తమిళనాడు సీఎం విజయ్.. రూటే సెపరేటు.!

Publish Date:Aug 8, 2026

Advertisement

మౌనాన్ని మించిన ఆయధం లేదని తమిళనాడు సీఎం విజయ్ నిరూపించారు. సాధారణంగా పొలిటీషియన్లు తమపై వచ్చే ఆరోపణలు, వ్యక్తిగత వివాదాపై  తీవ్రంగా స్పందిస్తుంటారు. ప్రజల్లో తమ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు మీడియా ముందుకొచ్చి ఖండనలు, వివరణలు, ప్రత్యర్థులపై విమర్శలు వంటివి చేస్తారు. అయితే.. ఈ విషయంలో  తమిళనాడు ముఖ్యమంత్రి,  టీవీకే అధినేత దళపతి విజయ్ మాత్రం తన రూటే సెపరేటు అంటున్నారు.

 రాజకీయ విమర్శలు,  వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఎదురైన సమయంలో కూడా ఆయన స్పందన పెద్దగా కనిపించలేదు.  ప్రత్యర్ధులపై తీవ్ర విమర్శలకు దూరంగా ఉండే ఆయన తీరు రాజకీయవర్గాలలో ప్రశంసలు అందుకుంటోంది.  ఓపిక,  సహనం, మాటల యుద్ధాలకు దూరంగా ఉండే విజయ్ వైఖరి ఆయనకు పొలిటికల్ గానూ, పర్సనల్ గానూ కూడా బాగా కలిసివస్తోందని చెప్పవచ్చు.  

గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో విజయ్ కుటుంబ జీవితంలో  పెద్ద వివాదం తలెత్తింది. ఆయన భార్య సంగీత విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని ప్రత్యర్థులు విజయ్ ను మానసికంగా దెబ్బ తీయడానికీ, ఆయన ప్రజాదరణను తగ్గించడానికీ వాడుకున్నాయి.  సొంత కుటుంబాన్నే సరిగ్గా నిర్వహించలేకపోయిన వ్యక్తి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఎలా మారుస్తారంటూ విపక్ష నాయకులు విమర్శలు గుప్పించారు.

అయినా  విజయ్  రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు.   తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.  ఆ సమయంలో  ఆయన తన కుటుంబంపై గానీ, భార్యపై గానీ  ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు.  విజయ్ చూపిన ఆ పరిణితి   ప్రజల్లోనూ విజయ్ పట్ల గౌరవాన్ని పెంచిందని చెప్పవచ్చు.   ఒత్తిడి ఉన్న సమయంలో కూడా నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండటం ద్వారా ఆయన తనపై వస్తున్న విమర్శలన్నింటికీ సమాధానం ఇచ్చినట్లయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Tamilnadu CM, Thalapathy Vijay, Tamil Nadu Politics, Vijay Sangeetha Divorce Case,  Vijay Political Strategy, Upperhand, Opposition

By
en-us Political News

  
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.