బంగ్లా ప్రధాని తారిక ప్రమాణస్వీకారోత్సవానికి మోదీ దూరం!

Publish Date:Feb 15, 2026

Advertisement

 

బంగ్లాదేశ్‌లో రాజకీయాల్లో దశాబ్ద కాలానికి పైగా సాగిన ప్రతిష్టంభనకు తెరదించుతూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఢాకాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ప్రపంచ దేశాల నేతలు తరలిరానుండటంతో దౌత్యపరమైన వేడి రాజుకుంది. ముఖ్యంగా భారత ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందగా.. ఆయన వెళ్తారా లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతోంది. 

ఢాకాలోని పార్లమెంట్ హౌస్ సదరన్ ప్లాజా వేదికగా జరగనున్న తారిక్ ప్రమాణస్వీకరోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 17 ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. అనంతరం సాయంత్రం వేళ ప్రధాన మంత్రిగా తారిక్ రెహమాన్, ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎమ్ఎమ్ నాసిర్ ఉద్దీన్ ఈ ప్రమాణ స్వీకార ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత్, చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల అధినేతలకు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ అధికారికంగా ఆహ్వానాలు పంపారు.

ముఖ్యంగా ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే అదే రోజు ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీకి భేటీ కానున్నారు. గతంలోనే ఈ సమావేశాన్ని నిర్ణయించగా.. ఆయన ఈ పర్యటనకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రధాని మోడీ స్థానంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ భారత్ తరపున ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

తారిక్ రెహమాన్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం భారత్‌తో ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతోంది. గతంలో బీఎన్‌పీ హయాంలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. ఈసారి ఆ పార్టీ నేతలు ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వం గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ ఏ స్థాయిలో ఈ వేడుకకు ప్రాతినిధ్యం వహిస్తుందనే దానిపై ఇరు దేశాల భవిష్యత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయని దౌత్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

By
en-us Political News

  
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి.
నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అమెరికా సైనిక కార్యకలాపాలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయంటూ.. ఇరాన్ ఇప్పుడు టెక్‌ దిగ్గజాలైన అమెజాన్, ఒరాకిల్ వంటి సంస్థల డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌తో పాటు దుబాయ్‌లోని ఒరాకిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.
బయో గ్లాస్ మోడల్‌లో 12 రకాల విభిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇది వినియోగదారుడి కండరాల సంకేతాలను లేదా ముందే ప్రోగ్రామ్ చేసిన ఏఐ కమాండ్స్‌ను అర్థం చేసుకుని, వస్తువులను పట్టుకోవడం, రాయడం, చేయిని వివిధ దిశల్లో తిప్పడం వంటి పనులను అతి సులువుగా చేయగలదు. ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ లా చాలా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది.
ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది.
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.
ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. గురువారం అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్‌, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి కంపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.