్ చాక్లెట్ అంటే ఇష్టపడే వారికి మాత్రం దాని ప్రయోజనాలు కొద్దో గొప్పో తెలిసి ఉంటాయి.  ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ముడి లేదా ప్రాసెస్ చేయని బీన్స్ లేదా కోకో నుండి తయారుచేసిన డార్క్ చాక్లెట్ ను  మాత్రమే తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లభిస్తుంది. డార్క్ చాక్లెట్‌లోని కొవ్వు కోకో బటర్  నుండి వస్తుంది. అందువల్ల కృత్రిమ చక్కెర కలిగిన చాక్లెట్‌కు బదులుగా పరిమిత పరిమాణంలో డార్క్ చాక్లెట్ తినడం మంచిదని భావిస్తారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ప్రయోజనాలు.. డార్క్ చాక్లెట్ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే ఇందులో చాలా తక్కువ కేలరీలు,  చక్కెర కంటెంట్ ఉంటుంది.  దీనిని తినడం వల్ల ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు తీపి తినాలని అనిపించినప్పుడు ఓ ముక్క  డార్క్ చాక్లెట్‌ను  తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. ఈ చాక్లెట్ తీసుకోవడం ద్వారా హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇందులో ఆక్సీకరణ ఒత్తిడిని తొలగించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఐరన్, మెగ్నీషియం,  రాగి శరీరంలో శక్తిని నిలుపుకుంటాయి. నిద్ర సమస్యలు ఉన్నవారు  డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. దీని వల్ల  మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుందని  భావిస్తారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే, దీని వినియోగం ముఖంపై మెరుపును తెస్తుంది.  అయితే సరైన పరిమాణంలో తీసుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం డార్క్ చాక్లెట్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.  కానీ దానిని ప్రతిరోజూ తినకూడదు. దీనికి కారణం దానిలో ఉండే కెఫిన్. దాదాపు 100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ మొత్తం దాదాపు 80 మిల్లీగ్రాములు. డార్క్ చాక్లెట్‌లో పండ్ల సారం పేరుతో చక్కెరను కలిపే కంపెనీలు చాలా ఉన్నాయి.  చాక్లెట్ తినడం చాలా ఇష్టపడితే  డార్క్ చాక్లెట్ తినవచ్చు. కానీ  దీన్ని ప్రతిరోజూ తినకూడదు. డార్క్ చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల  ఏమవుతుంది? డార్క్ చాక్లెట్ తినడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ లేదా పెద్ద పరిమాణంలో తినేవారికి తలనొప్పి లేదా మైగ్రేన్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ప్రతిరోజూ దీన్ని తినడం మానుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..